'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో అత్యధిక సంఖ్యలో చిన్న కార్లను విక్రయిస్తూ, ఈ విభాగంలో రారాజుగా కొనసాగుతోంది. అయితే, ఈ మేడ్ ఇన్ ఇండియా కంపెనీకి ఎస్‌యూవీ విభాగంలో బలమైన ఉత్పత్తులు బ్రెజ్జా తప్ప మరొకటి లేదు. అందుకే, కంపెనీ ఈ విభాగంలో పెద్దగా రాణించలేకపోతోంది. మారుతి సుజుకి పోటీదారులైన హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ఇతర కంపెనీలు మార్కెట్లో ఒకటి కంటే ఎక్కువ ఎస్‌యూవీలనే విక్రయిస్తున్నారు.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కూడా తమ ఎస్‌యూవీ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే, కంపెనీ ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. మారుతి సుజుకి నుండి రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీని "గ్రాండ్ విటారా" (Grand Vitara) పేరుతో పిలువనున్నారు. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించిన ఓ టీజర్ ని కూడా విడుదల చేసింది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

మారుతి సుజుకి విడుదల చేసిన టీజర్‌లో.. "ఎస్‌యూవీలపై ఆధిపత్యం చలాయించేందుకు ఓ కొత్త బ్రీడ్ ను ఆవిష్కరించబోతున్నాము. పరిచయం చేస్తున్నాం గ్రాండ్ విటారా. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ మరియు ఇది త్వరలోనే నెక్సా(NEXA)కి రాబోతోంది" అని పేర్కొంది. ఈ సారాంశాన్ని బట్టి చూస్తుంటే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఎస్‌యూవీ సరికొత్త పవర్‌ట్రైన్ ను కలిగి ఉంటుందని మరియు ఇది కేవలం నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

మారుతి సుజుకి రెండు రకాల డీలర్‌షిప్ కేంద్రాలను విక్రయిస్తోంది. వీటిలో అరెనా మరియు నెక్సా బ్రాండ్లు ఉన్నాయి. అరెనా డీలర్‌షిప్ లలో మారుతి సుజుకి తమ బడ్జెట్ కార్లను విక్రయిస్తుంటే, నెక్సాన్ డీలర్‌షిప్ లలో ప్రీమియం కార్లను విక్రయిస్తోంది. కాబట్టి, కొత్తగా రాబోయే గ్రాండ్ విటారా కూడా చాలా ప్రీమియంగా ఉండనుంది. టొయోటా విడుదల చేసిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీ మాదిరిగానే మారుతి సుజుకి గ్రాండ్ విటారా కూడా ఒకేరకమైన ప్లాట్‌ఫామ్ పై తయారు కానుంది. ఈ నేపథ్యంలో, రెండు మోడళ్లలో ఒకేరకమైన ఫీచర్లు మరియు పరికరాలను ఉండే అవకాశం ఉంది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి నెక్సా డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్‌లో నెక్సా ఎక్స్‌పీరియన్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లో ప్రస్తుతం నెక్సా బ్లూ కలర్ కోసం మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేయబడ్డాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారాను టయోటాకి చెందిన కర్ణాటక ప్లాంట్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌తో తయారు చేయనున్నట్లు సమాచారం.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

ఇవి రెండూ మోడళ్లు ఒకే ప్లాట్‌ఫారమ్ మరియు పవర్‌ట్రెయిన్ ఎంపికలను పంచుకుంటున్నప్పటికీ, గ్రాండ్ విటారా మారుతి సుజుకి యొక్క డిజైన్ లాంగ్వేజ్‌కి అనుగుణంగా మరింత స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది దాని టొయోటా క్లోనింగ్ నుండి వేరు చేయడంలో సహాయపడుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, దాని టొయోటా వెర్షన్ మాదిరిగా అదే కొలతలు కలిగి ఉంటుందని భావిస్తున్నారు. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 4,365 మిమీ పొడవు, 1,795 మిమీ వెడల్పు మరియు 1,635 మిమీ ఎత్తు మరియు 2,600 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

టొయోటా హైరైడర్ మాదిరిగానే మారుతి గ్రాండ్ విటారా కూడీ మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అనేది మారుతి సుజుకి యొక్క స్వంత కె15సి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ను కలిగి ఉంటుంది. ఈ మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 101.6 బిహెచ్‌పి పవర్ మరియు 135 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తుంది..

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్‌ విషయానికి వస్తే, ఇది మరింత శక్తివంతమైన 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ను కలిగి ఉండి మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారును కూడా కలిగి ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 113.4 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది e-CVT గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని ముందు చక్రాలకు పంపిణీ చేస్తుంది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ కాక్‌పిట్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రధానమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

'గ్రాండ్'గా రీఎంట్రీ ఇస్తున్న మారుతి సుజుకి 'గ్రాండ్ విటారా' ఎస్‌యూవీ.. ఇది బ్రెజ్జా కన్నా భేష్..!

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), EBD తో కూడిన ABS, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెండ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐఎస్ఓ యాంకర్ పాయింట్లు మరియు 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, July 11, 2022, 16:42 [IST]
English summary
Maruti suzuki grand vitara makes grand re entry bookings open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+