వావ్.. ఇప్పుడు 'మారుతి గ్రాండ్ వితారా' ఈ ఫీచర్‌తో రానుంది: వివరాలు
భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో తన కొత్త 'గ్రాండ్ వితారా' (Grand Vitara) ను ఈ నెల 20 న మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే కంపెనీ ఈ ఎస్‌యూవీ విడుదల చేయకముందే దీనికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు గ్రాండ్ వితారా పానోరమిక్ సన్‌రూఫ్‌తో రానున్నట్లు తెలిపే ఒక టీజర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మారుతి సుజుకి నుంచి రానున్న ఈ 2022 గ్రాండ్ వితారా ఇప్పుడు పానోరమిక్ సన్‌రూఫ్‌తో రానున్నట్లు తెలిసిపోయింది. కావున వితారాలో సన్‌రూఫ్ కావాలనుకునేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ఇప్పటికే ప్రారంభించింది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి కార్లలో సన్‌రూఫ్ ఆప్సన్ లేదు. కావున రానున్న మారుతి గ్రాండ్ వితారా అనేది సన్‌రూఫ్ పొందిన మొదటి మొదటి మారుతి కారు కానుంది. అయితే ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన 2022 వితారా బ్రెజ్జా సింగిల్ పేన్ సన్‌రూఫ్ పొందింది, కానీ గ్రాండ్ వితారా మాత్రం పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది.

కంపెనీ ఇప్పటికే విడుదల చేసిన ఒక టీజర్ ప్రకారం, దాని పరిమాణం స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకూండా ఈ టీజర్ లో కనిపించే బానెట్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓఆర్విఎమ్ మరియు టర్న్ ఇండికేటర్స్ వంటివి కూడా ఇందులో గమనించవచ్చు.

రెండు డోర్ హ్యాండిల్స్ మరియు రియర్ ప్రొఫైల్ లో టెయిల్‌లైట్ వంటివి కూడా ఈ టీజర్ లో గమనించవచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇందులో దాదాపు అన్నీ కూడా ఎల్‌ఈడీ లైట్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందు వైపు నుండి కొంత వాలుగా ఉండే డిజైన్ కలిగి వెనుక భాగం ఫ్లాట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ అనేది మారుతి సుజుకి యొక్క స్వంత కె15సి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ను కలిగి ఉంటుంది. ఇది 102 బిహెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభిస్తుంది.
ఇక స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్ విషయానికి వస్తే, ఇది మరింత శక్తివంతమైన 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ను కలిగి ఉండి మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారును కూడా కలిగి ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 113.4 బిహెచ్‌పి శక్తిని మరియు 141 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది e-CVT గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని ముందు చక్రాలకు పంపిణీ చేస్తుంది.

2022 మారుతి గ్రాండ్ వితారా లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో, 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ కాక్‌పిట్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రధానమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెండ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు మరియు 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లను పొందుతుంది.
మారుతి సుజుకి యొక్క గ్రాండ్ విటారా బిదరిలోని టయోటా ప్లాంట్‌లో తయారు చేయబడిన తరువాత డీలర్‌లకు రవాణా చేయబడుతుంది. టయోటా హైరైడర్ కూడా ఇదే ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది, పండుగ సీజన్ లో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త గ్రాండ్ వితారా ఇప్పుడు పానోరమిక్ సన్‌రూఫ్ రానున్నట్లు తెలిసింది. కావున మారుతి సుజుకి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. తద్వారా అమ్మకాలు కూడా తప్పకుండాపెరిగే అవకాశం ఉంది. మొత్తానికి కంపెనీ ఈ 2022 గ్రాండ్ వితారాను ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా తయారుచేయనుంది. అయితే ఇది మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతోందో చూడాలి. ఈ SUV గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








