విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి ఈ ఏడాది రాబోయే అతిపెద్ద లాంచ్ 'గ్రాండ్ విటారా' (Grand Vitara) మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా మారుతి సుజుకి నుండి వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి ఇప్పటికే అనేక ఫీచర్లు, వివరాలు వెల్లడి చేయబడ్డాయి. అయితే, కంపెనీ ఇంకా ఈ కారు ధరను అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో, కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

సమాచారం ప్రకారం, గ్రాండ్ విటారా ధరలు రూ. 9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. అంటే రాబోయే మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క బేస్ ‘సిగ్మా' వేరియంట్ ధర హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ యొక్క బేస్ వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 94,000 తక్కువగా ఉంది. అంతేకాకుండా, లీకైన సమాచారం కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క అన్ని ఇతర వేరియంట్‌ల ధరలను కూడా వెల్లడిస్తుంది.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా మిడ్-సైజ్ ఎస్‌యూవీని మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, జెటా ప్లస్, ఆల్ఫా ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ లో లీకైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క 'డెల్టా' ట్రిమ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.00 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 12.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

అలాగే, మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క ‘జెటా' ట్రిమ్ ధర రూ. 12.00 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు అదే ట్రిమ్ లోని ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 13.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇకపోతే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క టాప్-ఎండ్ 'ఆల్ఫా' ట్రిమ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 13.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు 'ఆల్ఫా' ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 15.00 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

సుజుకి బ్రాండ్ యొక్క పాపులర్ ఆల్-గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ యొక్క ‘ఆల్ఫా' ట్రిమ్ ధర రూ. 15.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఇకపోతే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ‘జెటా+' మరియు ‘ఆల్ఫా+' ట్రిమ్ లో లభిస్తుంది. ఈ రెండు వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 17.00 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మరియు రూ. 18.00 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలిచింది. ఈ హైబ్రిడ్ కారు లీటరు పెట్రోల్ తో గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ లోని 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌తో మరియు ఎలక్ట్రిక్ మోటారు రెండూ కలిపి మొత్తంగా 114.5 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. గ్రాండ్ విటారాలో లభిస్తున్న ఇతర మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ మాదిరిగా కాకుండా ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మంచి పవర్ డెలివరీ కోసం eCVT గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తుంది.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో తక్కువ ధర కలిగిన వేరియంట్లను కోరుకునే వారికి కంపెనీ ఇందులో మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా అందిస్తోంది. ఇందులోని 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ 101 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. అయితే, ఈ కారులోని ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ విషయానికి వస్తే, కంపెనీ ఆల్-గ్రిప్ అనే పేరుతో పిలుస్తుంది. ఇది ఇది స్విచ్ చేయగల మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ డ్రైవింగ్ మోడ్స్ లో స్పోర్ట్, స్నో, ఆటో మరియు లాక్ మోడ్స్ ఉన్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ పానోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉన్న మొదటి మారుతి సుజుకి కారు మాత్రమే కాకుండా, ఈ సెగ్మెంట్లో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను అందించే ఏకైక ఎస్‌యూవీ కూడా ఇదే.

విడుదలకు ముందే లీకైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు, క్రెటా కన్నా లక్ష రూపాయలు తక్కువే!

వేరియంట్ల వారీగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు ఇలా ఉన్నాయి:

  • గ్రాండ్ విటారా సిగ్మా మ్యాన్యువల్ - రూ.9.50 లక్షలు
  • గ్రాండ్ విటారా డెల్టా మ్యాన్యువల్ - రూ.11.00 లక్షలు
  • గ్రాండ్ విటారా డెల్టా ఆటోమేటిక్ - రూ.12.50 లక్షలు
  • గ్రాండ్ విటారా జెటా మ్యాన్యువల్ - రూ.12.00 లక్షలు
  • గ్రాండ్ విటారా జెటా ఆటోమేటిక్ - రూ.13.50 లక్షలు
  • గ్రాండ్ విటారా ఆల్ఫా మ్యాన్యువల్ - రూ.13.50 లక్షలు
  • గ్రాండ్ విటారా ఆల్ఫా ఆటోమేటిక్ - రూ.15.00 లక్షలు
  • గ్రాండ్ విటారా ఆల్ఫా మ్యాన్యువల్ 4x4 - రూ.15.50 లక్షలు
  • గ్రాండ్ విటారా జెటా ప్లస్ - రూ.17.00 లక్షలు
  • గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ - రూ.18.00 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, లీకైన రిపోర్ట్ ప్రకారం)

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara prices leaked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X