మారుతి సుజుకి నుంచి కొత్త గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త 'మారుతి సుజుకి గ్రాండ్ వితారా' (Maruti Suzuki Grand Vitara) ఎట్టకేలకు గ్లోబెల్ మార్కెట్లో ఆవిష్కరించబడింది. ఈ కొత్త ఎస్‌యూవీ ఆధునిక డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన మైలేజ్ కూడా అందిస్తుంది. ఈ కొత్త 'మారుతి గ్రాండ్ వితారా' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

గ్లోబెల్ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా కంపెనీ యొక్క ఎస్-క్రాస్ స్థానంలో ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క విక్రయాలు మారుతి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే జరుగుతాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున దీనిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు నెక్సా డీలర్‌షిప్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

మారుతి సుజుకి గ్రాండ్ వితారా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. ఇందులో 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు మరియు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు బ్రాండ్ యొక్క లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

గ్రాండ్ విటారా యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్లు మరియు సీట్లు అన్ని కూడా లెదర్ అపోల్స్ట్రే తో ఉన్నాయి.

అంతే కాకుండా ఇందులో డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్లు పొందుతారు. కలర్డ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 40 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మరియు సుజుకి కనెక్ట్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

కొత్త గ్రాండ్ వితారా మల్టిపుల్ కలర్ ఆప్సన్స్ లో విడుదలకానుంది. ఇందులో 6 మోనోటోన్ కలర్ ఆప్షన్‌లు మరియు 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా కొలతల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,795 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క 1.5-లీటర్ పెట్రోల్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 115.56 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. E-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజన్ 27.97 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది. ఇందులో ఎకో, పవర్ మరియు నార్మల్ వంటి మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

ఇక రెండవ ఇంజన్ 1.5-లీటర్ కె-సిరీస్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే పెట్రోల్ ఇంజన్. ఇది 103.06 హెచ్‌పి పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ, 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి వాటిని పొందుతుంది. గ్రాండ్ విటారా మాన్యువల్ 21.11 కిమీ/లీ, ఆటోమేటిక్ 20.58 కిమీ/లీ మరియు AllGrip మాన్యువల్ 19.38 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది. మొత్తం మీద ఇప్పుడు కొత్త గ్రాండ్ వితారా మంచి మైలేజ్ అందిస్తుంది. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ వితారాలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో కూడిన రియర్ డిస్క్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటికి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

మారుతి సుజుకి నుంచి గ్రాండ్ వితారా వచ్చేసింది.. మరిన్ని వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి ఆవిష్కరించిన కొత్త గ్రాండ్ వితారా భిన్నమైన మరియు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఫీచర్స్ కూడా అప్డేట్ చేయబడ్డాయి, ముఖ్యంగా ఇది అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి గ్రాండ్ వితారా ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ధరను ఇంకా వెల్లడించలేదు, త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Article Published On: Wednesday, July 20, 2022, 14:34 [IST]
English summary
Maruti suzuki grand vitara unveiled design features safety engine mileage color details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+