బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

దేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి, తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లో ఓ సిఎన్‌జి వెర్షన్ ను సైలెంట్ గా మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి (Maruti Suzuki Swift CNG) రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. ఇందులో స్విఫ్ట్ సిఎన్‌జి విఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 7.77 లక్షలు కాగా, స్విఫ్ట్ సిఎన్‌జి జెడ్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ. 8.45 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్విఫ్ట్ సిఎన్‌జి కోసం కంపెనీ బుకింగ్ లను కూడా ప్రారంభించింది. త్వరలోనే వీటి డెలివరీ కూడా ప్రారంభం కానుంది.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

దేశంలోనే అత్యంత శక్తివంతమైన సిఎన్‌జి పవర్డ్ హ్యాచ్‌బ్యాక్..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్తగా వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన సిఎన్‌జి పవర్డ్ హ్యాచ్‌బ్యాక్ గా నిలుస్తుంది. ఇందులోని 1.2 లీటర్ కె-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి ఇంజన్ సిఎన్‌జి మోడ్ లో గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 77.49 పిఎస్‌ల శక్తిని మరియు 4300 ఆర్‌పిఎమ్ వద్ద 98.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 89 పిఎస్ శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

దేశంలో అత్యుత్తమ మైలేజీనిచ్చే సిఎన్‌జి హ్యాచ్‌బ్యాక్..

మారుతి సుజుకి ప్రకారం, కొత్త స్విఫ్ట్ CNG మోడల్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత ఇంధన-సమర్థవంతమైన సిఎన్‌జి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తుంది. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి కేజీకి 30.90 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. మీ సమాచారం కోసం, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు 23.20 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుండగా, ఆటో గేర్ షిఫ్ట్ యూనిట్‌తో కూడిన స్విఫ్ట్ లీటరుకు 23.76 కిలోమీటర్ల మైలేజీని స్తుంది.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కోసం సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్..

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ కొత్త స్విఫ్ట్ కోసం ఓ ప్రత్యేకమైన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ కారును నేరుగా కొనుగోలు చేయకుండా, సబ్‌స్క్రిప్షన్ విధానంలో కూడా కొత్త స్విఫ్ట్ కారును లీజుకు లేదా అద్దెకు తీసుకోవచ్చు. దీనికోసం నిర్ధిష్ట అగ్రిమెంట్ ఉంటుంది మరియు స్విఫ్ట్ కోసం ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కేవలం రూ. 16,499 నుండే ప్రారంభమవుతుంది. అంటే ప్రతినెలా వినియోగదారులు పై మొత్తాన్ని చెల్లించడం ద్వారా స్విఫ్ట్ కారు కొంత కాలం పాటు లీజుకు తీసుకోవచ్చు. ఆ తర్వాత అదే కారును సొంతం చేసుకోవాలనుకుంటే, మిగిలిన మొత్తాన్ని చెల్లించి యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవచ్చు.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

మారుతి సుజుకి నుండి లభించే ఇతర సిఎన్‌జి కార్లు..

మారుతి సుజుకి నుండి కొత్తగా వచ్చిన స్విఫ్ట్ సిఎన్‌జి కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న ఆల్టో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ మరియు టూర్-ఎస్‌ వంటి ఇతర సిఎన్‌జి కార్ల సరసన అమ్ముడుకానుంది. ఈ కార్ల మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

ఆల్టో ఎస్-సిఎన్‌జి - 31.59 కిమీ/కిలో

వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి - 34.05 కిమీ/కిలో

సెలెరియో ఎస్-సిఎన్‌జి - 35.60 కిమీ/కిలో

డిజైర్ ఎస్-సిఎన్‌జి - 31.12 కిమీ/కిలో

ఈకో ఎస్-సిఎన్‌జి - 20.88 కిమీ/కిలో

ఎర్టిగా ఎస్-సిఎన్‌జి - 26.11 కిమీ/కిలో

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా సిఎన్‌జి కార్లను విక్రయించిన మారుతి..

మారుతి సుజుకి భారతదేశంలో కొత్త బిఎస్6 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత డీజిల్ కార్ల తయారీని పూర్తిగా నిలిపివేయడంతో, కొనుగోలుదారులు ఇప్పుడు మారుతి సిఎన్‌జి కార్లను ఆశ్రయించారు. దీంతో దేశంలో సిఎన్‌జి కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మారుతి సుజుకి ఇండియా ఇప్పటి వరకూ భారతదేశంలో 10 లక్షలకు పైగా సిఎన్‌జి వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం, మారుతి సుజుకి భారతదేశంలోనే అత్యధికంగా సిఎన్‌జి కార్లను విక్రయించే సంస్థగా అగ్రస్థానంలో ఉంది.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

భారతదేశంలో సిఎన్‌జి కార్లకు ఎందుకు అంత అధిక డిమాండ్..

భారత కార్ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఆధునిక ఉద్గార నిబంధనల నేపథ్యంలో డీజిల్ కార్లను తయారు చేయడం ఖరీదైన ప్రక్రియ కావడంతో కంపెనీలు డీజిల్ కార్ల తయారీని నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి. మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు కూడా కస్టమర్లను ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అధిక మైలేజీని కోరుకునే కస్టమర్లు ఇప్పుడు సిఎన్‌జి కార్ల వైపు క్యూ కడుతున్నారు. సాధారణ పెట్రోల్/డీజిల్ కార్లతో పోలిస్తే వాటి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కస్టమర్లు సిఎన్‌జి కార్లనే కొనేందుకు వేచి చూస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్‌జి స్విఫ్ట్ సిఎన్‌జి (Swift CNG) విడుదల, ధర రూ.7.77 లక్షలు

కొత్త స్విఫ్ట్ సిఎన్‌జి గురించి మారుతి సుజుకి సీఈఓ ఏమన్నారంటే..

"స్విఫ్ట్ బ్రాండ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ఐకానిక్ స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మారుతి సుజుకి నుండి నిరూపితమైన మరియు పరీక్షించబడిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్‌-సిఎన్‌జి టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. దాని పనితీరు, స్టైలింగ్ మరియు రోడ్ ప్రెజెన్స్‌తో ఈ కారు ఇప్పటికే 26 లక్షల మందికి చేరువైంది. ఇప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఎస్-సిఎన్‌జితో అందుబాటులోకి వచ్చింది. ఈ సిఎన్‌జి వెర్షన్ స్విఫ్ట్ కేజీకి 30.90 కిలోమీటర్ల అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో వినియోగదారులను ఆహ్లాదపరుస్తుందని భావిస్తున్నామని" మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 12, 2022, 17:11 [IST]
English summary
Maruti suzuki india launches swift cng price starts from rs 7 77 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+