కొత్త 2022 మారుతి ఎర్టిగా (2022 Ertiga) విడుదల; ధర రూ.8.35 లక్షలు.. ఇప్పుడు కొత్త ఇంజన్, గేర్‌బాక్స్‌తో..
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ కొత్త 2022 ఎర్టిగా (2022 Ertiga) ఎమ్‌పివి యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్ మరియు కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. భారత మార్కెట్లో కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 Maruti Suzuki Ertiga) ధరలు రూ.8.35 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

2022 Maruti Suzuki Ertiga - వేరియంట్లు, ధలు
కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ మొత్తం 11 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 3 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు, 2 సిఎన్‌జి వేరియంట్‌లు (మ్యాన్యువల్ మాత్రమే) మరియు 1 'టూర్' పెట్రోల్ వేరియంట్ అలాగే 1 'టూర్' సిఎన్‌జి వేరియంట్‌లు ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఉన్నాయి:
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎల్‌ఎక్స్‌ఐ: రూ. 8.35 లక్షలు
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ: రూ. 9.49 లక్షలు
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ: రూ. 10.44 లక్షలు (సిఎన్‌జి)
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఐ: రూ. 10.99 లక్షలు (ఆటోమేటిక్)
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ: రూ. 10.59 లక్షలు
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ: రూ. 11.54 లక్షలు (సిఎన్‌జి)
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ: రూ. 12.09 లక్షలు (ఆటోమేటిక్)
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ+: రూ. 11.29 లక్షలు
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా జెడ్ఎక్స్ఐ+: రూ. 12.79 లక్షలు (ఆటోమేటిక్)
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా టూర్ ఎమ్: రూ. 9.46 లక్షలు
* 2022 మారుతి సుజుకి ఎర్టిగా టూర్ ఎమ్: రూ. 10.41 లక్షలు (సిఎన్‌జి)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

2022 Maruti Suzuki Ertiga - ఎక్స్టీరియర్ అప్‌డేట్స్
కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొత్త గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ మినహా వేరే ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రధానమైన మార్పులన్నీ ఇంటీరియర్ మరియు ఇంజన్‌లో చేయబడ్డాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 7 విభిన్న ఎక్స్టీరియర్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లు కొత్తగా ప్రవేశపెట్టబడినవి.

2022 Maruti Suzuki Ertiga - ఇంటీరియర్ అప్‌డేట్స్
కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగాలో మొత్తం క్యాబిన్ లేఅవుట్‌లో ఎలాంటి మార్పు ఉండదు, ఇది మునుపటి మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఈ కొత్త 2022 ఎర్టిగాలో 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్ రిక్లైనర్ మరియు ఫ్లాట్ ఫోల్డ్ ఆప్షన్‌తో కూడిన 50:50 స్ప్లిట్ థర్డ్ రో సీట్స్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాకుండా, ఇందులో యాంటీ-పించ్ ఫీచర్‌తో కూడిన డ్రైవర్ సైడ్ ఆటో-విండో, ఫాలో మీ హోమ్ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రిట్రాక్టబుల్ కీ-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు S-CNG వేరియంట్‌లలో సిఎన్‌జి నిర్దిష్ట స్పీడోమీటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

2022 Maruti Suzuki Ertiga - సేఫ్టీ ఫీచర్లు
కొత్త 2022 ఎర్టిగాలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది. కాగా, హై-ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ మెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

2022 Maruti Suzuki Ertiga - ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్
కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కొత్త 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్ పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, కంపెనీ ఇందులో మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిమీ మైలేజీనిస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.11 కిమీ మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

2022 Maruti Suzuki Ertiga - 6 రోజుల్లో 6,000 బుకింగ్స్
కాగా, కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 Maruti Suzuki Ertiga) కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎమ్‌పివి కోసం కేవలం 6 రోజుల్లోనే 6,000 యూనిట్లకు బుకింగ్‌లు వచ్చిననట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

మారుతి సుజుకి దేశంలో ప్రతి నెలా దాదాపు 10,000 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇప్పుడు ఈ కొత్త మోడల్ రాకతో ఆ సంఖ్య మరింత పెరగవచ్చని కంపెనీ భావిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications