కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), తమ ప్రోడక్ట్ లైనప్ లోని కార్లను క్రమంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇటీవలే కొత్త 2022 బ్రెజ్జా (2022 Brezza) ఎస్‌యూవీని విడుదల చేసిన మారుతి సుజుకి, ఇప్పుడు కొత్తగా 2022 మోడల్ ఎస్-ప్రెస్సో (2022 S-Presso) హ్యాచ్‌బ్యాక్ ని విడుదల చేసింది. కొత్త ఫీచర్లు మరియు మెరుగైన మైలేజీనిచ్చే ఇంజన్‌తో వచ్చిన ఈ కొత్త అప్‌డేటెడ్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధరలు రూ. 4.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: వేరియంట్లు

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మొత్తం 6 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులో స్టాండర్డ్, LXi, VXi, VXi+, VXi(O) AGS మరియు VXi+(O) AGS వేరియంట్లు ఉన్నాయి. మారుతి ఎస్-ప్రెస్సో యొక్క బేస్ వేరియంట్ ధరలు రూ. 4.25 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు ఉంది. పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధరలు వేరియంట్ ను బట్టి సుమారు రూ. 40,000 నుండి రూ. 71,000 వరకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ధరలు

2022 ఎస్-ప్రెస్సో స్టాండర్డ్ మ్యాన్యువల్ - రూ.4.25 లక్షలు

2022 ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ మ్యాన్యువల్ - రూ.4.95 లక్షలు

2022 ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ మ్యాన్యువల్ - రూ.5.15 లక్షలు

2022 ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ ప్లస్ మ్యాన్యువల్ - రూ.5.49 లక్షలు

2022 ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ (ఆప్షనల్) ఏజిఎస్ - రూ.5.65 లక్షలు

2022 ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ ప్లస్ (ఆప్షనల్) ఏజిఎస్ - రూ.5.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

2022 మారుతి సుజుకి S-ప్రెస్సో: ఇంజన్ స్పెక్స్ మరియు మైలేజ్

కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కె10సి (K10C) పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ 998 సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ డ్యూయల్ జెట్ మరియు డ్యూయల్ వివిటి టెక్నాలజీని కలిగి ఉంది మరియు ఇందులో ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా జోడించబడింది. ఈ ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ కారణంగా ఇంజన్ నిర్ధిష్ట సమయం కంటే ఎక్కువ సేపు ఐడిల్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఆఫ్ చేయబడుతుంది మరియు తిరిగి క్లచ్ నొక్కగానే ఇంజన్ ఆన్ అవుతుంది. ఈ టెక్నాలజీ వలన ఇంధనం బాగా ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

ఈ ఇంజన్ పవర్ మరియు టార్క్ గణాంకాలను పరిశీలిస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి (మారుతి సుజుకి దీనిని AGS - ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ - అనే పేరుతో పిలుస్తుంది) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

ఇక మైలేజ్ విషయానికి వస్తే, కొత్త 2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో యొక్క స్టాండర్డ్ మరియు ఎల్ఎక్స్ఐ వేరియంట్లు లీటరుకు 24.12 కిమీ మైలేజీని అందిస్తుండగా, ఎస్-ప్రెస్సో విఎక్స్ మరియు విఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లు లీటరుకు 24.76 కిమీ మైలేజీని అందిస్తాయి. ఇకపోతే, ఏజిఎస్ ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 25.30 కిమీ మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి తెలిపిన వివరాల ప్రకారం, పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త 2022 మోడల్ మ్యాన్యువల్ రూపంలో 14 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుండగా, ఆటోమేటిక్ రూపంలో 17 శాతం అధిక మైలేజీనిస్తుంది.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఫీచర్లు మరియు కలర్ ఆప్షన్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఇప్పుడు అనేక అధునాతన ఫీచర్లతో లోడ్ చేయబడింది. వీటిలో కొన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త మోడల్ లో ఇప్పుడు హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి కొత్త ఫీచర్లు లభిస్తాయి. ఈ ఫీచర్ ఇప్పుడు ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో అమర్చబడిన అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ గా లభిస్తుంది. అలాగే, అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రిమైండర్‌, ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్ కూడిన ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా లభిస్తాయి.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ ప్లస్ ఆప్షనల్ వేరియంట్‌లు ఇప్పుడు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల అవుట్-సైడ్ రియర్ వ్యూ మిర్రర్లను స్టాండర్డ్ ఫీచర్ గా పొందుతాయి. కొత్త 2022 ఎస్-ప్రెస్సో ఇప్పుడు కొత్త క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ ను కూడా పొందుతుంది. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కొత్త మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ ను సాలిడ్ వైట్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ సిల్కీ సిల్వర్, పెర్లీ స్టార్రీ బ్లూ, సాలిడ్ సిజిల్ ఆరెంజ్ మరియు సాలిడ్ ఫైర్ రెడ్ అనే ఆరు కలర్లలో అందిస్తోంది.

కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి, ధర ఎంతంటే..

కొత్త 2022 ఎస్-ప్రెస్సో విడుదల సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఎస్-ప్రెస్సో దాని బోల్డ్ ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుందని, కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే 2,02,500 యూనిట్లకు పైగా ఎస్-ప్రెస్సో కార్లు విక్రయించబడ్డాయని, కొత్త రిఫైన్డ్ 1.0 కె-సిరీస్ డ్యూయల్ జెట్‌ మరియు డ్యూయెల్ వివిటి ఇంజన్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ప్ టెక్నాలజీతో వచ్చిన కొత్త 2022 మోడల్ ఎస్-ప్రెస్సో మెరుగైన ఇంధన-సామర్థ్యాన్ని అందించడంతో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లతో తమ కస్టమర్‌లకు ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2022, 14:23 [IST]
English summary
Maruti suzuki launches new updated 2022 s presso price starts at rs 4 25 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+