తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. మొదటి నెలలోనే రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

భారతీయ మార్కెట్లో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీ యొక్క వాహనాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయ SUV విభాగంలో దాదాపు 18 శాతం వాటాను కలిగి ఉంది. అయితే కంపెనీ ఇటీవల గ్రాండ్ విటారా (Grand Vitara) అనే కొత్త SUV ని దేశీయ విఫణిలోకి విడుదల చేసింది. మార్కెట్లో ఈ SUV విడుదల కాకముందే దీనికున్న ఆదరణ అంతా ఇంతా కాదు, ఎందుకంటే ఆ స్థాయిలో బుకింగ్స్ పొందగలిగింది. ఇటీవల డెలివరీలు కూడా స్టార్ట్ చేసింది.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

కంపెనీ గత నవరాత్రి ప్రారంభ సమయంలో సెప్టెంబర్ 26 న డెలివరీలను ప్రారంభించింది. అయితే డెలివరీలు ప్రారంభించిన మొదటి నెలలోనే మారుతి సుజుకి ఏకంగా 4,800 యూనిట్ల కార్లను డెలివరీ చేసి మంచి రికార్డ్ సృష్టించింది. అనుకున్నట్లుగానే బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు చేసేసింది.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

కంపెనీ ఈ SUV కోసం విడుదలకు ముందే బుకింగ్స్ స్వీకరించింది, ఆ తరువాత ధరలను అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఈ SUV యొక్క ధరలను వెల్లడించకముందే దాదాపు 40,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. మొత్తం మీద ఇప్పటికి ఆ బుకింగ్స్ సంఖ్య 60,000 దాటేసింది. ఇది పండుగ సమయంలో కంపెనీ సాధించిన అపూర్వభమైన విజయం అనే చెప్పాలి.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

గ్రాండ్ విటారాను మారుతి సుజుకి రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది మొత్తం 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, కావున టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మొత్తం 09 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు సింగిల్ టోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కావున కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్, నచ్చిన కలర్ లో ఎంచుకోవచ్చు.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

కొత్త మారుతి గ్రాండ్ విటారా అద్భుతమైన పనితీరుని అందించడానికి రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

మారుతి గ్రాండ్ విటారా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది, కావున ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. అంతే కాకుండా.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

మారుతి సుజుకి గ్రాండ్ విటారా చూడగానే ఆకర్షించే విధంగా రూపొందించబడింది. ఈ SUV ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

మారుతి సుజుకి యొక్క గ్రాండ్ వితారా పొడవు 4,345 మిమీ, వెడల్పు 1,645 మిమీ, ఎత్తు 1,795 మిమీ మరియు వీల్ బేస్ 2,600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహనం వినియోగదారులు లాంగ్ జర్నీలో కూడా ఏ మాత్రం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

కొత్త మారుతి గ్రాండ్ విటారా భద్రత పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

తిరుగులేని 'గ్రాండ్ విటారా'.. పండుగ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో మొదలైన పండుగ సీజన్లో చాలామంది కొనుగోలుదారులు కారు కొనాలని ఎదురు చూసారు, అలంటి కస్టమర్లకోసం కంపెనీ మారుతి సుజుకి తన 'గ్రాండ్ విటారా'ని తీసుకు వచ్చింది, ఇందులో భాగంగానే పండుగ సీజన్లోనే డెలివరీలను కూడా ప్రారంభించింది. రానున్న రోజుల్లో డెలివరీలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Thursday, October 6, 2022, 9:55 [IST]
English summary
Maruti suzuki new grand vitara sales 4800 units in september 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+