అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

2022 అక్టోబర్ నెల పూర్తి కావడంతో వాహన తయారీ సంస్థలన్నీ తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఇందులో మారుతి సుజుకి కూడా ఉంది. మారుతి సుజుకి గత నెలలో తన గ్రాండ్ వితరా SUV ని భారీ స్థాయిలో విక్రయించినట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన కొత్త గ్రాండ్ విటారా (Grand Vitara) ను దేశీయ విఫణిలోకి విడుదల కొన్ని రోజుల ముందే విడుదల చేసింది. ఈ SUV మార్కెట్లో విడుదలకాకముందు నుంచి మంచి సంక్యలో బుకింగ్స్ పొందింది. కాగా డెలివరీలను గత విజయదశమి సమయంలో ప్రారంభించింది. డెలివరీలు ప్రారంభమైన మొదటి నెలలో కంపెనీ ఏకంగా 4,770 యూనిట్లను డెలివరీ చేసింది.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

అక్టోబర్ 2022 లో కంపెనీ అంతకు ముందు నెల (2022 సెప్టెంబర్) కంటే రెట్టింపు డెలివరీలను చేయగలిగింది. అంటే కంపెనీ త నెలలో మొత్తం 8,052 యూనిట్లను విక్రయించింది. ఈ సందర్భంగా మొదటి సారిగా టాప్ 10 SUV విక్రయాల జాబితాలో గ్రాండ్ విటారా ఒకటిగా నిలిచింది.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

మారుతి సుజుకి తన కొత్త గ్రాండ్ విటారా కోసం ఇప్పటికే 57,000 కంటే కూడా ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది. ఇక ధరల విషయానికి వస్తే ఈ SUV బేస్ వేరియంట్ ధర రూ. 10.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కాగా టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

కొత్త మారుతి గ్రాండ్ విటారా అద్భుతమైన పనితీరుని అందించడానికి రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్.

ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

ఇక 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVTతో జతచేయబడి ఉంటుంది.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా టెయిల్‌గేట్‌పై పూర్తిగా వెడల్పు అంతగా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

మారుతి గ్రాండ్ విటారా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. అంతే కాకుండా.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

కొత్త 2022 గ్రాండ్ విటారా మొత్తం 09 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు సింగిల్ టోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కావున కొనుగోలుదారులు తమకు నచ్చిన వేరియంట్, నచ్చిన కలర్ లో ఎంచుకోవచ్చు.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

2022 మారుతి గ్రాండ్ విటారా భద్రత పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్‌, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

అప్పుడు గ్రాండ్ ఎంట్రీ.. ఇప్పుడు (2022 అక్టోబర్) గ్రాండ్ సేల్స్: తగ్గేదే లే అంటున్న 'మారుతి గ్రాండ్ విటారా'

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి తన కొత్త గ్రాండ్ విటారాను మార్కెట్లో విడుదల చేయకముంచు నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ కారణంగానే తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. కాగా గత నెలలో వరుస పండుగలు రావడం వల్ల మరిన్ని మంచి అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో కంపెనీ ఈ SUV ని మరింత ఎక్కువ సంఖ్యలో విక్రయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Maruti suzuki new grand vitara sales in 2022 october details
Story first published: Saturday, November 5, 2022, 9:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X