'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

భారతీయ మార్కెట్లో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత పటిష్టం చేయడానికి మరియు మార్కెట్లో ఉత్తమమైన అమ్మకాలను పొందటానికి ఎప్పటికప్పుడు కావాల్సిన సన్నాహాలు సిద్ధం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ కొత్త వాహనాలను కూడా దేశీయ విఫణిలో విడుదల చేస్తోంది.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన TVS Ronin | ధర మరియు వివరాలు

ఇటీవల మారుతి సుజుకి మార్కెట్లో 2022 బ్రెజ్జా విడుదల చేసింది. ఇప్పుడు తన జిమ్నీ మిడ్-సైజ్ ఆఫ్ రోడర్ ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి తన జిమ్ని ఎస్‌యువిని మొదటిసారి 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అప్పటి నుంచి కూడా ఆఫ్ రోడర్ వాహన ప్రియులు ఈ ఎస్‌యువి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారం అందిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆఫ్ రోడర్ ని తప్పకుండా భారతీయ తీరాలకు తీసుకువచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో దాదాపు 50 శాతం వాటాను పొందటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికోసం కంపెనీ కొత్త వాహనాలను మార్కెట్లో ప్రవేశపెట్టవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున రానున్న రోజుల్లో కంపెనీ ఈ జిమ్ని (Jimny) ని విడుదల చేసే అవకాశం ఉంది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

దీని గురించి మారుతి సుజుకి ఇండియా సీనియర్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు సేల్స్) 'శశాంక్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. మారుతి జిమ్నీ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇది త్వరలో దేశీయ మార్కెట్లో కూడా అరంగేట్రం చేసే ఆవకాశం ఉంది.

2020 ఆటో ఎక్స్‌పోలో మారుతి జిమ్నిని 3-డోర్స్ వెర్షన్ గా పరిచయం చేసారు, కానీ ఇది 5-డోర్స్ వెర్షన్ లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ దీనిపైనే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త ఆఫ్ రోడర్ యొక్క టీజర్ వీడియోలు కూడా ఇదివరకే చాలా విడుదలయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో వస్తుంది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

మారుతి జిమ్ని ఎస్‌యువి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది యు-షేప్ మెషిన్డ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, బంపర్‌పై టెయిల్ ల్యాంప్స్ మొదలైనవి కలిగి ఉంటుంది. ఇందులో 5-డోర్ వెర్షన్‌ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు AWD (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

మారుతి జిమ్నీ ప్రస్తుతం మహీంద్రా థార్ వంటి మూడు-డోర్ల మోడల్‌గా మాత్రమే అందించబడుతోంది. ఈ వెర్షన్ ఇప్పటికే భారతదేశంలో తయారు చేయబడుతోంది, అయితే ఇది కేవలం ఎగుమతి చేయడం కోసం మాత్రమే.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

ఈ కొత్త జిమ్నీ డ్యూయల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో చిఫ్ఫోన్ ఐవరీ మెటాలిక్, బ్రిస్క్ బ్లూ మెటాలిక్ మరియు సుపీరియర్ వైట్ వంటివి ఉన్నాయి. జిమ్నీ యొక్క జపనీస్ వెర్షన్ 1.5 లీటర్ VVT పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 102 బిహెచ్‌పి పవర్ మరియు 130 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

అయితే భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న మారుతి జిమ్నీ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్, 4-సిలిండర్ K15B SHVS పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది పెద్ద సైజు ల్యాడర్ చాసిస్ మీద నిర్మించనున్నారు. ఈ కారులో 4-వీల్ డ్రైవ్ సౌకర్యం ఉంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆఫ్ రోడర్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి జిమ్నీ కంపెనీకి చెందిన ప్రముఖ ఎస్‌యూవీ, ఎందుకంటే దీనిని విదేశీ మార్కెట్లలో కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కావున భారతీయ మార్కెట్లో ఈ ఆఫ్ రోడర్ విడుదలకావడానికి ఇంక ఎన్ని రోజులో లేదు. త్వరలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

'జిమ్ని' విడుదలపై లేటెస్ట్ సమాచారం అందించిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఆఫ్ రోడర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే దేశీయ మహీంద్రా కంపెనీ థార్ ఎస్‌యువిని మరియు ఫోర్స్ కంపెనీ గుర్ఖా ని విడుదల చేశాయి. అయితే ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చేసింది. కావున మారుతి సుజుకి తన 'జిమ్నీ' ని విడుదల చేసినట్లయితే భారతీయ మార్కెట్లో తప్పకుండా మంచి ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైతే మహీంద్రా థార్ ఎస్‌యువిని ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2022, 10:17 [IST]
English summary
Maruti suzuki plans to launch jimny suv in india soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+