ధరల గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకి.. 2023 జనవరిలో బ్రేకింగ్ న్యూస్

2022 సంవత్సరం ముగియడానికి ఇంక కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే రానున్న కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వాహన తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో మొదటగా 'మారుతి సుజుకి' పేరు వినిపిస్తోంది.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారు సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) 2023 జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఏ వాహనం మీద ఎంత ధరలను పెంచుతుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ మోడల్‌లను బట్టి ధరల పెరుగుదల జరుగుతుంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

ధరల గురించి షాకింగ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకి

త‌యారీ ఖ‌ర్చు పెర‌గ‌డంతో పాటు ద్ర‌వ్యోల్బణం కార‌ణంగా మారుతి సుజుకి కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది. ధరల పెరుగుదల కస్టమర్ల మీద ప్రభావం చూపకుండా ఉండటానికి తగిన ఉపాయాలను కూడా కంపెనీ ఆలోచిస్తోంది. కావున కస్టమర్లు ఏ మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

మారుతి సుజుకి అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం (2022) న‌వంబ‌ర్ నాటికి 1,59,044 యూనిట్ల వాహ‌నాలను విక్రయించగలిగింది. ఇందులో 1,35,055 వాహ‌నాలు భారతీయ మార్కెట్లో విక్రయించగా, విదేశీ మార్కెట్లలో విక్రయించిన వాహనాలు 19,738 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ తన అమ్మకాలను మరింత మెరుగుపరుచుకోవడానికి దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది.

మారుతి సుజుకి చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్ ప్రెస్సో కార్లు అత్య‌ధికంగా 18,251 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా స్విఫ్ట్, వితార బ్రెజా, ఎర్టిగా వంటివి మొత్తం 32,563 యూనిట్లు విక్రయించబడ్డాయి. మారుతి సుజుకి తమ వాహనాల ధరలను పెంచడం ఇదే మొదటి సారి కాదు. 2021 జనవరి నుంచి 2022 మార్చి నాటికి కంపెనీ తమ వాహనాల ధరలను దాదాపు 8.8 శాతం పెంచింది.

మారుతి సుజుకి ఇప్పుడు ధరల పెరుగుదలను గురించి ప్రకటించింది. త్వరలో మిగిలిన కంపెనీలు కూడా తప్పకుండా ధరల పెరుగుదలను గురించి వెల్లడిస్తాయి. ధరల పెరుగుదలకు కారణం ముడి సరుకుల ధరలు పెరగడమే కాదు, అన్ని కార్లలోనూ తప్పనిసరిగా ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలి, 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు మరియు వెనుక సీట్‌బెల్ట్ రిమైండర్‌ వంటివి ఉండాలని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులకు ముందే నిర్దేశించింది.

అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు అందించాలంటే తప్పనిసరిగా కొంత ధరల పెరుగుదల జరిగుతుంది. అయితే రోడ్డు ప్రమాదాల్లో తప్పకుండా ప్రయాణికులు రక్షించబడతారు. ఇది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిని దృస్టలో ఉంచుకుని ప్రభుత్వాలు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలి, 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు మరియు వెనుక సీట్‌బెల్ట్ రిమైండర్‌ వంటివి ఖచ్చితంగా వాహనంలో ఉండాలని ఆదేశించడం జరిగింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' 2023 కొత్త సంవత్సరంలో ధరలను పెంచితే విక్రయాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా.. అనేది తెలియాల్సిన విషయం. కంపెనీ తమ వాహనాల ధరలను ఏ మోడల్ పైన ఎంతవరకు పెంచుతుంది అనే మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki price hike from 2023 january details
Story first published: Saturday, December 3, 2022, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X