ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzki India Limited) గడచిన 2020 సంవత్సరంలో తమ కస్టమర్ల ప్రయోజనం కోసం ప్రారంభించిన 'మారుతి సుజుకి రివార్డ్స్' లాయల్టీ ప్రోగ్రామ్‌ ఇప్పుడు తన ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. మారుతి సుజుకి రివార్డ్స్ అనేది ఒక కాంపర్హెన్సివ్ రివార్డ్స్ ప్రోగ్రామ్. ఇది కంపెనీ అందిస్తున్న అరేనా, నెక్సా మరియు ట్రూ వాల్యూ అవుట్‌లెట్లలో కొనుగోలు చేసిన ప్యాసింజర్ వాహనాలను కస్టమర్లకు వర్తిస్తుంది.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా కస్టమర్లు అదనపు మారుతి కారును కొనుగోలు చేయడం, తమ మారుతి వాహనాలకు సర్వీస్ చేయించడం, మారుతి సుజుకి నుండి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం, అఫీషియల్ మారుతి సుజుకి యాక్ససరీస్ కొనుగోలు చేసినప్పుడు మరియు ఇతర కొత్త కొనుగోలుదారులను షోరూమ్‌కి పరిచయం చేయటం ద్వారా వచ్చే కస్టమర్ రెఫరల్స్ మొదలైన వాటి ద్వారా సదరు కస్టమర్లకు రివార్డ్స్ పాయింట్స్ లభిస్తాయి. ఇలా పొందిన రివార్డ్ పాయింట్స్‌ను కస్టమర్లు భవిష్యత్తులో మారుతి సేవలు / కొనుగోళ్ల కోసం ఉపయోగించుకోవచ్చు.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

మారుతి సుజుకి తమ కస్టమర్‌లతో ఎప్పటికప్పుడు పెరుగుతున్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్ ను పరిచయం చేసింది. ఈ ప్రోగ్రామ్ జీవితకాల సభ్యత్వం చెల్లుబాటు మరియు 10 సంవత్సరాల గరిష్ట పాయింట్ల చెల్లుబాటు వ్యవధిని అందిస్తుంది. ఇదొక కార్డ్-లెస్ ప్రోగ్రామ్, ఈ రివార్డ్ పాయింట్స్‌కి సంబంధించిన మొత్తం సమాచారం మరియు అన్ని లావాదేవీల అలెర్ట్స్ కస్టమర్ల యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిజిటల్‌గా పంపబడుతాయి.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

ఈ ప్రోగ్రామ్ కింద, కస్టమర్‌లు మెంబర్, సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం అనే నాలుగు శ్రేణులుగా వర్గీకరించబడుతారు మరియు మారుతి సుజుకి సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వారు చేసే అన్ని లావాదేవీలపై పాయింట్లను పొందుతారు. మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ అనేది ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రత్యేకమైన బ్యాడ్జ్‌లను రివార్డ్ చేసే ఒక రకమైన గేమిఫైడ్ లాయల్టీ ప్రోగ్రామ్, ఇది మారుతి సుజుకితో కస్టమర్‌ల పరస్పర చర్యను మరింత బహుమతిగా చేస్తుంది మరియు ప్రత్యేకమైన ఈవెంట్‌లకు మరియు ఆఫర్లకు యాక్సెస్‌ను అన్‌లాక్ చేసే అవకాశాన్ని వారికి అందిస్తుంది.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

ఈ కార్డ్-లెస్ లాయల్టీ ప్రోగ్రామ్ కస్టమర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిజిటల్‌గా పంపబడిన మొత్తం సమాచారం మరియు లావాదేవీ అలెర్ట్ లతో కస్టమర్‌లకు పూర్తిగా 100 శాతం డిజిటల్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ పూర్తిగా మారుతి సుజుకి రివార్డ్స్ మొబైల్ యాప్ (ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది) మరియు మారుతి సుజుకి రివార్డ్‌ల ప్రత్యేక వెబ్‌పేజీ రూపంలో ఏకీకృతం చేయబడింది.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

ఇవన్నీ కూడా మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ కోసం కస్టమర్‌లను ఎంగేజ్ చేయడానికి మరియు రిజిస్టర్ చేసుకోవడానికి ఏకీకృత వేదికగా పనిచేస్తాయి. కస్టమర్లు ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్‌ను పొందేందుకు www.marutisuzuki.com లేదా www.nexaexperience.com వెబ్‌సైట్‌లకు లాగిన్ అయ్యి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న మారుతి సుజుకి కస్టమర్‌లు https://www.marutisuzuki.com/more-from-us/maruti-suzuki-rewardsలో లాగిన్ కావడం ద్వారా మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోవడానికి, మారుతి సుజుకి కస్టమర్‌లు ప్రోగ్రామ్ బ్రోచర్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

ఈ రివార్డ్ ప్రోగ్రామ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇదొక క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్ లా ఉంటుంది. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డుతో చేసిన ఆర్థిక లావాదేవీలకు ఏరకంగా అయితే రివార్డ్ పాయింట్స్ పొందుతారో, అదే విధంగా మారుతి సుజుకి రివార్డ్ ప్రోగ్రామ్ లో ఎన్‌రోల్ చేసుకున్న వారు కూడా మారుతి సుజుకి డీలర్లు మరియు సర్వీస్ సెంటర్లలో చేసే లావాదేవీలకు మరియు కొత్త కస్టమర్ రెఫరల్స్ కు కూడా రివార్డు పాయింట్లు పొందుతారు.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

మారుతి సుజుకి రివార్డ్ ప్రోగ్రామ్ భారతదేశంలోని అన్ని అధీకృత మారుతి సుజుకి డీలర్‌షిప్‌లు మరియు సర్వీస్ సెంటర్లలో అంగీకరించబడుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ పొందిన కస్టమర్లు వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా తమ కార్ సర్వీస్, యాక్ససరీస్, స్పేర్ పార్ట్స్, అధనపు వారంటీ, ఇన్సూరెన్స్ కొనుగోళ్లు లేదా మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో నమోదు చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు.

ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మారుతి సుజుకి రివార్డ్స్.. అసలు ఈ ప్రోగ్రాం ఏంటంటే..?

మారుతి సుజుకి రివార్డ్స్ ప్రోగ్రామ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి రివార్డ్స్ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది. ఇది 7 మిలియన్ల కంటే ఎక్కువ మారుతి సుజుకి రివార్డ్స్ కస్టమర్‌లతో కూడిన ప్రోగ్రామ్. ఇది మా కస్టమర్‌లు మాపై ఉంచిన నమ్మకానికి మరియు వారితో మా విడదీయరాని బంధానికి తగిన నిదర్శనం. ఈ ప్రోగ్రామ్ కు లభిస్తున్న స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని" అన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 4, 2022, 9:38 [IST]
English summary
Maruti suzuki rewards program completes 2 years details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+