ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

భారతదేశంలో మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లకు ఉండే క్రేజే వేరు. మారుతి సుజుకి నుండి ఎలాంటి ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చినా, ఆ బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో కస్టమర్లు ఏ వివరాలు తెలుసుకోకుండానే కొనుగోలు చేసేందుకు క్యూ కడుతుంటారు. ఈ కంపెనీ పట్ల భారతీయుల్లో ఉన్న విశ్వసనీయత అలాంటిది మరి. ఇటీవలి కాలంలో మారుతి సుజుకి విడుదల చేసిన దాదాపు అన్ని మోడళ్లు కూడా విజయపథంలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ దేశీయ కార్ బ్రాండ్ నుండి వచ్చిన గ్రాండ్ విటారా కూడా మార్కెట్లో ఓ సక్సెస్‌ఫుల్ మోడల్ గా నిలుస్తోంది.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

మారుతి సుజుకి నుండి ఈ ఏడాది రాబోయే అతిపెద్ద లాంచ్ 'గ్రాండ్ విటారా' (Grand Vitara). కంపెనీ ఇప్పటికే ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి సంబంధించిన ఫొటోలు మరియు ఫీచర్ల వివరాలను అధికారికంగా వెల్లడి చేసింది. అయితే, దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర తెలియకపోయినప్పటికీ కస్టమర్లు మాత్రం ఈ కారును ముందుగా సొంతం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. కంపెనీ ఇటీవలే ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ మోడల్‌కు 20,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చి పడ్డాయి.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

ధర తెలియకుండానే ఈ ఎస్‌యూవీ 20 వేల మందికి పైగా బుక్ చేసుకున్నారంటేనే మారుతి సుజుకి బ్రాండ్ పై కస్టమర్లు ఉంచిన నమ్మకం ఏంటో స్పష్టమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం బుకింగ్‌లలో దాదాపు సగానికి పైగా బుకింగ్స్ ఖరీదైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ వేరియంట్ల కోసమే వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు ప్రధాన కారణంగా, ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ గ్రాండ్ విటారా అందించే మైలేజ్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ అనే రెండు రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో మైల్డ్ హైబ్రిడ్ మారుతి సుజుకి సంస్థకు చెందినది కాగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ టొయోటా సంస్థకు చెందినది. మారుతి సుజుకి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇప్పటికే ఎక్స్ఎల్6, ఎర్టిగా, బాలెనో వంటి కార్లలో లభిస్తోంది. ఇది అంత సమర్థవంతమైన హైబ్రిడ్ సిస్టమ్ కాదు. అయితే, టొయోటా తీసుకువచ్చిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ చాలా శక్తివంతమైనది మరియు ఇంధన సమర్థమైనది.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో కూడిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ లీటరు పెట్రోల్ తో గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ గణాంకాలతో ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలిచింది. ఈ పవర్‌ట్రెయిన్ లోని 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారు ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

గ్రాండ్ విటారాలో లభిస్తున్న ఇతర మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ (మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించేది) మాదిరిగా కాకుండా ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మంచి పవర్ డెలివరీ కోసం కేవలం eCVT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌ తో మాత్రమే లభిస్తుంది. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సిస్టమ్ లో, పెట్రోల్ ఇంజన్ తో పని లేకుండా కేవలం ఎలక్ట్రిక్ పవర్‌ తోనే కారును నడుపుకోవచ్చు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్వచ్ఛమైన విద్యుత్ శక్తితో 25 కి.మీ వరకు ప్రయాణించగలదు. రద్దీగా ఉండే మెట్రో నగరాల్లో ఇది చాలా విలువైన ఫీచర్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

ఇక మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో లో-ఎండ్ వేరియంట్ల మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ను అందిస్తుంది. ఈ ఇందన్ 101 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. అయితే, ఈ కారులోని ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

గ్రాండ్ విటారాలో చెప్పుకోదగిన మరొక ఉత్తమ ఫీచర్ ఏంటంటే, దాని ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్రాండ్ విటారా మారుతి సుజుకి నుండి లభిస్తున్న మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ వాహనం. కంపెనీ ఇందులో ఆల్-గ్రిప్ అనే పేరుతో పిలువబడే ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ ను అందిస్తుంది. ఇది స్విచ్ చేయగల మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ డ్రైవింగ్ మోడ్స్ లో స్పోర్ట్, స్నో, ఆటో మరియు లాక్ మోడ్స్ ఉన్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో పానోరమిక్ సన్‌రూఫ్‌ కూడా లభిస్తుంది.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

ఇక మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీలోని ఇతర ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, కంపెనీ ఈ కారులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, మొదలైనవి ఉన్నాయి.

ధర తెలియకుండానే 20,000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.. అట్లుంటది మారుతితోని..

చివరిగా ధర విషయానికి వస్తే, ఆన్‌లైన్ లో లీకైన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి గ్రాండ్ విటారా బేస్ వేరియంట్ (సిగ్మా మ్యాన్యువల్) ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.50 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ (ఆల్ఫా ప్లస్) ఎక్స్-షోరూమ్ ధర రూ.18.00 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. గ్రాండ్ విటారా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki s first strong hybrid car grand vitara gets more than 20000 bookings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X