మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

మారుతి సుజుకి (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో తన సిఎన్‌జి లైనప్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు దేశీయ విఫణిలో మరో కొత్త CNG కారుని విడుదల చేసింది. అదే 'మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి' (Maruti S-Presso CNG). ఈ కొత్త CNG కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి' (Maruti S-Presso CNG) ప్రారంభ ధర రూ. 5.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి LXi మరియు VXi. ఇందులో LXi వేరియంట్ ధర రూ. 5.90 లక్షలు కాగా, VXi వేరియంట్ ధర రూ. 6.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG వెర్షన్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీన్ని బట్టి చూస్తే పెట్రోల్ వేరియంట్ కంటే కూడా CNG వేరియంట్ ఖరీదైనది. అయితే మంచి మైలేజ్ అందిస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

మారుతి సుజుకి యొక్క సిఎన్‌జి లైనప్‌లో ఈ S-ప్రెస్సో CNG అనేది 10 వ మోడల్. S-ప్రెస్సో CNG యొక్క ఇంజిన్ 5300 ఆర్‌పిఎమ్ వద్ద 56.69 పిఎస్ పవర్ అందిస్తుంది. అయితే CNG మోడ్‌లో 3400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 82.1 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో CNG దాదాపుగా 32.73 కిమీ/కేజీ పరిధిని అందిస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

దేశీయ మార్కెట్లో కొత్త ఎస్-ప్రెస్సో CNG విడుదల సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో CNG కార్ల వినియోగం పెరుగుతోంది, అంతే కాకుండా మార్కెట్లో ఎస్-ప్రెస్సో అత్యంత విజయవంతమైన మోడల్ కావడం వల్ల ఇందులో CNG కోరుకునే వారికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది అన్నారు.

అంతే కాకూండా.. ఇప్పటికే ఎస్-ప్రెస్సో స్టాండర్డ్ వెర్షన్ దాదాపు 2.26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి, కావున రానున్న రోజుల్లో ఈ CNG వెర్షన్ కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నామన్నారు.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

కొత్త మారుతి ఎస్-ప్రెస్సో CNG వెర్షన్ ఫ్యూయెల్ ఆప్సన్ తో CNG ట్యాంక్ కలిగి ఉండటం వల్ల ఇప్పుడు అదనపు బరువును కూడా పొందుతుంది. అయితే ఈ కొత్త కారు యొక్క రైడ్ క్వాలిటీ మరియు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్‌ కూడా కొంత అప్డేట్ చేయబడింది. కావున మంచి పనితీరుని పొందవచ్చు.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

ఇదిలా ఉండగా ఇప్పుడు మారుతి సుజుకి యొక్క ఎస్-ప్రెస్సో పెట్రోల్-వెర్షన్ మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ దీపావళి పండుగ సమయంలో ఈ కారుపైన దాదాపు రూ. 55,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 4.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కావున కొత్త కారును కొనాలనుకునే కస్టమర్లు ఈ పండుగ సీజన్లో తప్పకుండా ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు గమనించాలి, అంతే కాకుండా ఈ ఆఫర్స్ గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ లో తెలుసుకోవచ్చు.

మారుతి ఎస్-ప్రెస్సో ఇప్పుడు CNG వెర్షన్‌లో.. ధర రూ. 5.90 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం CNG వాహనాలను ఆదరణ పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ వాహనాలను CNG వాహనాలను మారుస్తున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి గతంలో కూడా చాలా వరకు CNG కార్లను విడుదల చేసింది. CNG వాహనాల అమ్మకాలలో కూడా మంచి పురోగతిని పొందుతోంది. ఈ సమయంలో మరో పాపులర్ మోడల్ ఆయిన 'ఎస్-ప్రెస్సో' ని CNG వెర్షన్ లో తీసుకువచ్చింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.దీని గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు కొత్త కార్లు & బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2022, 17:41 [IST]
English summary
Maruti suzuki s presso s cng launched in india at rs 5 90 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+