CNG వెర్షన్‌లో విడుదలకానున్న మారుతి బ్రెజ్జా.. విడుదలకు ముందే వీడియో లీక్
మారుతి సుజుకి, టొయోట కంపెనీలు ప్రస్తుతం తమ కార్లను సిఎన్‌జి వెర్షన్లలో విడుదల చేయడానికి పూనుకున్నాయి. ఇందులో భాగంగానే మారుతి బాలెనొ సిఎన్‌జి, టొయోట గ్లాంజా సిఎన్‌జి కార్లు విడుదలయ్యాయి.
మారుతి సుజుకి' బాలెనొ సిఎన్‌జిని విడుదల చేసిన వెంటనే ఇప్పుడు 'బ్రెజ్జా'ను కూడా సిఎన్‌జి వెర్షన్లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త బ్రెజ్జా సిఎన్‌జి ఇటీవల డీలర్ స్టాక్ యార్డులో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా 'రియల్ గాడీ' అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో డీలర్ స్టాక్ యార్డులో ఉన్న మారుతి యొక్క బ్రెజ్జా సిఎన్‌జి చూడవచ్చు. ఇది చూడటానికి స్టాండర్డ్ మారుతి సుజుకి బ్రెజ్జా మాదిరిగానే కనిపిస్తుంది. ఇందులో క్రోమ్ తో చూడచక్కగా కనిపించే గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి.
అంతే కాకుండా ఇందులో డ్యూయల్ ఎల్ షేప్ డే టైమ్ రన్నింగ్ ఎల్ఇడిలతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ మరియు రియర్ హెవీ బ్లాక్ క్లాడింగ్ చూడవచ్చు. అదే సమయంలో పెట్రోల్ నింపడానికి ఉపయోగించే ఒక నాజిల్ పక్కన CNG నింపడానికి కూడా ఒక అదనపు నాజిల్ ఇందులో ఉంది.
ఇప్పటికి విడుదలైన ఈ వీడియోలో ఎక్స్టీరియర్ డిజైన్ మొత్తం చూడవచ్చు, కానీ ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ వెల్లడి కాలేదు. కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో ఫ్రీ-మౌంటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే మరియు సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి నాలుగు వేరియంట్స్ లో మాత్రమే అందుబాటులో రానున్నట్లు సమాచారం. అవి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్స్. ఈ వేరియంట్స్ అన్నీ కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి.
మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి అనేది ఎర్టిగా సిఎన్‌జి నుండి అదే 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. కావున ఇది పెట్రోల్ మోడ్‌లో 103 పిఎస్ పవర్ మరియు 136.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇక సిఎన్‌జి మోడ్‌లో 88 పిఎస్ పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ విడుదలవుతుంది. అయితే కంపెనీ బ్రెజ్జా సిఎన్‌జి యొక్క మైలేజ్ గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. ఇది తప్పకుండా దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా మంచి మైలేజ్ అందించే అవకాశం ఉంది.
మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జి స్టాక్ యార్డులో కనిపించింది కావున ఇక మార్కెట్లో అధికారికంగా విడుదల కావడానికి ఇంక ఎన్నో రోజులు లేదు అని అర్థమవుతోంది. కావున ఈ బ్రెజ్జా సిఎన్‌జి త్వరలోనే విడుదలకానుంది. బ్రెజ్జాలో సిఎన్‌జి వెర్షన్ కావాలనుకునేవారికి ఇది తప్పకుండా మంచి ఎంపిక అవుతుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








