మార్చి 2022లో టాప్ 10 కార్లు: ఫస్ట్ ప్లేస్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. మరి లాస్ట్ ప్లేస్‌లో..?
పెరిగిన కార్ల ధరలు మరియు పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కూడా, గడచిన మార్చి 2022 నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల వ్యాపారం జోరుగానే సాగింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా వచ్చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ జాబితాలో మారుతి సుజుకికి చెందిన కార్లే అధికంగా ఉన్నాయి. ఈ టాప్ 10 లిస్ట్ లో దాదాపు ఏడు మోడళ్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ఉండగా, చివరి స్థానంలో మారుతి సుజుకి ఈకో ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
మారుతి సుజుకి అందిస్తున్న టాల్ బాయ్ కార్ వ్యాగన్ఆర్ గడచిన నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ ఇందులో రిఫ్రెష్డ్ మోడల్ ను గత నెలలో మార్కెట్లో విడుదల చేసింది. డ్యూయెల్ టోన్ థీమ్ తో వచ్చిన వ్యాగన్ఆర్ కారుకి మంచి డిమాండ్ ఏర్పడింది. మార్చి 2022లో మారుతి సుజుకి మొత్తం 24,634 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. కాగా, మార్చి 2021లో ఇవి కేవలం 18,757 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో వ్యాగన్ఆర్ అమ్మకాలు 31 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
మారుతి సుజుకి తమ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ లో ఇటీవలే ఓ సిజఎన్‌జి వెర్షన్ ను కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగాయి. గడచిన మార్చి 2022 నెలలో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు 18,623 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2021లో) ఇవి 11,434 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సమయంలో డిజైర్ అమ్మకాలు 63 శాతం వృద్ధిని సాధించాయి. డిజైర్ సెడాన్ ఇప్పుడు పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
| Rank | Model | Mar'22 | Mar'21 | Growth (%) |
| 1 | Maruti WagonR | 24,634 | 18,757 | 31 |
| 2 | Maruti Dzire | 18,623 | 11,434 | 63 |
| 3 | Maruti Baleno | 14,520 | 21,217 | -32 |
| 4 | Tata Nexon | 14,315 | 8,683 | 65 |
| 5 | Maruti Swift | 13,623 | 21,714 | -37 |
| 6 | Maruti Vitara Brezza | 12,439 | 11,274 | 10 |
| 7 | Hyundai Creta | 10,532 | 12,640 | -17 |
| 8 | Tata Punch | 10,526 | 0 | - |
| 9 | Hyundai Grand i10 | 9,687 | 11,020 | -12 |
| 10 | Maruti Eeco | 9,221 | 11,547 | -20 |

మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)
మారుతి సుజుకి గడచిన ఫిబ్రవరి నెలలో తమ కొత్త 2022 మోడల్ బాలెనో కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌డేటెడ్ బాలెనో మునుపటి కన్నా మరింత దృఢంగా మరియు ఫీచర్ లోడెడ్ కారుగా మారింది. ఈ కొత్త మోడల్ ను కస్టమర్లు ఇప్పుడిప్పుడే స్వీకరించడం ప్రారంభించారు. గత నెలలో (మార్చి 2022లో) మారుతి సుజుకి మొత్తం 14,520 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాదితో పోలిస్తే, మార్చి 2021లో కంపెనీ మొత్తం 21,217 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ సమయంలో బాలెనో అమ్మకాలు 32 శాతం క్షీణించాయి.

టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా మోటార్స్ నుండి లభిస్తున్న అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఆప్షన్లతో లభిస్తున్న ఈ కారు అమ్మకాలు నిలకడగా ఉన్నాయి. ఈ కారు మార్చి 2022లో అత్యధికంగా అమ్ముడైన 4వ మోడల్‌గా అవతరించింది. మార్చి 2022లో టాటా మోటార్స్ మొత్తం 14,315 యూనిట్ల నెక్సాన్ కార్లను విక్రయించింది. కాగా, మార్చి 2021లో ఇవి కేవలం 8,683 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ సమయంలో నెక్సాన్ అమ్మకాలు 65 శాతం పెరిగాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
మారుతి సుజుకి డిజైర్ మాదిరిగానే మారుతి సుజుకి స్విఫ్ట్ కూడా కూడా ఈ ఇండో-జపనీస్ బ్రాండ్‌కు ఓ స్థిరమైన మోడల్ గా ఉంది. అయితే, ఈసారి డిజైర్ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మార్చి 2022లో మారుతి సుజుకి కేవలం 13,623 యూనిట్ల స్విఫ్ట్ కార్లను మాత్రమే విక్రయించింది. కాగా, మార్చి 2021లో, కంపెనీ 21,714 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు 37 శాతం క్షీణించాయి.

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza)
మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా. అయితే, ఇప్పుడు ఈ కారు ఈ టాప్ 10 జాబితాలో ఆరవ స్థానానికి పడిపోయింది. విటారా బ్రెజ్జా ఒకప్పుడు దాని విభాగంలో ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ఇందులో డీజిల్ ఇంజన్ మోడల్ ను కంపెనీ నిలిపివేయడంతో అమ్మకాలు క్రమంగా తగుతూ వస్తున్నాయి. అయితే, డీజిల్ ఇంజన్ లేనప్పటికీ, మారుతి సుజుకి మార్చి 2022లో 12,439 యూనిట్ల విటారా బ్రెజ్జా కార్లను విక్రయించగలిగింది. మార్చి 2021లో విక్రయించిన 11,274 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో ఇది 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇక ఈ జాబితాలోని చివరి నాలుగు మోడళ్లను గమనిస్తే, కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా (Hyundai Creta) ఎస్‌యూవీ గత నెలలో 10,532 యూనిట్లను విక్రయించింది. అయితే, మార్చి 2021 విక్రయాలతో (12,640 యూనిట్లతో) పోలిస్తే ఇవి 17 శాతం క్షీణించాయి. ఆ తర్వాతి (8వ) స్థానంలో టాటా మోటార్స్ నుండి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్ (Tata Punch) నిలిచింది. మార్చి 2022లో కంపెనీ మొత్తం 10,526 యూనిట్ల టాటా పంచ్ కార్లను విక్రయించింది.

హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ (Hyundai i10 Grand) మార్చి 2022లో 9,687 యూనిట్లను విక్రయించి 9వ స్థానంలో నిలిచింది. అయితే, మార్చి 2021లో ఈ మోడల్ అమ్మకాలు 11,020 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి 2021లో విక్రయించిన 11,020 యూనిట్లతో పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 12 శాతం తగ్గాయి. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). మార్చి 2022లో, మారుతి సుజుకి మొత్తం 9,221 యూనిట్ల ఈకో వాహనాలను విక్రయించింది. అయితే, మార్చి 2021లో విక్రయించిన 11,547 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 20 శాతం క్షీణించాయి.


Click it and Unblock the Notifications








