ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

దాదాపు రెండేళ్ల క్రితం కోవిడ్-19 మహమ్మారి తీసుకువచ్చిన విపత్కర పరిస్థితులను నుండి భారత ఆటోమొబైల్ పరిశ్రమ కోలుకుని, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. గగడచిన ఏప్రిల్ 2022 నెలలో భారతదేశంలో కార్ల అమ్మకాలు సాధించిన వృద్ధి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నెల‌లో భారతదేశంలో విక్రయించబడిన టాప్ 10 వాహనాలను పరిశీలిస్తే, ఇందులో 7 స్థానాలను ఆక్రమించిన మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని చెలాయించింది. ఏప్రిల్ 2022లో విక్రయించబడిన టాప్ 10 కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం రండి.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

1) మారుతి సుజుకి వ్యాగన్ఆర్ - 17,766 యూనిట్లు

ఈ జాబితాలో మొదటి స్థానంలో ఎప్పుడూ ఆల్టో లేదా స్విఫ్ట్ కార్లు కనిపిస్తుంటాయి. కానీ, ఈసారి అనూహ్యంగా మారుతి సుజుకి టాల్‌బాయ్ కార్ వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో (ఏప్రిల్ 2021లో) విక్రయించిన 18,656 యూనిట్లతో పోలిస్తే, మారుతి సుజుకి గడచిన ఏప్రిల్ 2022 నెలలో మొత్తం 17,766 యూనిట్ల వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు 4.77 శాతం (890 యూనిట్లు) తగ్గినప్పటికీ, వ్యాగన్ఆర్ మాత్రం మొదటి స్థానంలో నిలిచింది.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

2) మారుతి సుజుకి ఎర్టిగా - 14,889 యూనిట్లు

మారుతి సుజుకి తమ ఎర్టిగా మోడల్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టిన తర్వాత, ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ 2021లో కంపెనీ విక్రయించిన 8,644 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలతో పోల్చుకుంటే, కంపెనీ గడచిన ఏప్రిల్ 2022 నెలలో 14,889 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో ఎర్టిగా అమ్మకాలు 72.25 శాతం (6,245 యూనిట్లు) పెరిగాయి. కొత్తగా వచ్చిన 2022 మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వలన ఈ మోడల్ అమ్మకాలు పెరుగుదలను చూశాయి.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

3) టాటా నెక్సాన్ - 13,471 యూనిట్లు

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటైన టాటా నెక్సాన్ గత నెలలో ఈ జాబితాలో మూడవ స్థాన్ని దక్కించుకుంది. టాటా నెక్సాన్‌ను కంపెనీ పెట్రోల్, డీజిల్ మరియు ప్యూర్ ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లతో విక్రయిస్తుంది. టాటా Nexon EV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు మరియు టాటా ఇటీవలే 437 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మరింత శక్తివంతమైన వెర్షన్‌ నెక్సాన్ ఈవీని విడుదల చేసింది. గడచిన ఏప్రిల్ నెలలో టాటా నెక్సాన్ అమ్మకాలు 13,471 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఇదే సమయంలో ఇవి 6,938 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో నెక్సాన్ అమ్మకాలు 94.16 శాతం (6,553 యూనిట్లు) పెరిగాయి.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

4) హ్యుందాయ్ క్రెటా - 12,651 యూనిట్లు

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా ఎస్‌యూవీ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2021 లో కంపెనీ విక్రయించిన 12,463 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో క్రెటా అమ్మకాలు స్వల్పంగా 1.51 శాతం (188 యూనిట్లు) పెరిగాయి. ఏప్రిల్ 2022 నెలలో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు 12,651 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ క్రెటాలో కంపెనీ ఇటీవలే నైట్ ఎడిషన్ పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే, ఇది కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

5) మారుతి సుజుకి విటారా బ్రెజ్జా - 11,764 యూనిట్లు

దేశంలో ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా విక్రయాలు కూడా స్వల్పంగా మెరుగుపడ్డాయి. సెకండ్-జెన్ మోడల్ రాకతో రాబోయే నెలల్లో విటారా బ్రెజ్జా సరికొత్తగా మారుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 2021 నెలలో మారుతి సుజుకి విక్రయించిన 11,220 యూనిట్ల విటారా బ్రెజ్జా కార్లతో పోల్చుకుంటే, గడచిన నెలలో ఈ మోడల్ అమ్మకాలు 4.85 శాతం (544 యూనిట్లు) పెరిగాయి. ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ మొత్తం 11,764 యూనిట్ల విటారా బ్రెజ్జా కార్లను విక్రయించింది.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

6) మారుతి సుజుకి ఈకో - 11,154 యూనిట్లు

మారుతి సుజుకి అందిస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ ఈకో, భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్‌గా కొనసాగుతోంది. ప్రతినెలా సగటున 10 వేల యూనిట్లకు పైగా ఈకో వాహనాలను అమ్ముడవుతున్నాయి. అయితే, మారుతి ఈకో విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.75 శాతం (315 యూనిట్లు) తగ్గాయి. ఏప్రిల్ 2021 నెలలో మారుతి సుజుకి మొత్తం 11,469 యూనిట్ల ఈకో వ్యాన్‌లను విక్రయించగా, ఏప్రిల్ 2022 నెలలో 11,154 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

7) మారుతి సుజుకి బాలెనో - 10,398 యూనిట్లు

మారుతి సుజుకి యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో లో కంపెనీ ఓ అప్‌డేట్ వెర్షన్‌ను గడచిన ఫిబ్రవరి 2022లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ మోడల్ రాకతో బాలెనో అమ్మకాలు కూడా కొత్త ఎత్తులకు చేరుకుంటున్నాయి. అయితే, ఏప్రిల్ 2022 నెలలో మాత్రం బాలెనో మ్యాజిక్ పనిచేయలేదనే చెప్పాలి. ఏప్రిల్ 2021 నెలలో బాలెనో విక్రయాలతో పోలిస్తే, గత నెలలో బాలెనో విక్రయాలు 36.54 శాతం (5,986) క్షీణించాయి.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

8) మారుతి సుజుకి డిజైర్ - 10,701 యూనిట్లు

మారుతి సుజుకి డిజైర్ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న అద్భుతమైన సబ్-4-మీటర్ కాంపాక్ట్ సెడాన్. అయితే, గత నెలలో మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు సంవత్సరానికి 23,96 శాతం (3,372 యూనిట్లు) తగ్గి 10,701 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2021లో, మారుతి సుజుకి భారత మార్కెట్లో మొత్తం 14,073 యూనిట్ల డిజైర్‌లను విక్రయించింది.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

9) మారుతి సుజుకి ఆల్టో - 10,443 యూనిట్లు

మారుతి సుజుకి ఆల్టో ఒకప్పుడు సేల్స్ చార్ట్‌లలో రాజుగా ఉండేది కానీ ఇప్పుడు అది మొత్తం మీద 9వ స్థానానికి పడిపోయింది. ధరల పెరుగుదల మరియు లోయర్-ఎండ్ వేరియంట్‌ల డిస్‌కంటిన్యూ కారణంగా ఆల్టో అమ్మకాలు 39.65 శాతం (6,860 యూనిట్లు) తగ్గాయి. ఏప్రిల్ 2021లో, మారుతి సుజుకి భారతదేశంలో 17,303 ఆల్టో యూనిట్లను విక్రయించింది. కాగా, గత నెలలో ఇవి కేవలం 10,443 యూనిట్లుగా ఉన్నాయి.

ఏప్రిల్ నెలలో తలక్రిందులైన టాప్ 10 కార్స్.. అగ్రస్థానంలో నిలిచిన టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్..

10) టాటా పంచ్ - 10,132 యూనిట్లు

ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు దక్కించుకున్న రెండవ టాటా కారు, పంచ్. ఇది టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ, టాటా పంచ్ గడచిన అక్టోబర్‌ 2021 నెలలో భారతదేశంలో ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి ఇది మార్కెట్లో జోరుగా అమ్ముడవుతోంది. గడచిన ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ మొత్తం 10,132 పంచ్ ఎస్‌యూవీలను విక్రయించింది.

Most Read Articles

English summary
Maruti wagonr takes the lead in top 10 cars sold in april 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X