దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్: ధర రూ. 2.45 కోట్లు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) దేశీయ మార్కెట్లో తన కొత్త 'ఏఎమ్‌జి ఈక్యూఎస్ 53 4మాటిక్+' (AMG EQC 53 4matic+) సెడాన్ లాంచ్ చేసింది. ఈ కొత్త లగ్జరీ సెడాన్ ప్రారంభ ధర రూ. 2.45 కోట్లు. కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ సెడాన్ డీలర్‌షిప్‌లను చేరుకోవడం కూడా ప్రారంభించింది.
Recommended Video
భారతీయ మారేట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Mercedes-AMG EQS 53 4matic+ భారతదేశానికి CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కావున చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఇది స్పోర్టీ లుక్ పొందుతుంది. కావున ఫ్రంట్ ఫాసియాలో వర్టికల్ క్రోమ్ స్ట్రట్‌లతో కూడిన బ్లాక్ ప్యానెల్ గ్రిల్, బాడీ-కలర్ ఫ్రంట్ బంపర్, డిజిటల్ లైట్ హెడ్‌ల్యాంప్స్, మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో హై-గ్లోస్ బ్లాక్‌లో AMG సైడ్ సిల్ ప్యానెల్స్ చూడవచ్చు. ఇక్కడ ఏరో లేదా హెరిటేజ్ డిజైన్‌లో 21 ఇంచెస్ లైట్-అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

రియర్ ఫ్రొఫైల్ విషయానికి వస్తే, సెడాన్ బాడీ కలర్ ఆప్రాన్‌తో పెద్ద రియర్ స్పాయిలర్ మరియు డిఫ్యూజర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా వెనుక భాగంలో EQS 53 మరియు AMG వంటి బ్యాడ్జ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ సెడాన్ కి మరింత ఆకర్షణను అందిస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇప్పుడు హైపర్‌స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. ఇది మూడు స్క్రీన్‌లతో రూపొందించబడింది. డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ల కోసం స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 12.3- ఇంచెస్ సైజులో లభిస్తాయి. అయితే మధ్యలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మాత్రం 17.7-ఇంచెస్ యూనిట్‌గా ఉంటుంది. ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది.

క్యాబిన్ చాలా విశాలంగా ఉండటం వల్ల ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. అంతే కాకుండా క్యాబిన్ కార్బన్ ఫైబర్ ట్రిమ్ లో ఉంటాయి. డోర్ ప్యాడ్‌లు మరియు స్టీరింగ్ వీల్‌పై అల్కాంటారా ఫినిషింగ్ చూడవచ్చు. ఇందులో బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, మసాజింగ్ సీట్లు మరియు 64 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త EQS 53 4MATIC+ ఎలక్ట్రిక్ సెడాన్ AMG.EA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 658 బిహెచ్‌పి పవర్ మరియు 950 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. ఈ సెడాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ లో మొత్తం 5 డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి స్లిప్పరీ, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+ మరియు ఇండివిజువల్ మోడ్స్.

మెర్సిడెస్-బెంజ్ యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 570 కి.మీ పరిధి అందిస్తుండని సర్టిఫైడ్ చేయబడింది. కావున సుదూర ప్రయాణాలకు కూడా ఈ సెడాన్ చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ బ్యాటరీ ప్యాక్‌ను 200 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జ్ ద్వారా కేవలం 19 నిమిషాల్లో 300 కిమీ పరిధి అందించగల ఛార్జ్ చేయవచ్చు. అయితే ఇది 22 కిలోవాట్ ఏసీ ఛార్జర్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందించడమే కాకుండా, అన్ని విధాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో జర్మన్ కంపెనీ అయిన మెర్సిడెస్ బెంజ్ తన రెండవ ఎలక్ట్రిక్ కారు AMG EQS 53 4matic+ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ మంచి పనితీరుని అందిస్తుంది. అయితే మార్కెట్లో ఈ కారు ఆడి ఆర్ఎస్ ఈ-ట్రాన్ జిటి మరియు పోర్స్చే టైకాన్ టర్బోఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








