ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతదేశంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కారును విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ యొక్క పెర్ఫార్మెన్స్ విభాగం ఏఎమ్‌జి (AMG) తయారు చేసిన మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి (Mercedes-AMG GT) బ్లాక్ సిరీస్‌ ను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ ఈ కారును భారతదేశంలో కేవలం రెండు యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. దేశీయ విపణిలో మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్‌ ధర రూ. 5.50 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ యొక్క 2 యూనిట్లను మాత్రమే భారతదేశానికి దిగుమతి చేసుకోబడుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటిలో ఇప్పటికే ఓ కారు అమ్ముడైపోయింది. భారతదేశంలో మొదటి Mercedes-AMG GT బ్లాక్ సిరీస్ కారును బెంగుళూరుకు చెందిన బూపేష్ రెడ్డికి డెలివరీ చేయబడింది. అంటే, ఇక భారతదేశంలో విక్రయానికి మరొక్క కారు మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ చాలా ప్రత్యేకమైన సూపర్ కారు. ఇందులో శక్తివంతమైన ఫ్లాట్-ప్లేన్ క్రాంక్ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్‌ ఉంటుంది. ఇది 6700 ఆర్‌పిఎమ్ మరియు 6900 ఆర్‌పిఎమ్ మధ్యలో 720 బిహెచ్‌పి శక్తిని మరియు 2000 ఆర్‌పిఎమ్ నుండి 6000 ఆర్‌పిఎమ్ మధ్యలో 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ ఇంజన్ చాలా శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజన్.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

ఈ కొత్త Mercedes AMG GT బ్లాక్ సిరీస్ పవర్‌ప్లాంట్‌లో పెద్ద టర్బోచార్జర్‌లు, కొత్త ఇంటర్‌కూలర్, కొత్త క్యామ్‌షాఫ్ట్‌లు మరియు కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఇతర AMG GT మోడళ్లలో ఉన్న ఇంజన్‌తో పోలిస్తే ఈ ఇంజన్ కొత్త ఫైరింగ్ ఆర్డర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది, ఇది ఇంజన్ నుంచి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Mercedes AMG GT బ్లాక్ సిరీస్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది మరియు 9 సెకన్లలోపే గంటకు 200 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ 6:43.616 సమయంలో నూర్‌బర్గ్‌రింగ్‌ను ల్యాప్ చేసింది, ఇది 2020లో ఈ సూపర్‌కార్‌ను ఆవిష్కరించే సమయంలో జర్మన్ ట్రాక్ చుట్టిన అత్యంత వేగవంతమైన కారుగా నిలిచింది.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ అడాప్టివ్ డాంపర్‌లతో కూడిన కాయిల్-ఓవర్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ యాంటీ-రోల్ బార్ ఒక కార్బన్ ఫైబర్ యూనిట్, ఇది వెనుక యూనిట్‌తో పాటుగా కూడా సర్దుబాటు చేయబడుతుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ ముందువైపు 19 ఇంచ్ వీల్స్ మరియు వెనుక వైపున 20 ఇంచ్ వీల్స్ ని కలిగి ఉంటుంది. ఇదే ఈ కారుకి మరో ప్రత్యేకత. సాధారణంగా కార్లలో అన్ని చక్రాలు ఒకే సైజులో ఉంటాయి, కానీ ఈ స్పెషల్ కారులో మాత్రం ముందు చక్రాల కంటే వెనుక చక్రాలు కాస్తంత పెద్దవిగా ఉంటాయి. ఈ 10-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ పై హై-పెర్ఫార్మెన్స్ మిష్లిన్ పైలట్ స్పోర్ట్ కప్ 2 ఆర్ టైర్‌లు ఉంటాయి. ఈ టైర్లు ఈ కారు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్‌లో భారీ మల్టీ-లేయర్డ్ రియర్ వింగ్ కూడా ఉంటుంది, ఇది పెద్ద ఫ్రంట్ స్ప్లిటర్ మరియు ఇతర ఏరో బిట్‌లతో పాటు 2500 కెఎంపిహెచ్ వేగంతో మొత్తం 400 కిలోగ్రాముల డౌన్‌ఫోర్స్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ అనేది Mercedes-AMG లైనప్‌లోని ప్రస్తుత జిటి లైనప్ స్పోర్ట్స్ కార్ల యొక్క అంతిమ రూపం. ఇప్పటివరకు తయారు చేయబడిన 1,700లో కేవలం 2 మాత్రమే భారతదేశానికి రావడం మరియు ఉత్పత్తి ముగియడంతో, ఈ కారును మన రోడ్లపై చూడటం చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఈ కారు ధర అక్షరాలా రూ.5.50 కోట్లు.. భారత్‌కు 2 కార్లు మాత్రమే.. కొనే అదృష్టవంతులెవరో..

కొత్త AMG GT బ్లాక్ సిరీస్‌ను ప్రారంభించిన సందర్భంగా, Mercedes-Benz ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "భారతదేశంలో మొట్టమొదటి ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్‌ ను అందించడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము, ఇది ఆటోమోటివ్ ప్రపంచంలోనే అరుదైనది. పెర్ఫార్మెన్స్ మోటరింగ్ మరియు మోటారు రేసింగ్‌కు అత్యంత సామీప్యత కలిగినది. ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ డెలివరీ భారతదేశంలో పనితీరు ప్యూరిస్ట్‌ల కోసం మా గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుండి అత్యంత కావాల్సిన మరియు ప్రత్యేకమైన ఉత్పత్తులను పరిచయం చేయడం పట్ల మా నిబద్ధతను గట్టిగా నొక్కి చెబుతుంది. దీనికి ఏఎమ్‌జి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏఎమ్‌జి జిటి బ్లాక్ సిరీస్ సూపర్ కారు గ్లోబల్ అరంగేట్రం చేసినప్పటి నుండి, మరియు మేము మా కేటాయింపుల ఆధారంగా భారతదేశంలో ఈ ప్రత్యేకమైన మాస్టర్‌పీస్ యొక్క రెండు యూనిట్లను పంపిణీ చేస్తాము. బ్లాక్ సిరీస్ యొక్క రెండవ యూనిట్ వచ్చే నెలలో మా కస్టమర్‌కు డెలివరీ చేయబడుతుంది" అని చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2022, 18:11 [IST]
English summary
Mercedes amg gt black series launched in india prce starts at rs 5 5 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+