ధర రూ. 1.55 కోట్లు.. అయినా తగ్గని బుకింగ్స్: ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

భారతీయ మార్కెట్లో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) ఇటీవల 'ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' (EQS 580 4Matic) అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే EQS 580 అద్భుతమైన బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, Mercedes-Benz EQS 580 4Matic లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ఇప్పటికే 300 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. అయితే స్థానికంగా అసెంబుల్ చేయబడిన EQS 580 డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి, కాగా మరిన్ని కొత్త బుకింగ్లకు డెలివరీలు 2023 ప్రారంభంలో జరుగుతాయి.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త EQS 580 4Matic లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారు ముందస్తుగా రూ. 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 857 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ద్రువీకరించబడింది.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

కంపెనీ ఇందులో 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ అందించింది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 523 హెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ 200 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 300 కిమీ వెళ్ళడానికి కావాల్సిన ఛార్జింగ్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ అద్భుతమైన ఇంటీరియర్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మూడు స్క్రీన్స్ చూడవచ్చు. ఇందులో కూడా డ్రైవర్ మరియు ప్యాసింజర్ ముందు ఉన్న స్క్రీన్స్ ఒక్కొక్కటి 12.3 ఇంచెస్ ఉంటుంది. అయితే మధ్యలో 17.7 ఇంచెస్ ఉంటుంది. ఇది టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

అంతే కాకుండా ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ముందు ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్ సీట్లు, బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్ట్రేషన్ మరియు వెనుక ఉండే ప్యాసింజర్ల కోసం MBUX టాబ్లెట్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది చాలా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

కొత్త మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫ్రంట్ బంపర్‌లు ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉన్నాయి. ఇందులో బ్లాంక్డ్-అవుట్ గ్రిల్ మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 5 స్పోక్ డిజైన్ కలిగి 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. మొత్తం మీద ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా లేన్ కీప్ అసిస్ట్ మరియు ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్‌ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ కారు సేఫ్టీ విషయంలో యూరో NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. కావున వాహన వినియోగదారులు యొక్క భద్రతకు ఏ మాత్రం కొదువ లేదు.

EQS 580 బుకింగ్స్‌లో ఏ మాత్రం తగ్గేదేలే.. మెర్సిడెస్ బెంజ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ 300 యూనిట్ల బుకింగ్స్ పొందటం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ బుకింగ్స్ వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ దేశీయ మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్ జిటి, పోర్స్చే టైకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.ఇలాంటి మరిన్ని కొత్త కథనాల కోసం ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, October 13, 2022, 7:45 [IST]
English summary
Mercedes benz revealed eqs 580 luxury electric booking numbers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+