వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా ఆలోచించేంది, అవి పూర్తి చార్జ్ పై ఎన్ని కిలోమీటర్లు నడుస్తాయనే విషయం గురించి. సాధారణంగా, సిటీలో ఉండే వారికి తమ రోజూ వారి ఉపయోగం కోసం గటున రోజుకు పూర్తి చార్జ్ 200 నుండి 300 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లు అనువుగా ఉంటాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్లలో దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి మాత్రం ఈ రేంజ్ అస్సలు సరిపోదు. అందుకే, ఎలక్ట్రిక్ కార్లు ప్రధానమైన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

అయితే, ఎలక్ట్రిక్ కార్లలో కూడా సుధీర్ఘమైన రేంజ్ ను సాధించడం సాధ్యమే అంటోంది జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz). అనడమే కాదు, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 1000 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేసే ఓ ఎలక్ట్రిక్ కారును కూడా తయారు చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న 2022 సిఈఎస్ (CES 2022) లో మెర్సిడెస్ బెంజ్ తమ అధునాతన ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'విజన్ ఈక్యూఎక్స్ఎక్స్' (Vision EQXX) ను ఆవిష్కరించింది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం డిస్‌ప్లేకి మాత్రమే పరిమితమైన కాన్సెప్ట్ మోడల్ కాదు. ఇది పూర్తిగా రన్నింగ్ కండిషన్‌లో ఉందని, డ్రైవింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రోటోటైప్ అని మెర్సిడెస్ బెంజ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్కస్ స్కాఫెర్ కాన్సెప్ట్ తెలిపారు. అంతేకాకుండా, ఇది ఇప్పటికే ఉన్న MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వెర్షన్‌ను కూడా ఉపయోగిస్తుంది. ఇది మెర్సిడెస్-బెంజ్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఈవీ డ్రైవ్‌ట్రైన్ యొక్క మోడల్ ను ఉపయోగిస్తుంది మరియు వినూత్నమై బ్యాటరీ సాంకేతికతతో 2024 నాటికి ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

మెర్సిడెస్ బెంజ్ ఇటీవల ఆవిష్కరించిన EQE కంటే EQXX "కనీసం ఒక సెగ్మెంట్ చిన్నది" అని చీఫ్ డిజైనర్ గోర్డాన్ వాగెనర్ ధృవీకరించారు. ప్రస్తుతం, ఇది కంపెనీ విక్రయిస్తున్న సి-క్లాస్‌కు సమానమైన ఎలక్ట్రిక్‌ వెర్షన్ గా ఉంటుందని చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎక్స్ఎక్స్ ముందు భాగం తక్కువ లీడింగ్ ఎడ్జ్, చిన్న బోనెట్, షేప్లీ ఫెండర్‌లు మరియు పెద్ద వీల్‌హౌస్‌లతో మరింత స్పోర్ట్స్ కార్ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ మెర్సిడెస్ బెంజ్ గ్రిల్‌కు బదులుగా ఫ్రంట్ బంపర్‌లో స్టార్ గ్రాఫిక్‌ని కలిగి ఉంటుంది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

ఇందులోని డిజిటల్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లు పూర్తి-వెడల్పు ఎల్ఈడి లైట్ బార్‌తో కలిసి ఉన్నట్లుగా ఉంటుంది. ఈ కారు బరువును తగ్గించడానికి మరియు గరిష్ట ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, మెర్సిడెస్ స్టార్ లోగో బోనెట్‌లోకి స్టెన్సిల్ చేయబడి ఉంటుంది. 'ఎయిర్ కంట్రోల్ సిస్టమ్' అని పిలవబడేది కొత్త కాన్సెప్ట్ కారు యొక్క ముందు భాగం ద్వారా ఎయిర్ కర్టెన్‌లు మరియు ఎయిర్ బ్రీటర్‌ల శ్రేణిని ఉపయోగించి గాలిని క్రిందికి ప్రసారం అయ్యేలా చేస్తుంది. ఇది తొమ్మిదవ తరం ఎక్స్టీరియర్ గ్లాసెస్ మరియు కొత్తగా అభివృద్ధి చేసిన, ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎక్స్ కాన్సెప్ట్ యొక్క ఇంటీరియర్స్ ను గమనిస్తే, ఇందులో డ్యాష్‌బోర్డ్ మొత్తం డిజిటల్ స్క్రీన్ తో నిండిపోయి ఉంటుంది. లోపలి భాగంలో, డ్యాష్‌బోర్డ్ వెడల్పు అంతటా విస్తరించి ఉన్న భారీ 47.5 ఇంచ్ డిస్‌ప్లే సిస్టమ్ ఉంటుంది. ఈ డిస్‌ప్లే యూనిట్ 8K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది మరియు ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (డ్రైవర్ ముందు ఉన్న ప్రాంతం) మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క రెండు విధులను నిర్వహిస్తుంది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

మెర్సిడెస్ బెంజ్ క్యాబిన్ చుట్టూ స్థిరమైన పదార్థాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేసింది. ఈ మెటీరియల్స్‌లో బయో-స్టీల్ సిల్క్ లాంటి ఫైబర్, పుట్టగొడుగులు లేదా కాక్టస్ ఫైబర్‌ల నుండి తీసుకోబడిన శాకాహారి తోలు (వెజిటేరియన్ లెథర్), అలాగే వెదురు ఫైబర్‌లతో తయారు చేసిన కార్పెట్‌లను ఉపయోగించే ఫాబ్రిక్‌లు ఉన్నాయి. ఏసి వెంట్స్, డోర్ ట్రిమ్స్, సీట్ అప్‌హోలెస్ట్రీ, ఫ్రంట్ సీట్ నుండి వెనుక సీట్ వరకూ పొడగించిన సెంటర్ కన్సోల్, ఆంబియెంట్ ఎల్ఈడి లైటింగ్ అన్నీ కూడా చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపిస్తాయి.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

ఇక చివరిగా దీని డ్రైవ్‌ట్రైన్ విషయానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్ ఈఎక్యూఎక్స్ఎక్స్ కోసం యూకేకి చెందిన మెర్సిడెస్-ఏఎమ్‌జి హై పెర్ఫార్మెన్స్ పవర్‌ట్రెయిన్‌ల నుండి కీలకమైన సహకారాన్ని పొందింది దీని పవర్‌ట్రైన్ ను రూపొందించారు. ఈ యూకే విభాగానికి మెర్సిడెస్ ఫార్ములా 1 కార్ల కోసం శక్తివంతమైన వి6 టర్బో-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను రూపొందించిన చరిత్ర ఉంది. రియర్ వీల్ డ్రైవ్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రతి kWh కి 9.97km కంటే ఎక్కువ శక్తిని జనరేట్ చేస్తుంది.

వావ్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్.. తయారు చేసింది ఎవరంటే..?

ఇది WLTP పరీక్ష విధానంలో Mercedes-Benz EQS కంటే దాదాపు రెట్టింపు శక్తి. ఇందులో కొత్తగా అభివృద్ధి చేయబడిన అధునాతన ఎలక్ట్రిక్ మోటారు మరియు బెస్పోక్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగించారు. Mercedes-Benz Vision EXX ఎలక్ట్రిక్ కారును క్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 1000 కి.మీల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు కోసం బెంజ్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని ఉపయోగించినట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ ఎలక్ట్రిక్ కారుకు ఏరోడైనమిక్ లుక్ మరియు ఏ ఇతర కారులో లేని ఆకర్షణీయమైన భాగాలు అందించబడ్డాయి.

Most Read Articles

English summary
Mercedes benz vision eqxx concept ev unveiled at ces 2022 in las vegas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X