ఒక్క ఛార్జ్‌తో 1000 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే 'మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX' - వివరాలు

టెక్నాలజీ పరంగా ప్రపంచం వేగంగా పరుగెత్తుతోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆధునిక వాహనాలు అబ్బురపరిచే హంగులతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఒక కొత్త EV కాన్సెప్ట్ ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మోడల్ పేరు 'విజన్ ఈక్యూఎక్స్ఎక్స్' (VISION QXX). ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు చూడగానే చూపరులను కట్టిపడేసే విధంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 1,000 కంటే ఎక్కువ కిమీ రేంజ్ వాస్తవ ప్రపంచంలో అందిస్తుందని ఇప్పటికే తెలిసింది. ఇందులో ఫీచర్స్ కూడా ఊహకు అందని రీతిలో అద్భుతంగా ఉన్నాయి.

ఒక్క ఛార్జ్‌తో 1000 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX

డిజైన్ పరంగా మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX ముందు బంపర్‌పై ఎంబ్రాయిడరీ చేయబడిన చిన్న ట్రై పాయింటెడ్ స్టార్ ఎలిమెంట్‌లతో హెడ్‌లైట్‌లు ఉన్నాయి. వాలుగా రూఫ్‌లైన్ ఈ సెడాన్ మొత్తం వెనుకవైపు వరకు విస్తరించి ఉంటుంది. అంతే కాకుండా వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్స్ చూడవచ్చు. ఇవన్నీ ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ని చాలా ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

వెనుక భారంతో విజన్ EQXX బ్యాడ్జ్ దానికి కొంత పైన బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. ముందు భాగంలో కూడా బ్రాండ్ లోగో రేసర్ కార్లలో ఉన్న మాదిరిగా కనిపిస్తుంది. ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 47.5 ఇంచెస్ భారీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్క్రీన్ స్టీరింగ్ వీల్ వెనుక భాగం నుంచి ఆ తరువాత చివరి దాకా వ్యాపించి ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 1000 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX

మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX సెడాన్ లో 100 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది తక్కువ బరువుని కలిగి ఉన్నప్పటికీ మంచి పనితీరుని అందించేలా తాయారు చేయబడింది. ఈ బ్యాటరీ ఒక ఛార్జ్‌తో 1000 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. కాగా ఇందులో 245PS పవర్ అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటారు అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ నుండి విడుదలయ్యే శక్తిలో 95% చక్రాలకు పంపబడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX సెడాన్ లో తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఇది డ్రైవింగ్ చేసే సమయంలో కూడా సూర్యకాంతి ద్వారా ఛార్జింగ్ చేసుకోగలదు. దీని కోసం ఈ కారు యొక్క రూప్ సోలార్ ప్యానెల్స్‌ మాదిరిగా పనిచేస్తుంది. సోలార్ ఛార్జింగ్ సహాయంతో ఇది 25 కి.మీ వరకు అదనపు రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 100 కిమీ దూరం ప్రయాణించడానికి 8.7kWh విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 1000 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX

మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX టెస్టింగ్ సమయంలో దాని గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటరులుగా నమోదు చేయబడింది. ఈ సెడాన్ ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికి తక్కువ బరువుని (వెయిట్ లెస్) కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ బరువు 1,750 కేజీల వరకు ఉంటుంది. బరువు తక్కువగా ఉంటడం వాళ్ళ పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

నిజానికి కొత్త మెర్సిడెస్ బెంజ్ విజన్ EQXX కాన్సెప్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన '2022 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో' లో మొదటిసారిగా ప్రదర్శించబడింది. ఆ సమయంలోనే ఈ ఎలక్ట్రిక్ సెడాన్ మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటీవల ఈ ఎలక్ట్రిక్ కారు 1,008 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mercedes benz vision eqxx unveiled in india details
Story first published: Tuesday, December 13, 2022, 15:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X