Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతీయ మార్కెట్లో 2022 మార్చి 03 న మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్-క్లాస్ (Mercedes Maybach S-Class) విడుదలచేయనుంది. ఈ కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో విడుదల కానున్న జిఎల్ఎస్ యొక్క రెండు మోడల్. ఈ మోడల్ ప్రస్తుతం ప్రపంచ అమార్కెట్లో ఇప్పటికే విక్రయించబడుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

త్వరలో విడుదల కానున్న ఈ కొత్త మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ వి8 మరియు వి12 ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతో చాలా లేటెస్ట్ గా ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

కొత్త మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ S 680 4 మాటిక్ ఆల్ వీల్ డ్రైవ్‌తో కూడిన V12 ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ 612 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకూండా ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఇక ఇందులోని రెండవ ఇంజిన్ అయిన V8 8-సిలిండర్ ఇంజన్‌ 503 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

కొత్త మేబ్యాక్ S-క్లాస్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఇది క్రోమ్ ఫ్లాప్‌లు మరియు సిగ్నేచర్ గ్రిల్‌ వంటి వాటిని పొందుతుంది. ఇందులోని ముందు భాగంలో బ్రాండ్ లోగో చూడవచ్చు. మొత్తానికి ఇది బయటవైపు చూడగానే ఆకర్శించగలిగే డిజైన్ పొందింది.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఇక ఇందులోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది మసాజ్ ఫంక్షన్, లెగ్ రెస్ట్ మరియు వెనుక భాగంలో ఫోల్డింగ్ టాబ్లెట్, ఎలక్ట్రిక్ సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన వాటితో వాలు కుర్చీ పొందుతుంది. దీని డ్యాష్‌బోర్డ్, సెంట్రల్ కన్సోల్ మరియు ఆర్మ్‌రెస్ట్‌లు ఒకే యూనిట్‌లో విలీనం చేయబడ్డాయి.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఈ కొత్త మోడల్ 12-ఇంచెస్ OLED సెంటర్ డిస్‌ప్లే మరియు 12.3-ఇంచెస్ 3D డ్రైవర్ డిస్‌ప్లే వంటి మొత్తం ఐదు డిస్‌ప్లేలను కలిగి ఉంది. ఇవన్నీ కూడా వాహనం గురించి సమాచారాన్ని మొత్తం డ్రైవర్ కి అందిస్తాయి. కావున డ్రైవింగ్ సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఇదిలా ఉండగా మెర్సిడెస్-మేబాచ్ లైనప్ యొక్క మొట్టమొదటి ఎస్‌యూవీ ఈ జిఎల్‌ఎస్ 600 ఇప్పటికే భారతీయ మార్కెట్లో విడుదలైంది. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త వేరియంట్. దీని స్టాండర్డ్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600తో పోలిస్తే, ఈ మేబాచ్ వెర్షన్ ఎస్‌యూవీలో అనేక అప్డేట్డ్స్ జరిగాయి.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

కొత్త మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ బెస్పోక్ మెటీరియల్ మరియు ఫీచర్లు ఉంటాయి. వెనుక సీట్లు వెంటిలేషన్‌తో పాటుగా మసాజింగ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంటాయి. అంతే కాకుండా వెనుక సీటులోని ప్రయాణీకులకు మరింత అనుకూలమైన ప్రయాణాన్ని అందించడానికి ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్స్ కూడా ఉంటాయి.

Mercedes Benz నుంచి రానున్న మరో కొత్త కార్.. మార్చి 03 న విడుదల

ఈ కారులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో ఈ యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కెమెరా ద్వారా రోడ్ స్కాన్ చేసి, దానికి అనుగుణంగా సస్పెన్షన్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వలన ఈ ఆల్ట్రా-ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో డ్రైవింగ్ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 14, 2022, 19:09 [IST]
English summary
Mercedes maybach s class india launch 3rd march details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+