దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

ప్రముఖ జర్మన్ లగ్జరీ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో కొత్త 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్' (Mercedes-Maybach S-Class) విడుదలైంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ ధర రూ. 2.50 కోట్లు. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి S580 మరియు S680.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

మెర్సిడెస్ S580 అనేది స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది. అయితే S680 అనేది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేయబడుతుంది. S680 భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన మేబ్యాచ్ మోడల్. మేబ్యాక్ S-క్లాస్ అనేది దాని స్టాండర్డ్ ఎస్-క్లాస్ సెడాన్ కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్' అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ DRLలు మరియు బంపర్‌లపై క్రోమ్ ఫినిషింగ్‌ను పొందుతుంది. కారు ప్రీమియం రూపాన్ని మెరుగుపరచడానికి విండోస్ మరియు ORVMలపై క్రోమ్ లైనింగ్ ఉపయోగించబడింది. ఇందులో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,469 మిమీ, 1,921 మిమీ వెడల్పు, 1,510 మిమీ ఎత్తు మరియు 3,396 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది, ఇది మునుపటి తరం కంటే 31 మిమీ పొడవును అదనంగా పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

ఈ సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ ప్రారంభించింది. అయితే 2023 వరకు విక్రయించాల్సిన దాని అన్ని యూనిట్లు ఇప్పటికే పూర్తిగా విక్రయించబడ్డాయి. మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ కంపెనీ యొక్క S-క్లాస్ లైనప్‌లో అత్యంత ప్రీమియం సెడాన్. ఇది మరింత లెగ్‌రూమ్ కలిగి ఉండటమే కాకుండా ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

మొత్తం మీద ఇది ప్రీమియం ఫీచర్‌లతో అందించబడుతుంది. లేన్ అసిస్ట్ ఫీచర్‌తో పాటు లెవెల్-2 అటానమస్ డ్రైవింగ్ ఫంక్షన్‌ను కూడా కంపెనీ ఇందులో అందించింది. ఈ కారులో బర్మీస్టర్ హై-ఎండ్ 4డి సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. క్యాబిన్‌ను నిశ్శబ్దంగా ఉంచడానికి, ఇది అడ్జస్టబుల్ డంపింగ్ ADS+తో కూడిన ఎయిర్‌మేటిక్ ఎయిర్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది పవర్‌ట్రెయిన్, ESP, సస్పెన్షన్ మరియు స్టీరింగ్‌ను డైనమిక్ సెలెక్ట్ ద్వారా అడ్జస్ట్ చేస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

ఇవి మాత్రమే కాకుండా కారులో మేబ్యాక్ డ్రైవింగ్ మోడ్ కూడా ఉంది, ఇది పూర్తిగా రైడ్ సౌకర్యంపై దృష్టి పెట్టింది. మేబ్యాక్ S-క్లాస్‌లో MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన 5 డిస్‌ప్లే స్క్రీన్‌లను కంపెనీ అందించింది. కారు ఎడమ మరియు కుడి వైపులా ఎగ్జిక్యూటివ్ సీట్లతో డ్రైవర్ ప్యాకేజీని పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

ఇందులో సీట్లు కూడా స్వతంత్రంగా అడ్జస్ట్ చేయడానికి అనుమతించబడుతుంది. ఎత్తైన పైల్ ఫ్లోర్ మ్యాట్ మరియు డైనామికా రూఫ్ లైనర్‌తో ప్రత్యేకమైన నప్పా లెదర్‌ ఉంటుంది. స్టీరింగ్ వీల్ వుడ్ మరియు నప్పా లెదర్ ముగింపును పొందుతుంది. హై ప్రెసిషన్ లేజర్ కెమెరాల సహాయంతో అనేక గ్యాస్ట్రో కంట్రోల్స్ కూడా కారులో అందుబాటులో ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఎస్580 లో 4.0-లీటర్ వి8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 503 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో S 680 వేరియంట్ 612 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రెండు ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి. కావున పవర్ నాలుగు చక్రాలకు పంపబడతాయి. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

ఇది అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Mercedes Maybach S-Class: ధర రూ. 2.50 కోట్లు

మొత్తం మీద మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. కావున ఇది కంపెనీకి తప్పకుండా మంచి వృద్ధిని తీసుకురావడంలో దోహదపడుతుంది. కావున దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి అమ్మకాల సంఖ్యను సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాము.

ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ కార్లలో కూడా సుధీర్ఘమైన రేంజ్ ను అందించడానికి జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz). పూర్తి చార్జ్ పై గరిష్టంగా 1000 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేసే ఓ ఎలక్ట్రిక్ కారును కూడా తయారు చేసింది. అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న 2022 సిఈఎస్ (CES 2022) లో మెర్సిడెస్ బెంజ్ తమ అధునాతన ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'విజన్ ఈక్యూఎక్స్ఎక్స్' (Vision EQXX) ను ఆవిష్కరించింది.

More from DriveSpark

Article Published On: Thursday, March 3, 2022, 15:10 [IST]
English summary
Mercedes maybach s class limousine launched price features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+