మియా ఖలీఫా వాహన ప్రపంచం.. ఒక్కసారి తప్పకుండా చూడాల్సిందే..!!
ప్రముఖ పోర్న్ స్టార్‌గా అతి తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేమస్ అయిన 'మియా ఖలీఫా' (Mia Khalifa) గురించి దాదాపు అందరికి తెలుసు. మోడలింగ్ రంగంలో ప్రసిద్ధి చెందిన ఖలీఫా మొదట తన జీవితాన్ని పార్ట్ టైమ్ మోడల్‌గా ప్రారంభించింది. ఆ తరువాత కాలంలో ఫోర్న్ స్టార్ గా పాపులర్ అయిపోయింది.
మోడలింగ్ అంటే ఎంత ఇష్టమో ఈమెకి కార్లంటే కూడా అంతే ఇష్టం. ఈ కారణంగానే ఈమె అతి తక్కువ కాలంలోనే చాలా లగ్జరీ కార్లను కలిగి ఉంది. వీటి ధర దాదాపు 30 కోట్ల కంటే ఎక్కువ. మియా ఖలీఫా అటువంటి విలాసవంతమైన కారాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మియా ఖలీఫా వద్ద బెంట్లీ కాంటినెంటల్ జీటీ, జీప్ రాంగ్లర్, బీఎండబ్ల్యూ ఎం4, ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా,లెక్సస్ కంపెనీ యొక్క ఈఎస్ మరియు ఆడి ఆర్8 స్పైడర్ వంటివి ఉన్నాయి.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ (Bentley Continental GT):
మియా ఖలీఫా వద్ద అత్యంత ఖరీదైన కార్లలో 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ' (Bentley Continental GT) ఒకటి. దీని ధర 222,085 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర అక్షరాలా రూ.1,72,30,797. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా అధునాతన పరికరాలతో మరింత అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

బెంట్లీ కాంటినెంటల్ జీటీ లగ్జరీ కారులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 500 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 301 కిలోమీటర్లు. అదే సమయంలో ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. ఇది లీటరుకు 12.1 కిమీ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

జీప్ రాంగ్లర్ (Jeep Wrangler):
అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన 'జీప్' (Jeep) కంపెనీ యొక్క రాంగ్లర్ కూడా మియా ఖలీఫా వద్ద ఉంది. జీప్ రాంగ్లర్ అనేది కంపెనీ యొక్క అనేది అద్భుతమైన ఎస్‌యూవీ. జీప్ రాంగ్లర్ ధర సుమారు 31,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.24,051,81 అన్నమాట.

జీప్ రాంగ్లర్ (Jeep Wrangler) 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 268 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ యొక్క గరిష్ట వేగం గంటకు 180 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 7.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

బిఎండబ్ల్యూ ఎమ్4 (BMW M4):
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బిఎండబ్ల్యూ' (BMW) యొక్క ఎమ్4 (M4) కూడా మియా ఖలీఫా కలిగి ఉన్న కార్లలో ఒకటి. ఈ బిఎండబ్ల్యూ ఎమ్4 ధర రూ. 53,65,106 (69,150 డాలర్లు). ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

బిఎండబ్ల్యూ ఎమ్4 (BMW M4) 3.0 లీటర్ ఇన్‌లైన్ 6-సిలిండర్ ఎమ్-పవర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 443 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక లీటరుకు 10.75 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అంతే కాకూండా ఇది కేవలం 4.0 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. బిఎండబ్ల్యూ ఎమ్4 యొక్క గరిష్ట వేగం 250 కిమీ వరకు ఉంది. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

లెక్సస్ ఈఎస్ (Lexus ES):
మియా ఖలీఫా కలిగి ఉన్న కార్లలో లెక్సస్ ఈఎస్ (Lexus ES) కూడా ఒకటి. దీని ధర 39,900 డాలర్లు. అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.30,95,700. లెక్సస్ ఈఎస్ కారు 2.5-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి పవర్ మరియు 202 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఆడి ఆర్8 స్పైడర్ (Audi R8 Spyder):
ఆడి కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన ఆర్8 స్పైడర్ కూడా మియా ఖలీఫా లిస్ట్ లో ఉంది. ఈ ఆడి ఆర్8 స్పైడర్ ధర 154,900 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.1,20,18,148). ఈ అద్భుతమైన సూపర్ కారులో 5.0-లీటర్ వి10 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

ఆడి ఆర్8 స్పైడర్ సూపర్ కారులోని ఇంజిన్ 602 బిహెచ్‌పి పవర్ మరియు 506 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిలోమీటర్లు. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఆర్8 స్పైడర్ సూపర్ కార్ లీటరుకు 5.71 కిమీ మైలేజ్ అందిస్తుంది.

ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా (Ferrari F12 Berlinetta):
అత్యంత పాపులర్ బ్రాండ్ అయిన ఫెరారి యొక్క ఎఫ్12 బెర్లినెట్టా కారు కూడా మియా ఖలీఫా చెంత ఉంది. మియా ఖలీఫా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఫెరారీ యొక్క ఎఫ్12 బెర్లినెట్టా ప్రధానమైనది. దీని ధర 319,995 డాలర్లు. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం 2 కోట్ల రూపాయలకంటే ఎక్కువ. ఈ లగ్జరీ కారు 6.2-లీటర్ సూపర్‌ఛార్జ్డ్ వి12 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 730 బిహెచ్‌పి పవర్ మరియు 690 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లు.

మొత్తం మీద ఇది పాపులర్ మోడల్ మియా ఖలీఫా యొక్క అద్భుతమైన వాహన ప్రపంచం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరియు కొత్త బైకులు & కార్లను గురించి ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








