భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్: ధర రూ. 47.20 లక్షలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా (MINI India) దేశీయ మార్కెట్లో 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసింది. 'మినీ కూపర్ ఎస్ఇ' అనేది కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 47.20 లక్షలు. ఈ కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) బుకింగ్స్ కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభిస్తుంది. త్వరలో కంపెనీ కొత్త బ్యాచ్ యొక్క బుకింగ్‌లను కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క మొదటి బ్యాచ్‌లో కేవలం 30 యూనిట్లను మాత్రమే చేర్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ. 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మొదటి బ్యాచ్‌లోని మొత్తం 30 యూనిట్లు కేవలం 2 గంటల్లోనే బుక్ అయ్యాయి.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారు యొక్క డిజైన్ దాని మినీ కూపర్ మాదిరిగానే ఉంచబడింది, కానీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి. ఇలాంటి మార్పుల్లో ఒకటి ఫ్రంట్ గ్రిల్. ఇది కారును ఏరోడైనమిక్‌గా చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి, కొత్త కలర్ ఆప్సన్స్ లో ఆకర్షణీయమైన ఎల్లో కలర్ యాక్సెంట్స్ బార్‌లు మరియు మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్‌లతో అమర్చబడ్డాయి.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

మినీ ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ ఎల్ఈడీ DRLలతో రౌండ్ హెడ్‌లైట్‌ పొందుతుంది. ఎలక్ట్రిక్ హాట్ హ్యాచ్‌బ్యాక్ కొత్త 17 ఇంచెస్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను ఎల్లో కలర్ రిమ్‌లతో పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కాకుండా, కారు పిల్లర్లు అన్ని కలర్ ట్రిమ్‌లలో బ్లాక్ కలర్ లో ఉంచబడ్డాయి, ఇది కారుకు మంచి కాంట్రాస్ట్‌ని ఇస్తుంది.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

మినీ ఎలక్ట్రిక్ అనేది 3-డోర్ల కూపే, ఇది గో-కార్ట్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది తక్షణ టార్క్‌ను అందిస్తుంది మరియు సున్నా ఉద్గారాలను అందిస్తుంది. దీని కారణంగా, ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ కూడా కనిపించదు. ఈ కారు 184 బిహెచ్‌పి పవర్ మరియు 270 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

మినీ ఎలక్ట్రిక్ కేవలం 7.3 సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ కొత్త మరియు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 32.6 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 270 కి.మీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క మొదటి బ్యాచ్ డెలివరీ ఏప్రిల్ నెల నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

మినీ కూపర్ ఎస్ఈ భారతదేశంలో విక్రయించబడుతున్న బిఎండబ్ల్యు గ్రూప్ నుండి మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ప్రజాదరణ ఉంది, కావున మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ సంఖ్యలో విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ విభాగంలోకి మినీ కంపెనీ కూడా చేరిపోయింది.

భారత మార్కెట్‌కి MINI Cooper ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్ : ధర రూ. 47.20 లక్షలు

మినీ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ కారుని 2019 లో అధికారికంగా పరిచయం చేయబడింది. దీని తరువాత, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును 2021 అక్టోబర్ చివరి నుండి బుక్ చేయడం ప్రారంభించింది. కాబట్టి కంపెనీ విడుదల చేసిన ఈ మొదటి కారుకు మార్కెట్లో గొప్ప స్పందన లభిస్తోంది. ఇక డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారతదేశంలో విడుదలైన కొత్త మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారు, జాగ్వార్ ఐ-పేస్, ఆడి ఇ-ట్రాన్, బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్, ఆడి ఇ-ట్రాన్ జిటి మరియు పోర్స్చే టైకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఈ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2022, 14:11 [IST]
English summary
Mini cooper se electric car launched price features range details
Read more on: #మినీ #mini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+