దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

భారతదేశంలో ఇప్పటికే పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ పండుగ సీజన్ లో సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇందులో భాగంగానే మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో 'మున్నా భయ్యా' పాత్రను పోషించిన ప్రముఖ నటుడు 'దివ్యేందు శర్మ' ఇటీవల ఒక కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

నివేదికల ప్రకారం, దివ్యేందు శర్మ కొనుగోలు చేసిన లగ్జరీ కారు జర్మన్ కంపెనీ అయిన 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) యొక్క 'జిఎల్ఎస్ 400డి' (GLS 400d). ఇది చూడటానికి బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 1.16 కోట్లు (ఎక్స్ షోరూమ్).

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400డి అనేది ఎక్కువ మంది సెలబ్రెటీల మనసుదోచిన కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానా మరియు కృతి సనన్ మొదలైన వారు కూడా ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేశారు.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఎస్ 400డి విషయానికి వస్తే, ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ ఫాగ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా దీని ముందు భాగంలో బ్రాండ్ లోగో చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ మరియు రూఫ్ లైన్ వంటివి క్రోమ్ పొందుతాయి. కావున డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేసే 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉన్నాయి. వీటితోపాటు వైర్లెస్ ఛార్జర్, వాయిస్ కమాండ్ ఫీచర్, USB స్లాట్స్ మరియు పానరోమిక్ సన్ రూఫ్ వంటివి ఉన్నాయి.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400డి లో 2925 సిసి 6 సిలిండర్ డిఓహెచ్సి డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 3600 ఆర్‌పిఎమ్ వద్ద 326 బిహెచ్‌పి పవర్ మరియు 1200 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 238 కిమీ.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

జిఎల్ఎస్ 400డి మంచి డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 9 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు ఫార్వార్డ్ కొలీషియన్ వార్ణింగ్ వంటివి ఉన్నాయి. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

ఇటీవల ఆంధ్రరాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న ఆర్.కె. రోజా కూడా తన కొడుకు కోసం 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) యొక్క 'జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ (GLS 400D 4Matic) కారుని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ. 1.50 కోట్లు అని తెలిసింది.

దివ్యేందు శర్మ ఖాతాలో చేరిన ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు.. ధర అక్షరాలా కోటికి పైనే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సెలబ్రెటీలు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లలో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ పండుగ సమయంలో కొత్త కార్లు కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ నటి కీర్తి సురేష్ కూడా బిఎండబ్ల్యు బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 18, 2022, 15:40 [IST]
English summary
Mirzapur actor divyenndu sharma buys new mercedes gls price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+