భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు.. ఫెరారీ 296 జిటిబి నుంచి మెక్‌లారెన్ 765 LT స్పైడర్ వరకు

ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఒక పారిశ్రామిక వేత్త అత్యంత ఖరీదైన కారు 'మెక్‌లారెన్ 765 LT స్పైడర్' కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నాము, అయితే భారతదేశంలో విక్రయించిన లేదా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఫెరారీ 296 జిటిబి:

ఖరీదైన కార్లను తయారు చేసిన ప్రముఖ సంస్థ ఫెరారీ భారతీయ మార్కెట్లో '296 జిటిబి' విడుదల చేసింది. ఈ స్పోర్ట్స్ కారు ధర రూ. 5.50 కోట్లు. ఫెరారీ 296 జిటిబి కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 ఇంజన్‌ ఉంటుంది. ఇది 66hp ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి, 830hp పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు

ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్:

ఫెరారీ కంపెనీ యొక్క మరో కారు 'ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్'. దీని ధర రూ. 5.75 కోట్లు. ఈ సూపర్ ఫాస్ట్ కారు యొక్క పొడవైన హుడ్ కింద ఉన్న 6.5 లీటర్ వి 12 ఇంజిన్ 788 బిహెచ్‌పి పవర్ మరియు 718 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.

లంబోర్ఘిని అవెంటడార్ ఎస్‌వీజే:

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో లంబోర్ఘిని అవెంటడార్ ఎస్‌వీజే ఒకటి. దీని ధర రూ. 6.25 కోట్లు. ఇది అత్యంత శక్తివంతమైన 6,498 సీసీ వీ12 ఇంజన్ కలిగి 770 బిహెచ్‌పి పవర్ మరియు 720 ఎన్‌ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఇది కొత్త స్టైలింగ్, కొత్త ఫ్రంట్ బంపర్, మాసివ్ సైడ్ స్కర్ట్‌లు, రియర్‌ డిఫ్యూజర్, 20- ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి కలిగి ఉంటుంది.

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు

రోల్స్ రాయిస్ కల్లినన్:

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థలో చెప్పుకోదగ్గది మరియు అందరికి బాగా తెలిసిన బ్రాండ్ రోల్స్ రాయిస్. అయితే ఈ రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క కల్లినన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ. 6.95 కోట్లు. ఇందులోని 6.75 లీటర్స్ వీ12 ఇంజిన్‌ 653 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్:

మన కథనంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కూడా ఒకటి. దీని ధర అక్షరాలా రూ. 7.50 కోట్లు. ఈ ఖరీదైన కారుని భారతదేశం మొత్తం మీద ఇద్దరు మాత్రమే కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ సూపర్ కారు 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ పొందుతుంది. ఇది 769 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది బ్రాండ్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన కారు.

లంబోర్ఘిని అవెంటడార్ ఎల్పీ780-4 అల్టిమే:

లంబోర్ఘిని కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన 'అవెంటడార్ ఎల్పీ780-4 అల్టిమే' కూడా మార్కెట్లో అత్యంత ఖరీదైన కారు. ఈ కారు ధర రూ.9 కోట్లు. ఇది లంబోర్ఘిని కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన మూడవ కారు. ఇది అవెంటడార్ ఎస్‌వీజే మాదిరిగా అదే వి 12 ఇంజిన్ పొందుతుంది. ఇది 769 బిహెచ్‌పి పవర్ మరియు 720 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కేవలం 3 సెకన్లలో ఇది 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ (Rolls-Royce Wraith):

రూ. 7.21 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ వ్రైత్ కూడా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 7.21 కోట్లు. ఇది అత్యంత శక్తివంతమైన బ్రాండ్ యొక్క కారు. ఇది 6.5-లీటర్ వి 12 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 519 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII:

రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఫాంటమ్ VIII అనేది కూడా అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. దీని ధర రూ. 9.50 కోట్లు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII భారతదేశంలో విక్రయించే రెండవ అత్యంత ఖరీదైన కారు. ఇది 6.75-లీటర్ వి12 ఇంజన్ కలిగి 563 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది బ్రాండ్ యొక్క మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన మొదటి రోల్స్ రాయిస్ మోడల్.

మెక్‌లారెన్ 765 LT స్పైడర్:

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో చెప్పుకోదగ్గది మెక్‌లారెన్ 765 LT స్పైడర్. దీని ధర సుమారు రూ. 12 కోట్లు. ఇటీవల ఈ కారుని హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కొనుగోలు చేసాడు. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 765 మాత్రమే అందుబాటులో ఉంటాయి. మెక్‌లారెన్ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో జిటి, ఆర్టురా, 720ఎస్, 720ఎస్ స్పైడర్, 765 ఎల్‌టి మరియు 765 ఎల్‌టి స్పైడర్ వంటి వాటిని అందిస్తోంది.

మెక్‌లారెన్ 765 LT స్పైడర్ భారతదేశంలోని ఇతర సూపర్ కార్ల కంటే మరింత ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇందులో 4.0 లీటర్ ట్విన్-టర్బోఛార్జ్ డ్ వి8 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 765 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కారణంగా ఈ కారుకి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2022, 10:35 [IST]
English summary
Most expensive cars in india ferrari 296 gtb to mclaren 765 lt spider
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+