మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇటీవల తమ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 27.69 లక్షలు కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.34.54 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Hyundai Tucson | వివరాలు

దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

హ్యుందాయ్ నుండి వచ్చిన కొత్త 2022 టూసాన్ ఎస్‌యూవీ నాల్గవ తరం మోడల్. ఇదివరకు విక్రయించబడిన మూడవ తరం మోడల్ సేఫ్టీలో శూన్యం అని క్రాష్ టెస్టులో నిర్ధారించబడింది. దీంతో హ్యుందాయ్ తమ కొత్త 2022 మోడల్ టూసాన్ ఎస్‌యూవీ చాలా సురక్షితంగా తయారు చేశామని, ఇది యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిందని కంపెనీ గొప్పలు పోయింది. కాగా, ఇప్పుడు అదే ఎస్‌యూవీ లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కుంచుంది.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

హ్యుందాయ్ తమ కొత్త 2022 టూసాన్ ఎస్‌యూవీని భారతదేశంలో ప్రారంభించటానికి ముందే, ఇది యూరో-NCAPలో క్రాష్ టెస్ట్‌కు గురైంది. ఈ క్రాష్ టెస్టులో ఇది అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ పరీక్షలో కొత్త హ్యుందాయ్ టూసాన్ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్ నిర్వహించిన తర్వాత కూడా స్థిరంగా ఉందని కనుగొనబడింది. ఇందులో ఇది గరిష్టంగా 16 పాయింట్లకు గానూ 12.4 పాయింట్లను స్కోర్ చేసింది.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

ఇక పాదచారుల సేఫ్టీ విషయానికొస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ యూరో NCAPలో పాదచారుల రక్షణ భద్రతా పరీక్షలో 54 పాయింట్లకు గాను 36.1 పాయింట్లను స్కోర్ చేసింది. యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పరీక్షించబడినది హ్యుందాయ్ టూసాన్ యొక్క జిఎల్ఎస్ ట్రిమ్, ఇది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.6-లీటర్ జిడిఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అమర్చబడి ఉంటుంది. కొత్త టూసాన్ Euro-NCAP నుండి 5-స్టార్ రేటింగ్ ను పొందడంతో, ఇది ప్రజల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

లాటిన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ లో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్

ఇదే కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ లాటిన్ ఎన్‌సిఏపి ఏజెన్సీ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇందులోని రెండు ఎయిర్‌బ్యాగ్ లతో కూడిన బేస్ వేరియంట్ సున్నా స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ పరంగా, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్ వేరియంట్ గరిష్టంగా 40 పాయింట్లకు గాను కేవలం 20.09 పాయింట్లను మాత్రమే స్కోర్ చేసింది. క్రాష్ పనితీరును బట్టి, హ్యుందాయ్ టూసాన్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు మంచి రక్షణను అందించిందని లాటిన్-NCAP వ్యాఖ్యానించింది.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

అయితే, డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్లకు కేవలం పాక్షిక రక్షణ మాత్రమే అందించబడిందని, దానికి తోడు, ఫుట్‌వెల్ మరియు బాడీ షెల్ రెండూ స్థిరంగా ఉన్నాయని లాటిన్ ఎన్‌క్యాప్ రేట్ చేసింది. అంతేకాకుండా, కారు సైడ్ హెడ్ ప్రొటెక్షన్‌ను స్టాండర్డ్‌గా అందించనందున సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించబడలేదని కూడా పేర్కొంది. అంటే, హ్యుందాయ్ టూసాన్ టాప్-ఎండ్ వేరియంట్లు అందించే రక్షణ, రెండు ఎయిర్‌బ్యాగ్ లు మాత్రమే కలిగిన బేస్ వేరియంట్ అందించడం లేదని స్పష్టమైంది.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

భారతదేశంలో హ్యుందాయ్ టూసాన్ ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల చేయబడింది. ఇవి రెండూ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. నిజానికి, భారతదేశంలో హ్యుందాయ్ నుండి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లతో వచ్చిన మొట్టమొదటి ఎస్‌యూవీ కూడా కొత్త 2022 టూసాన్ కావడం విశేషం.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లలో భాగంగా ఫార్వర్డ్ కొలైషన్ అవైడెన్స్ అసిస్టెన్స్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ అసిస్టెన్స్, లేన్ ఫాలోయింగ్ అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్-కీప్ అసిస్ట్ మరియు హై-బీమ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

భారత మార్కెట్లో విక్రయించబడుతున్న 2022 హ్యుందాయ్ టూసాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

మళ్లీ మొదటికి వచ్చిందా..? లాటిన్ క్రాష్ టెస్టులో సున్నా (0) స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన హ్యుందాయ్ టూసాన్!

ఈ ఎస్‌యూవీలోని ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ (ఒకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కోసం మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం), ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుకవైపు రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 64-కలర్ యాంబియెంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ మరియు మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీట్ మొదలైనవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 2, 2022, 11:45 [IST]
English summary
New 2022 hyundai tucson dual airbag variant scores 0 stars in latin ncap crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+