కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) ఆవిష్కరణ.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) తమ నాల్గవ తరం టూసాన్ (4th Gen Tucson) ఎస్‌యూవీని ఎట్టకేలకు భారతదేశంలో విడుదల చేసింది. కొత్త 2022 హ్యుందాయ్ (New Gen 2022 Hyundai Tucson) ధరలు ఆగష్టు 4వ తేదీన ప్రకటించబడతాయి మరియు అదే రోజు నుండి ఈ ఎస్‌యూవీ అమ్మకాలు కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని దాని లాంగ్-వీల్‌బేస్ రూపంలో భారతదేశానికి రాబోతోంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

2022 హ్యుందాయ్ టూసాన్ ఎక్స్టీరియర్ డిజైన్

మునుపటి తరం హ్యుందాయ్ టూసాన్ తో పోలిస్తే ఈ కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడింది మరియు ఇది ఈ కొరియన్ ఆటోమోటివ్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీ - సెన్సుయస్ స్పోర్టినెస్‌ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారులో ముందు వైపు కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో, పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్‌ ఉంటుంది మరియు ఆ గ్రిల్ అంచులను ఆక్రమించే ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంది. హెడ్‌లైట్‌లు నిలువుగా పేర్చబడి గ్రిల్‌కి ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో సెంట్రల్ ఎయిర్ డ్యామ్ మరియు సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ ను కూడా మనం చూడొచ్చు. ఇండియా-స్పెక్ హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీలో కంపెనీ కొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ను ఉపయోగించింది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

ఇక వెనుక డిజైన్ ను గమనిస్తే, ఇక్క ఎక్కువగా టెయిల్‌లైట్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇవి ఎస్‌యూవీ వెడల్పుతో నడిచే లైట్‌బార్ విభాగం నుండి క్రిందికి వచ్చే పదునైన ప్రోట్రూషన్‌లను కలిగి ఉంటాయి. హ్యుందాయ్ బ్యాడ్జ్ కోణాల వెనుక విండ్‌స్క్రీన్‌పై ఉంచబడింది మరియు టూసాన్ లో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ ఎలిమెంట్‌ కూడా హైలైట్ గా నిలుస్తుంది. ఫ్రంట్ ఎండ్ మాదిరిగానే రియర్ ఎండ్ కూడా ఫాక్స్ సిల్వర్ బాష్ ప్లేట్ ను కలిగి ఉంటుంది. ఓవరాల్ గా దీని లుక్ చాలా ప్రీమియంగా ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

2022 హ్యుందాయ్ టూసాన్ ఇంటీరియర్ మరియు ఫీచర్లు

కొత్త నాల్గవ-తరం హ్యుందాయ్ టూసాన్ డ్రైవర్ సమాచారం మరియు వినోదం కోసం డ్యూయల్ డిస్‌ప్లే సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కోసం మరియు మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కోసం ఉపయోగించబడుతాయి. ఇవి రెండూ కూడా 10.25 ఇంచ్ సైజులో ఉంటాయి. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింది భాగంలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం కంట్రోల్స్ మరియు ఓ టచ్-ఆధారిత ప్యానెల్ కూడా ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీలో హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వెనుకవైపు రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు ఉంటాయి. అన్ని సీట్లు కూడా లెథెరెట్ అప్‌హోలెస్ట్రీలో కవర్ చేయబడి ఉంటాయి. ఇంకా ఉందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 64-కలర్ యాంబియెంట్ లైటింగ్, 8-స్పీకర్లతో కూడిన బోస్ ఆడియో సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు మరియు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ మరియు మెమరీ ఫంక్షన్‌తో కూడిన డ్రైవర్ సీట్ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

ఇవే కాకుండా, OTA (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు, వాయిస్ కమాండ్‌లు, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం అనుమతించే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్ వంటి అధునాతన టెక్ ఫీచర్లతో కొత్త హ్యుందాయ్ టూసాన్ అనేక లేటెస్ట్ కార్ కనెక్టింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త టూసా భారత మార్కెట్ కోసం హ్యుందాయ్ నుండి వచ్చిన మొదటి ADAS రెడీ వాహనంగా నిలుస్తుంది. ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లతో స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESC, హిల్-హోల్డ్ కంట్రోల్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

ఆసక్తికరకమైన విషయం ఏంటంటే, ఈ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ మునుపటి తరం మోడల్ కన్నా అనేక రెట్లు మెరుగైన సేఫ్టీని కలిగి ఉంటుంది. ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ మరియు యూరో ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ (పెద్దల) సేఫ్టీ విషయంలో ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ 16 పాయింట్లకు గానూ గరిష్టంగా 12.4 పాయింట్లను స్కోర్ చేసింది. పాదచారుల భద్రత (పెడస్టేరియన్ సేఫ్టీ) విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ టూసాన్ యూరో-ఎన్‌సిఎపిలో పాదచారుల రక్షణ భద్రతా పరీక్షలో 54 పాయింట్లకు గానూ 36.1 పాయింట్లను స్కోర్ చేసింది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) విడుదల.. ఆగస్ట్ 4 నుండి సేల్ ప్రారంభం!

2022 హ్యుందాయ్ టూసాన్ ఇంజన్ స్పెసిఫికేషన్లు

హ్యుందాయ్ టూసాన్ భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలతో విడుదల కావచ్చని సమాచారం. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల కావచ్చని సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2022 hyundai tucson suv unveiled sale begins on 4th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X