కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) లో ఓ కొత్త వేరియంట్ ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన మొదటి టీజర్ వీడియోని విడుదల చేసింది. ఈ టీజర్ ను బట్టి చూస్తే, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ పూర్తిగా కొత్త డిజైన్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఈ కొత్త కారును జూన్ 16న విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే 2022 హ్యుందాయ్ వెన్యూ కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో మునుపటి కన్నా మరింత సౌకర్యవంతంగా మారనుంది. హ్యుందాయ్ ఈ సబ్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కంపెనీ యొక్క కొత్త డిజైన్ ఫిలాసఫీ - "సెన్సుయస్ అండ్ స్పోర్టినెస్" ను ఆధారంగా చేసుకొని రూపొందించింది. అయితే, దీని ఓవరాల్ బాక్సీ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది. కాకపోతే, ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ మరియు టెయిల్స్ ల్యాంప్స్ డిజైన్ లో మార్పులు ఉండనున్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త 2022 వెన్యూ బయట డిజైన్‌తో పాటు ఇంటీరియర్ స్పేస్ మరియు సౌలభ్యంపై దృష్టి సారించి బోల్డ్ మరియు పెద్ద వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేలా రూపొందించబడింది. కంపెనీ ఈ కారును 'లివ్ది లిట్ లైఫ్' ట్యాగ్‌లైన్ తో ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రాలలో చూసినట్లుగా, కొత్త వెన్యూ రాబోయే కొత్త-తరం హ్యుందాయ్ టూసాన్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇందులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా, క్రోమ్ ట్రీట్‌మెంట్‌తో కూడిన కొత్త 3D గ్రిల్ ఉన్నాయి, ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన రివైజ్డ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ వంటి మార్పులు ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

కొత్త హెడ్‌ల్యాంప్‌లు అంటే ఫ్రంట్ బంపర్ కూడా రీ-ప్రొఫైల్ చేయబడుతుందని అర్థం. అప్‌డేటెడ్ 2022 హ్యుందాయ్ వెన్యూ యొక్క సైడ్ ప్రొఫైల్ లో కొత్త అల్లాయ్ వీల్స్ మినహా పెద్ద మార్పులేవీ కనిపించవు. కొత్త వెన్యూ వెనుక భాగంలో రెండు టెయిల్ ల్యాంప్ లను కలుపుతూ పోయే ఎల్ఈడి బార్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెనుక వైపు కొత్త L-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు, పొడవాటి ఎల్ఈడి స్ట్రిప్‌ మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీ-డిజైన్ చేయబడిన రియర్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి. ఇంకా ఇందులో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి డిజైన్ హైలైట్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మోడల్ యొక్క ఇంటీయర్లలో చేసిన మార్పుల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, ఇది పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైట్లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారులో ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

హ్యుందాయ్ వెన్యూ 2019 లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ముడూ లక్షల మందికి పైగా వినియోగదారులకు చేరువైంది. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టనుంది. సమాచారం ప్రకారం, హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే కొన్ని వేరియంట్‌ లు డిస్‌కంటిన్యూ చేయబడ్డాయి మరియు కొందరు డీలర్లు కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌ లను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

కాగా, కొత్తగా రాబోయే 2022 హ్యుందాయ్ వెన్యూలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇది మూడు ఇంజన్లతో లభిస్తుంది. వీటిలో మొదటిది 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్, ఇది 82 బిహెచ్‌పి శక్తిని మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే, రెండవది ఇంజన్ 1.0-లీటర్ కప్పా టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) మరియు ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ని చూశారా..? ఇవిగో ఫస్ట్ ఇమేజెస్..!

ఇకపోతే, మూడవది ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ యూ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ మూడు ఇంజన్లలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మూడు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఐఎమ్‌టి గేర్‌బాక్స్ అనేది కొత్తగా ప్రవేశపెట్టబడిన క్లచ్ రహిత గేర్‌బాక్స్. ఇతర కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మాదిరిగానే ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా పనిచేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Wednesday, June 1, 2022, 15:20 [IST]
English summary
New 2022 hyundai venue facelift teaser video out design features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+