కొత్త 2022 సెల్టోస్ ఎస్‌యూవీని విడుదల చేసిన కియా మోటార్స్! ఇప్పుడు ADAS సేఫ్టీ ఫీచర్లతో..
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) భారతదేశంలో విక్రయిస్తున్న సెల్టోస్ ఎస్‌యూవీ దక్షిణ కొరియాలోనే కాకుండా అమెరికా వంటి ఇతర దేశాలలో కూడా విక్రయిస్తోంది. మనదేశంలో లభిస్తున్న సెల్టోస్ ఎస్‌యూవీతో పోల్చుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న సెల్టోస్ ఎస్‌యూవీలో కంపెనీ అనేక ఫీచర్లను అందిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ కంపెనీ తాజాగా తమ కొత్త 2022 మోడల్ కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఎస్‌యూవీని విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

వీటిలో మొదటి ఇంజన్ ఆప్షన్ 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇకపోతే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 1.6-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ హెడ్‌లైన్-గ్రాబ్లింగ్ పవర్‌ట్రైన్. ఈ ఇంజన్ గరిష్టంగా 196 బిహెచ్‌పి శక్తిని మరియు 265 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో కియా సెల్టోస్ కేవలం టూవీల్ డ్రైవ్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంటే, దక్షిణ కొరియా మార్కెట్లో ఇది టూవీల్ డ్రైవ్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. దక్షిణ కొరియాలో కొత్త 2022 కియా సెల్టోస్ 2.0-లీటర్, న్యాచురల్-ఆస్పిరేటెడ్ ఇంజన్ యొక్క బేస్ 'ట్రెండీ' ట్రిమ్ ధర రూ. 12.6 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ 'గ్రావిటీ' ట్రిమ్ ధర రూ. 15.75 లక్షల వరకు ఉంటుంది. అలాగే, ఇందులో మరింత శక్తివంతమైన 1.6-లీటర్, టర్బోచార్జ్డ్ ఇంజన్ తో కూడిన కియా సెల్టోస్ ధరలు రూ. 13.16 లక్షల నుండి రూ. 16.36 లక్షల మధ్యలో (అన్ని ధరలు INR కన్వర్షన్ ప్రకారం) ఉంటాయి.

కొత్త 2022 మోడల్ కియా సెల్టోస్ డిజైన్ మరియు ఇంజన్ పరంగా అప్‌గ్రేడ్స్ పొందింది. ఈ కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు పూర్తి వెడల్పు లైట్ బార్‌తో కూడిన పెద్ద ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్త స్కిడ్ ప్లేట్లు మరియు కొత్త రకం ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ తో పాత మోడల్ కంటే మరింత ఎక్కువ ప్రీమియంగా మరియు మెచ్యూర్‌గా కనిపిస్తుంది.

వెనుక వైపు కొత్త 2022 సెల్టోస్ లోని ఎగ్జాస్ట్ టిప్స్ వెనుక బంపర్ కింద చక్కగా టక్ చేయబడినట్లు ఉంటాయి మరియు ఈ లైట్ బార్ మధ్యలో కొత్త కియా లోగోను కూడా మనం చూడవచ్చు. ఈ కొత్త మోడల్ లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నప్పటికీ, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి వెర్షన్ కి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే, ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో కూడా చెప్పుకోదగిన మార్పులు చేయబడ్డాయి.

కొత్త 2022 కియా సెల్టోస్‌కి సంబంధించిన ఇంటీరియర్ అప్‌డేట్‌లు క్యాబిన్ కు మరింత అప్‌మార్కెట్ ఫీల్ ని ఇచ్చేలా డిజైన్ చేయబడ్డాయి. రెండు పెద్ద 10.25 ఇంచ్ స్క్రీన్‌లు మరియు కొత్త రోటరీ-స్టైల్ గేర్ సెలెక్టర్ నాబ్ వంటి ఇందులో ప్రధానంగా గుర్తించదగిన మార్పులు. అంతేకాకుండా, దక్షిణ కొరియా మార్కెట్లో ఈ అప్‌డేట్ చేయబడిన 2022 కియా సెల్టోస్ ఎస్‌యూవీ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లతో కూడా లభిస్తుంది. భారత మార్కెట్లో కియా సెల్టోస్ కారులో ఇలాంటి ఫీచర్లు అందుబాటులో లేవు.

అధునాతన అడాస్ ఫీచర్లలో భాగంగా, కంపెనీ కొత్త 2022 సెల్టోస్ ఎస్‌యూవీలో అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ (ACC), యాక్టివ్ లేన్ అసిస్టెన్స్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ డ్రౌజీనెస్ అలెర్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలెర్ట్ వంటి ఈ యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఇంకా ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, పానోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి మరెన్నో ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి.

భారత మార్కెట్లో కూడా విడుదల కానున్న కొత్త 2022 సెల్టోస్!
భారతదేశంలో సెల్టోస్ సి-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలో చాలా విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మారుతి మరియు టొయోటా కంపెనీల నుండి కొత్తగా ఈ విభాగంలోకి ప్రవేశించిన మోడళ్లతో, భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం ఇప్పుడు మంచి పోటీతో ఉంది. ఈ పోటీని తట్టుకొని స్థిరంగా నిలబడాలంటే, కియా మోటార్స్ తమ సెల్టోస్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి, ఈ కొత్త 2022 మోడల్ కొన్ని ఫీచర్లను తగ్గించుకొని భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








