కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

టాటా మోటార్స్ (Tata Motors) యాజమాన్యంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ (Land Rover) తమ అధునాతన 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్‌ (2022 Range Rover Sport) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ క్లీన్ మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇందులో ఓ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్లాన్ చేస్తోంది. ఇది మార్కెట్లోకి రావడానికి మరో రెండు సంవత్సరాలలో సమయం పడుతుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

మునుపటి తరం రేంజ్ రోవర్ స్పోర్ట్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్ అత్యాధునిక డిజైన్ ను కలిగి ఉంటుంది. కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ షార్ట్ ఓవర్‌హాంగ్‌లను కలిగి ఉండి, మునుపటి మోడల్ కన్నా 75 మిమీ పొడవైన వీల్‌బేస్ ను కలిగి ఉంటుది. కాబట్టి, ఇది పాత మోడల్ కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో సన్నగా ఉండే ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బానెట్ క్రింది భాగంలో ఉండే ఫ్రంట్ గ్రిల్ ఈ రెండు హెడ్‌లైట్లను కలుపుతున్నట్లుగా ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

ఫ్రంట్ డిజైన్ లో మూడు రకాల గ్రిల్స్ ఉంటాయి. మొదటిది బానెట్ క్రింది భాగంలో ఉండి, లైన్స్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మిగిలిన రెండు గ్రిల్స్ ఫ్రంట్ బంపర్‌లో అమర్చబడి ఉంటాయి మరియు ఇవి హనీకోంబ్ ప్యాటర్న్‌ను కలిగి ఉంటాయి. కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ లో ఉపయోగించిన ఎల్ఈడి లైట్స్, ఇప్పటి వరకు రేంజ్ రోవర్‌కు అమర్చిన వాటిలో కెల్లా అత్యంత సన్నగా ఉంటాయి. ఈ లైట్లకు ఎడమ వైపున ల్యాండ్ రోవర్ బ్యాడ్జ్‌ కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ సైడ్ విండోస్ క్రింది భాగం నుండి బాడీ కలర్‌లో మరియు దాని పై భాగం అంతా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేయబడి ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

సైడ్ డిజైన్‌లో బాడీ-కలర్ సైడ్ స్కర్ట్‌లతో పాటు పెద్ద 20 ఇంచ్ నుండి 23 ఇంచ్ వరకూ వివిధ పరిమాణాల్లో లభించే అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. టెస్లా కార్లలో మాదిరిగా కారుకి ఇరువైపులా ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి, ఇవి కూడా సన్నగా ఉండి, బాడీలో ఇమిడిపోయినట్లుగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇక ఎస్‍యూవీ వెనుక భాగాన్ని గమనిస్తే, ఇక్కడ కూడా సన్నటి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఉండే బ్లాక్ స్ట్రిప్ మరియు దానిపై మోడల్ బ్యాడ్జింగ్ కనిపిస్తాయి.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

కారు పైభాగం (రూఫ్ మొత్తం) బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది, రూఫ్ పై వెనుక భాగంలో కనిపించే డ్యూయెల్ షార్క్ ఫిన్ యాంటెన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. వెనుక భాగంలో స్పాయిలర్ ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది. ఇక క్యాబిన్ లోపలికి అడుగు పెడితే, కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ దాని ఎక్స్టీరియర్ మాదిరిగానే ఇంటీరియర్ లో కూడా మినిమలిస్ట్ డిజైన్ ను అనుసరిస్తుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

క్యాబిన్ లోపల క్లీన్ డ్యా‌ష్‌బోర్డ్, వివిధ రకాల బటన్లతో కూడిన మల్టీ ఫంక్షనల్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ఉన్న పెద్ద 13.7 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న పెద్ద 13.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్లు ఇంటీరియర్‌లో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమెజాన్ అలెక్సా డిజిటల్ వాయిస్ అసిస్టెంట్‌తో ల్యాండ్ రోవర్ యొక్క పివి ప్రో టెక్‌ని కలిగి ఉంటుంది మరియు ఇది మెరిడియన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో సీట్ల హెడ్‌రెస్ట్‌లలో స్పీకర్లు కూడా ఉంటాయి, ఇవి నాయిస్ క్యాన్సిలింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. అలాగే, ఇందులో ఆటోమేటిక్ క్లైమ్‌టే కంట్రోల్ సిస్టమ్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ కోసం కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ లో ఉపయోగించిన పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇందులో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ మరియు 4.4-లీటర్ ట్విన్-టర్బో వి8, 2 ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్ (పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్)తో లభిస్తుంది. ఈ పవర్‌ట్రైన్ సెటప్ ను జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW నుండి ల్యాండర్ రోవర్ తీసుకుంది. ఇది గరిష్టంగా 523 బిహెచ్‌పి శక్తిని మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100కిమీ వేగాన్ని చేరుకుటుంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీ విలాసవంతమైన ఫీచర్లతో పాటుగా మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

రేంజ్ రోవర్ స్పోర్ట్ లొని అన్ని మోడళ్లు కూడా ల్యాండ్ రోవర్ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఒకవేళ, ఎవరైనా కస్టమర్లు ఇందులో స్టోర్మర్ ప్యాక్‌ని ఎంచుకుంటే వారు ఈ ప్యాక్ లో భాగంగా ఆల్-వీల్ స్టీరింగ్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్యాక్ బ్రేకింగ్ మరియు కాన్ఫిగర్ చేయగల ప్రోగ్రామ్‌ల ద్వారా టార్క్ వెక్టరింగ్‌తో డైనమిక్ రెస్పాన్స్ ప్రో, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్‌ను కూడా కలిగి ఉంటుంది. కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క MLA ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

ఈ కొత్త 2022 మోడల్ ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4,946mm పొడవు, 2,209mm వెడల్పు మరియు 1,820mm పొడవును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,997mm గా ఉంటే ముందు మరియు వెనుక ట్రాక్‌లు వరుసగా 1,702mm మరియు 1,704mm గా ఉన్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ 216mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. అయితే, ఇందులో టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌లో ఆఫ్-రోడింగ్ మోడ్‌ను ఎంచుకోవడం ద్వారా దీనిని 281mmకి పెంచుకోవచ్చు. ఆఫ్‌రోడింగ్ మోడ్‌లో, రేంజ్ రోవర్ స్పోర్ట్ 33 డిగ్రీల అప్రోచ్ యాంగిల్ మరియు 30 డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ఆవిష్కరణ.. కొత్త డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లు..

ఇదిలా ఉంటే, యావత్ ఆటోమొబైల్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ల్యాండ్ రోవర్ కూడా తమ రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్ లో ఓ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ ను వచ్చే రెండేళ్లలో మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ 2024లో పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్‌గా విడుదల అవుతుందని ల్యాండ్ రోవర్ ధృవీకరించింది. కాగా, ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గురించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2022, 12:11 [IST]
English summary
New 2022 land rover range rover sport revealed design features specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+