కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. మరికొద్ది రోజుల్లోనే విడుదల
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే తమ కొత్త స్కార్పియో-ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క టీజర్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది. కాగా, ఈ కొత్త మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కంటే కూడా మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

మహీంద్రా విడుదల చేసిన ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ టీజర్‌లో ముందు వైపు మహీంద్రా బ్రాండ్ యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగో మాత్రమే గుర్తించదగిన మార్పుగా కనిపిస్తుంది, మిగతా డిజైన్ అంతా దాదాపుగా ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో ప్రధానమైన మార్పు దాని టర్బో పెట్రోల్ ఇంజన్ రూపంలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీ ఉన్నందున, కంపెనీ ఈ పోటీలో ముందు ఉండేందుకు మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క రిఫ్రెష్డ్ వెర్షన్ ను విడుదల చేయడం చాలా అవసరం.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కి సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇటీవల లీక్ అయ్యాయి. కంపెనీ ఈ టెస్టింగ్ వాహనాన్ని కేవలం ముందు వైపు మాత్రమే కవర్ చేస్టింగ్ చేస్తుండటాన్ని ఈ స్పై చిత్రాలలో గమనించవచ్చు. అంటే, దీనర్థం కొత్త ఎక్స్‌యూవీ300 కేవలం ముందు వైపు మాత్రమే కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంటుందని, సైడ్స్ మరియు రియర్ ప్రొఫైల్ లో పెద్దగా ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది.

మహీంద్రా విడుదల చేసిన లేటెస్ట్ టీజర్ ఇమేజ్ ను కొంచెం దగ్గరగా గమనిస్తే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో క్రోమ్ ఎలిమెంట్స్‌తో కొద్దిగా భిన్నమైన ఫాగ్‌లైట్ హౌసింగ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఈ ఎస్‌యూవీ కొంచెం పెద్దగా ఉన్న అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రాబోయే 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌తో రానున్నట్లు ఈ టీజర్ ధృవీకరిస్తోంది. ఇందులో రూఫ్ మొత్తం తెలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉండి, బాడీ మొత్తం రెడ్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంది.

కంపెనీ తమ కొత్త ఎక్స్‌యూవీ300 ఎక్స్టీరియర్ లో మార్పులను పరిమితంగా ఉంచినప్పటికీ, దీని ఇంటీరియర్ లో గణనీయమైన మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా పెద్ద 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మార్పులతో లోపలి భాగాన్ని మరింత ప్రీమియంగా తీర్చిదిద్దవచ్చని భావిస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ కూడా ఒకే విధమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది కాబట్టి, ఈ చిన్న ఎస్‌యూవీలో కూడా ఈ మార్పును ఆశించవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, టీజర్ చిత్రం "కంటి రెప్పపాటులో 0 నుండి థ్రిల్‌కు" (0 - Thrill In A Blink Of An Eye) అనే క్యాప్షన్ తో మహీంద్రా ఈ కొత్త 2022 ఎక్స్‌యూవీ300 టీజర్ ను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే, కొత్త మోడల్ దాని పవర్‌ట్రెయిన్ పనితీరు పరంగా అతిపెద్ద అప్‌గ్రేడ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం, కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 అప్‌డేట్ చేయబడిన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ ను మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

పోల్చి చూస్తే, అవుట్‌గోయింగ్ ఎక్స్‌యూవీ300 మోడల్ లోని 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే, కొత్త టర్బో ఇంజన్ దీని కన్నా 21 బిహెచ్‌పిల ఎక్కువ శక్తిని మరియు 30 ఎన్ఎమ్‌లి ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో లభించే డీజిల్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ300 లోని 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ డీజిల్ ఇంజన్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

గేర్‌బాక్స్ ఆప్షన్లను చూస్తే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లు రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి. ఇది గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో అడల్ట్ సేఫ్టీ కోసం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. ఈ చిన్న కారులో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








