కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

భారతదేశంలో మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లకు ఉండే డిమాండే వేరు. అందులోనూ ఈ బ్రాండ్ కొత్తగా ఏదైనా మోడల్ మార్కెట్లోకి వచ్చిందంటే, ఇక దానికి ఉండే క్రేజ్ వేరేగా చెప్పనవసరం లేదు. మారుతి సుజుకి సంస్థను తాజాగా వచ్చిన కొత్త 2022 మోడల్ బాలెనో ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. కొత్త మోడల్ బాలెనో మార్కెట్లోకి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ మోడల్ కోసం 50,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

మారుతి సుజుకి తమ కొత్త 2022 బాలెనో (2022 Baleno Facelift) కారును ఫిబ్రవరి 23వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ధరలు రూ. 6.35 లక్షల నుండి రూ. 9.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. కొత్త 2022 మారుతి బాలెనో కారును సిగ్మా, డెల్టా, డెల్టా (ఏఎమ్‌టి), జెటా, జెటా (ఏఎమ్‌టి), ఆల్ఫా, మరియు ఆల్ఫా (ఏఎమ్‌టి) అనే వేరియంట్లలో విడుదల చేయబడింది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే, ఇది రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఇంటీరియర్స్ మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

ముందు వైపు రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్స్, గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ల కారణంగా ఇది ముందు వైపు నుండి మునుపటి కన్నా రిఫ్రెష్డ్ లుక్‌ని కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. గత మోడల్ తో పోలిస్తే, దీని ఫ్రంట్ గ్రిల్ కాస్తంత పెద్దదిగా ఉంటుంది. అలాగే, ఇందులోని హెడ్‌లైట్లు కూడా మునుపటి కంటే సన్నగా ఉంటాయి. ఓవరాల్ గా ఇది ముందు వైపు నుండి మంచి బోల్డ్ లుక్ ని కలిగి ఉంటుంది. వెనుక భాగంలో కొత్త స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ లైట్లు, రీడిజైన్ చేసిన రియర్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

సైడ్స్‌లో రీడిజైన్ చేసిన కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ డిజైన్ చూడొచ్చు, ఇది మినహా సైడ్ డిజైన్ లో పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఇప్పుడు మరింత ధృడమైన బాడీ ప్యానెల్‌లతో వస్తుంది. ఫలితంగా, ఇది దాని పాత మోడల్ కంటే బరువైనదిగా ఉంటుంది. పెరిగిన బరువును సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం కోసం కంపెనీ దీని సస్పెన్షన్ సిస్టమ్‌లో కూడా మార్పులు చేసింది. ఇకపోతే, కొత్త బాలెనో సైజ్ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ అలానే ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

కొత్త 2022 బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో ప్రధానమైన మార్పులు దాని ఇంటీరియర్ లో కనిపిస్తాయి. ఇందులో వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్ సిస్టమ్, ఓటిఏ అప్‌డేట్స్‌తో కూడిన 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్, కొత్త స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కొత్త ఇంటీరియర్ ఫాబ్రిక్, కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్ మరియు అదనపు కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. బాలెనోలో 360-డిగ్రీ కెమెరాతో కూడిన పెద్ద 9 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, కొత్త ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

అంతేకాకుండా, ఈ కారులో ఆటో హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రియర్ ఏసి వెంట్స్, రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు మడచగల సైడ్ మిర్రర్లు, వెనుక వైపు వాషర్ తో కూడిన వైపర్, వెనుక వైపు పార్సెల్ షెల్ఫ్ మరియు ఏజిఎస్ వేరియంట్‌ల కోసం హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎమ్‌ఐడి కలర్ డిస్‌ప్లే, రియర్ అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ మరియు సెంటర్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారులో రివర్స్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక చివిరగా మైలేజ్ విషయానికి వస్తే, ఇందులోని 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 22.35 కిలోమీటర్ల మైలేజీని మైలేజీని మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ లీటరుకు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సర్టిఫై చేయబడింది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్లను గమనిస్తే, కొత్త 2022 బాలెనో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని మొదటి ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగా, రెండవ ఇంజన్ 90 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు 5 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో కారుకి 50,000 బుకింగ్స్.. భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!

బాలెనో సిఎన్‌జి (Baleno CNG) కూడా వస్తోంది..

ఇటీవలే డిజైర్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ ను విడుదల చేసిన మారుతి సుజుకి ఇప్పుడు తమ కొత్త బాలెనో కారులో కూడా ఓ సిఎన్‌జి వేరియంట్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త బాలెనో సిఎన్‌జి (Baleno CNG) మారుతి నెక్సా (Maruti Nexa) బ్రాండ్ నుండి రానున్న మొట్టమొదటి సిఎన్‌జి కారు కానుంది. మారుతి సుజుకి బాలెనో CNG మోడల్ త్వరలో విక్రయానికి రానుంది. ఈ సిఎన్‌జి వెర్షన్ బాలెనో ప్రస్తుతం, పెట్రోల్ వెర్షన్ బాలెనో కారులో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు.

Article Published On: Wednesday, March 23, 2022, 15:00 [IST]
English summary
New 2022 maruti baleno facelift receives 50000 units booking waiting period incresed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+