కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, ఎట్టకేలకు తమ సరికొత్త 2022 ఆల్టో కె10 కారును మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ సరికొత్త ఆల్టో కె10 ను పరిచయం చేసింది. ఆల్టో కె10 మొత్తం 6 వేరియంట్లలో విడుదల చేయబడింది, వీటిలో నాలుగు మ్యాన్యువల్ మరియు రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి.

కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

ఆల్టో కె10 వేరియంట్ల వారీగా లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఆల్టో కె10 స్టాండర్డ్ - రూ.3.99 లక్షలు
  • ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ - రూ.4.82 లక్షలు
  • ఆల్టో కె10 విఎక్స్ఐ - రూ.4.99 లక్షలు
  • ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ - రూ.5.33 లక్షలు
  • ఆల్టో కె10 విఎక్స్ఐ ఏజిఎస్ - రూ.5.49 లక్షలు
  • ఆల్టో కె10 విఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ - రూ.5.83 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    మారుతి సుజుకి ఆల్టో కె10 - ఎక్స్టీరియర్ డిజైన్

    ప్రస్తుత ఆల్టో 800 నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేయడం కోసం కంపెనీ ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో K10 డిజైన్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఇందులో కొత్త స్వెప్ట్‌బ్యాక్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు సుజుకి బ్యాడ్జ్ పైన ఉన్న పెద్ద సింగిల్-పీస్ గ్రిల్ ఉన్నాయి. కొత్త ఆల్టో కె10లో ఫ్రంట్ బంపర్ కూడా కొత్తగా ఉంటుంది మరియు ఈ హ్యాచ్‌బ్యాక్ రూపాన్ని మరితంత మెరుగుపరచడంలో సహాయపడటానికి అక్కడక్కడా క్రోమ్ బిట్స్ కూడా ఉన్నాయి.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    కొత్త 2022 మారుతి ఆల్టో కె10 యొక్క సైడ్‌ డిజైన్ ను గమనిస్తే, సిల్వర్ వీల్ కవర్‌లతో కూడిన 13 ఇంచ్ స్టీల్ వీల్స్, ఫెండర్-మౌంటెడ్ సైడ్ ఇండికేటర్‌లు మరియు అక్కడక్కడా క్రోమ్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇక కొత్త ఆల్టో కె10 వెనుక భాగాన్ని గమనిస్తే, ఇందులో కొత్త స్క్వేర్డ్-ఆఫ్ టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు కొత్త రియర్ బంపర్ మరియు టెయిల్‌గేట్‌పై మరిన్ని క్రోమ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    మారుతి సుజుకి ఆల్టో కె10 - ఇంటీరియర్ ఫీచర్లు

    ఆల్టో కె10 లోపలి భాగంలో ప్రధానంగా మన దృష్టిని ఆకర్షించేది, ఇందులోని డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన కొత్త పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్. ఇదొక 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్. ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే టెక్నాలజీ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఆల్టో కె10 లోపలి భాగం చాలా వరకు నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు ఎయిర్ వెంట్స్ చుట్టూ సిల్వర్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి, ఇవి కారు లోపల ప్రీమియం లుక్‌ని తెచ్చిపెడుతాయి.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    కారు లోపల సీట్ అప్‌హోలెస్ట్రీ డ్యూయల్-టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో సాధారణ మాన్యువల్ HVAC సిస్టమ్‌, పవర్-అడ్జస్టబుల్ ORVMలు, డిజిటల్ స్పీడోమీటర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త ఆల్టో కె10 డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    మారుతి సుజుకి ఆల్టో కె10 - స్పెసిఫికేషన్‌లు, మైలేజ్ మరియు కొలతలు

    మారుతి సుజుకి ఆల్టో కె10 కంపెనీ యొక్క పాపులర్ K10C డ్యూయెల్ జెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ 998సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఆల్టో కె10లోని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది లీటరుకు 24.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    సరికొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 ను కంపెనీ తయారు చేస్తున్న ఇతర కార్ల మాదిరిగానే కొత్త మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారు చేసింది. ఇది 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఆల్టో కె10 యొక్క వీల్‌బేస్ 2,380 మిమీగా ఉంటుంది మరియు ఈ కారు మొత్తం బరువు 1,150 కిలోగ్రాములుగా ఉంటుంది. ప్రస్తుత ఆల్టో 800 తో పోలిస్తే కొత్త ఆల్టో కె10 85 మిమీ ఎక్కువ పొడవు, 45 ఎక్కువ ఎత్తు మరియు 20 మిమీ ఎక్కువ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది.

    కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..

    మారుతి సుజుకి ఆల్టో కె10 సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ మరియు ఎర్త్ గోల్డ్ అనే 6 కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది. మారుతి కొత్త ఆల్టో కె10 కోసం రెండు కస్టమైజేషన్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. వీటిలో ఇంపాక్టో మరియు గ్లింటో అనే ప్యాకేజీలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 18, 2022, 13:42 [IST]
English summary
New 2022 maruti suzuki alto k10 launched price starts at rs 3 99 lakhs design specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+