కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

భారతీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ అప్‌డేటెడ్ 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ (2022 Maruti Suzuki Baleno Facelift) మోడల్ ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. మునుపటి మోడల్ తో పోలిస్తే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని ఎక్ట్సీరియర్ నుండి ఇంటీరియర్ వరకు కంపెనీ వివిధ రకాల అప్‌డేటెడ్‌లు చేసింది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

కొత్త అప్‌డేట్‌ల తర్వాత మార్కెట్లో మారుతి సుజుకి మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ యొక్క టాప్-స్పెక్ మోడల్‌ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ పాత మోడల్ కంటే చాలా ఎక్కువ అప్‌డేట్‌లను పొందింది. పాత మారుతి బాలెనోతో పోలిస్తే కొత్త 2022 మోడల్ మారుతి బాలెనోలో ఎలాంటి మార్పులు చేయబడ్డాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

Maruti Suzuki Baleno New vs Old: ఎక్స్టీరియర్

మారుతి సుజుకి తమ బాలెనో కారును తొలిసారిగా 2015 లో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్విఫ్ట్ ఎగువన విడుదలైన ఈ కారును కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా, కంపెనీ ఇందులో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ను అందించింది. ఈ ప్రీమియం కారులో అప్-ఫ్రంట్ హెడ్‌ల్యాంప్‌లు, స్లిమ్ గ్రిల్, ఫ్లోటింగ్ అప్పీల్ తో కూడిన రూఫ్ మరియు చంకీ టెయిల్ ల్యాంప్‌లతో ఇది మంచి ఫ్యామిలీ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనోను మరింత తాజాగా కనిపించేలా చేయడానికి, మారుతి సుజుకిలోని డిజైనర్లు దీని తయారీలో ఒకే బాడీ షెల్‌ని ఉపయోగించి అన్ని కోణాల నుండి పదునుగా కనిపించేలా చేశారు. ఇందుకోసం కంపెనీ దాని షీట్ మెటల్‌లో కూడా మార్పులు చేసింది. చిత్రాలలో చూడగలిగినట్లుగా, బాలెనో ఫేస్‌లిఫ్ట్ కారులో కొత్త హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్‌ల్యాంప్ యూనిట్‌లను ఉంచడానికి చెక్కినట్లుగా ఉండే బానెట్ మరియు టెయిల్‌గేట్‌ను పొందుతుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

ఫ్రంట్ నోస్ ను కూడా రీడిజైన్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రేడియేటర్ గ్రిల్ మరియు బంపర్ ఉన్నాయి. అదేవిధంగా, టెయిల్ సెక్షన్ ఈసారి సన్నని టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన చంకియర్ బంపర్‌తో రీడిజైన్ చేశారు. సైడ్ ప్రొఫైల్‌లో మార్పులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ఇందులో రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

ruti Suzuki Baleno New vs Old: పరిమాణం

మారుతి బాలెనో యొక్క ప్రస్తుత మోడల్ పరిమాణం గురించి మాట్లాడినట్లయితే, ఇది 3,995 mm పొడవు, 1,745 mm వెడల్పు మరియు 1,510 mm ఎత్తును కలిగి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, అప్‌గ్రేడ్ చేయబడిన మోడల్ యొక్క పొడవు దాదాపు 5 మిమీ తక్కువగా ఉంటుంది మరియు ఇది భూమికి దాదాపు 10 మిమీ దగ్గరగా ఉంటుంది. బహుశా రీడిజైన్ చేసిన బంపర్స్ మరియు పెరిగిన బరువు కారణంగా అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

Maruti Suzuki Baleno New vs Old: ఇంటీరియర్

మారుతి సుజుకి బాలెనో యొక్క పాత మోడల్ విశాలమైన మరియు ఆచరణాత్మక క్యాబిన్ లేఅవుట్‌ను పొందుతుంది. అయితే, చూడటానికి ఇది కొంచెం పాత డిజైన్ గా కనిపించడం వలన, మారుతి సుజుకి తమ కొత్త 2022 మోడల్ బాలెనో కారులో కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను ఉపయోగించింది. ఫలితంగా, ఇది మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది మరియు మొత్తం పర్యావరణానికి చాలా మెరుగ్గా అనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ ముదురు నీలం రంగుతో పాటు దిగువ భాగంలో సిల్వర్ ఇన్సర్ట్‌తో వస్తుంది. ఇందులో మరొక పెద్ద మార్పు కూడా ఉంది, అదే ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచ్ SmartPlay Pro+ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్. మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ యొక్క స్టీరింగ్ వీల్ కూడా మారుతి స్విఫ్ట్ నుండి తీసుకోబడిన కొత్త యూనిట్ లా ఉంటుంది. అలాగే, 2022 బాలెనోలో క్రూయిజ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

టెపరేచర్ కంట్రోల్ కోసం సెంటర్ కన్సోల్ లేఅవుట్ కూడా మార్చబడింది, ఆ మార్పును ఈ చిత్రాలలో చూడవచ్చు. పాత మోడల్‌తో పోలిస్తే, మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ కొన్ని అదనపు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్లలో 40కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ARKAMYS పవర్డ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

Maruti Suzuki Baleno New vs Old: ఇంజన్

మారుతి సుజుకి బాలెనో యొక్క ప్రస్తుత మోడల్ వరుసగా 82bhp మరియు 88bhp శక్తిని అందించే 1.2L NA పెట్రోల్ ఇంజన్ యొక్క రెండు వెర్షన్లతో విక్రయించబడుతోంది. కొత్త మారుతి సుజుకి బాలెనో కూడా ఇప్పటికీ అదే 1.2-లీటర్ VVT ఇంజన్‌తో అందించబడుతోంది. అంటే, దాని ఇంజన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా లభిస్తుంది. అయితే, ఇందులో ఇప్పుడు కొత్తగా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ ను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికి, కొత్త మారుతి సుజుకి బాలెనోకు 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇవ్వబడిందా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు.

కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరియు పాత బాలెనో మధ్య తేడాలు ఏమిటి?

Maruti Suzuki Baleno New vs Old: ధర

మారుతి సుజుకి తమ బాలెనో కారుకి ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ ఇవ్వడంతో పాటు, దాని ధరను కూడా కొద్దిగా పెంచింది. సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా వంటి మొత్తం నాలుగు ట్రిమ్‌లలో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ప్రస్తుతం, మార్కెట్లో కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ. 6.35 లక్షల నుండి రూ. 9.49 లక్షల (ఎక్స్-షోరూమ్) లక్ష్యల మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఈ కారును తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తోంది.

Article Published On: Wednesday, February 23, 2022, 16:37 [IST]
English summary
New 2022 maruti suzuki baleno facelift vs old baleno price specs features comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+