ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే '2022 MG ZS EV' లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఎంజి మోటార్స్' (MG Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త రిఫ్రెష్ చేయబడిన 'ఎంజి జెడ్ఎస్ ఈవి' (MG ZS EV) SUV విడుదల చేసింది. ఈ కొత్త అప్డేటెడ్ SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 21.99 లక్షలు (ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్). ఇక టాప్-స్పెక్ MG ZS ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త SUV గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఎంజి మోటార్ ఇండియా, ప్రస్తుతానికి ప్రత్యేకమైన వేరియంట్ కోసం మాత్రమే బుకింగ్‌లను ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇందులోని ఎక్సైట్ వేరియంట్ ఈ సంవత్సరం జూలై నుండి బుకింగ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ZS EV దాని పెట్రోలుతో నడిచే MG ఆస్టర్ SUV కి దగ్గరగా ఉండే కాస్మెటిక్ అప్డేట్స్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. అయితే ఈ 2022 MG ZS EV 461 కిమీ పరిధిని అందించే పెద్ద బ్యాటరీని పొందుతుంది. ఈ కొత్త SUV ఎక్కువ పరిధిని అందించడం వల్ల ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులు దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త ZS EV ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పుడు అతిపెద్ద అప్‌డేట్ ఇందులోని బ్యాటరీ ప్యాక్. ఇందులో మునుపటి 44.5 kWh బ్యాటరీ ప్యాక్ స్థానంలో 50.3kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. కావున ఈ బ్యాటరీ ఈ కొత్త SUV ని 461 కిమీ ప్రయాణించేలా చేస్తుంది. అయితే మునుపటి బ్యాటరీ 419 కిమీ పరిధిని అందిస్తుంది. అంటే ఇప్పుడు మునుపటి మోడల్ కంటే కూడా ఈ కొత్త మోడల్ 42 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది నిజంగా కస్టమర్లకు శుభవార్త అనే చెప్పాలి.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త MG ZS EV ఇప్పుడు 176 బిహెచ్‌పి పవర్ మరియు 353 ఎన్ఎమ్ టార్క్ అందించే ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతోంది. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ. ఈ కొత్త అప్డేటెడ్ SUV కేవలం 8.5 సెకన్లలో 0-100 కిమీ/గం వేగవంతం అవుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త MG ZS EV ఫేస్‌లిఫ్టెడ్ గత ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా వెల్లడైంది. అయితే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాదాపు ఆస్టర్‌కి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV కొత్త LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ సిగ్నేచర్‌లతో సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు మరియు LED టెయిల్-ల్యాంప్‌లు, కూడా ఆస్టర్‌తో సమానంగా ఉంటాయి. ఇది కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త బాడీ కలర్, ట్రెడిషినల్ గ్రిల్ వంటివి పొందుతుంది, ఛార్జింగ్ పోర్ట్ ఈ గ్రిల్‌లో ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ కొత్త SUV యొక్క వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు మరియు రియర్ బంపర్ వంటివి ఇవ్వబడ్డాయి. అయితే దీని ప్రొఫైల్ పెద్దగా మార్చబడలేదు, కానీ ఇందులో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి. దాని ఫ్రంట్ ఫెండర్‌లో ఎలక్ట్రిక్ బ్యాడ్జ్ ఇవ్వబడింది. కొత్త ZS EV 4 ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఫెర్రిస్ వైట్, కరెంట్ రెడ్, అషెన్ సిల్వర్ మరియు సేబుల్ బ్లాక్ కలర్స్.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక ఈ కొత్త SUV లోని ఇంటీరియర్ విషయానికి వస్తే, దాని డాష్‌బోర్డ్ అలాగే ఉంచబడుతుంది, అయితే దీనికి చాలా పరికరాలు జోడించబడతాయి. ఇందులోని చాలా ఫీచర్స్ చాలా వరకు MG ఆస్టర్ నుండి తీసుకోబడతాయి. ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో కొత్త ఫాక్స్ కార్బన్ ఫైబర్ ట్రిమ్ టాప్ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ చుట్టూ ఇవ్వబడుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

అంతే కాకూండా ఇందులో వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయగలిగే 75కి పైగా ఐ-స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) ఫంక్షన్ మరియు 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది MG లోగో క్రింద ఉంచబడుతుంది. ఇందులో 7-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ బ్లూటూత్ కీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, TPMS, ESC వంటి ఇతర ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఒక్క ఛార్జ్‌తో 461 కిమీ అందించే 2022 MG ZS EV లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి భారతీయ మార్కెట్లో కొత్త '2022 ఎంజి జెడ్ఎస్ ఈవి' (2022 MG ZS EV) విడుదలైంది. ఈ కొత్త SUV రాబోయే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి, కొత్త ZS EV ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది. భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు ఈ కొత్త SUV అడుగుపెట్టింది, ఇక ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 7, 2022, 13:29 [IST]
English summary
New 2022 mg zs ev launched in india price features range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+