కొత్త 2022 టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల; ధర కేవలం రూ.6.39 లక్షలు మాత్రమే!

మారుతి సుజుకి ఇండియా ఇటీవల తమ కొత్త 2022 బాలెనో (Baleno) హ్యాచ్‌బ్యాక్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, టొయోటా విక్రయిస్తున్న గ్లాంజా (Glanza) హ్యాచ్‌బ్యాక్‌ను కూడా మారుతి బాలెనో ఆధారంగా తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇప్పుడు టొయోటా కూడా తమ కొత్త 2022 గ్లాంజా (2022 Toyota Glanza) కారును నేడు మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త టొయోటా గ్లాంజా 2022 మోడల్ ప్రారంభ ధర రూ.6.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - ఎక్స్టీరియర్ ఫీచర్లు:

కొత్త 2022 బాలెనో మాదిరిగానే ఈ కొత్త 2022 గ్లాంజా కూడా కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లను కూడా కలిగి ఉంటుంది. కొత్త టొయోటా గ్లాంజా కారులో క్రోమ్ బార్‌తో గార్నిష్ చేసిన సన్నటి ఫ్రంట్, కొత్త బంపర్, రివైజ్డ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, సి-ఆకారపు క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కప్పబడిన ఫాగ్ ల్యాంప్‌లు మొదలైన మార్పులు ఉన్నాయి. ముందు వైపు చేసిన ఈ కాస్మెటిక్ మార్పులతో కొత్త గ్లాంజ్ ఇప్పుడు మునుపటి కన్నా మరింత అందంగా మరియు కొత్తగా కనిపిస్తుంది.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో పాటుగా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ఇది గతంలో కన్నా మరింత షార్ప్ మోడ్రన్‌గా మరియు షార్ప్‌గా కనిపిస్తుంది. అలాగే, సైడ్స్‌లో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను ఇందులో గమనించవచ్చు. వెనుక వైపు కొత్త బంపర్ డిజైన్ మరియు వ్రాప్అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఈ టెయిల్ లైట్స్ చూడటానికి కొత్త 2022 బాలెనో కారులో కనిపించినట్లుగానే ఉంటాయి.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - ఇంటీరియర్ ఫీచర్లు

ఇక ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ క్యాబిన్ లోపల చేయబోయే మార్పుల విషయానికి వస్తే, కొత్త టొయోటా గ్లాంజాలో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫ్లోటింగ్ 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ అసిస్టెంట్, క్రూయిడ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు లెథర్ వ్రాప్డ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి. కంపెనీ ఇందులో 45 కనెక్టెడ్ ఫీచర్లను కూడా అందిస్తోంది.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - అమెజాన్ అలెక్సా

కొత్త గ్లాంజా అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిసాయంతో యూజర్లు అనేక రకాల వాయిస్ అసిస్ట్ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, కంపెనీ ఇందులో "హే టొయోటా" (Hey Toyota) అనే వాయిస్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ కారులో అందించే కనెక్టెడ్ ఫీచర్ల సాయంతో కారు లొకేషన్‌ను ట్రాక్ చేయడం, కారును రిమోట్‌గా లాక్ అన్‌లాక్ చేయడం, రిమోట్‌గా హాజర్డ్ లైట్లను ఆన్ చేయడం వంటి వాటితో పాటుగా వాహనానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కూడా పొందవచ్చు.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - ఇంజన్

కొత్త 2022 టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) లో కాస్మెటిక్ మార్పులు మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. మారుతి బాలెనో కారులో ఉపయోగించే అదే పెట్రోల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ లను ఈ కొత్త టొయోటా గ్లాండా యొక్క 2022 ఎడిషన్ లోనూ ఉపయోగించారు. ఇందులోని 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 89 bhp శక్తిని మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5 స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - ధరలు

మార్కెట్లో కొత్త 2022 మోడల్ టొయోటా గ్లాంజా E, S, G, V అనే నాలుగు ట్రిమ్‌లలో విడుదల చేయబడింది. ఈ నాలుగు ట్రిమ్‌లు కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. అలాగే, E ట్రిమ్ మినహా మిగిలిన S, G, V ట్రిమ్‌లు మూడు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.

వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

2022 టొయోటా గ్లాంజా ఇ (మ్యాన్యువల్) - రూ. 6.39 లక్షలు

2022 టొయోటా గ్లాంజా ఎస్ (మ్యాన్యువల్) - రూ. 7.29 లక్షలు

2022 టొయోటా గ్లాంజా ఎస్ (ఆటోమేటిక్) - రూ. 7.79 లక్షలు

2022 టొయోటా గ్లాంజా జి (మ్యాన్యువల్) - రూ. 8.24 లక్షలు

2022 టొయోటా గ్లాంజా జి (ఆటోమేటిక్) - రూ. 8.74 లక్షలు

2022 టొయోటా గ్లాంజా వి (మ్యాన్యువల్) - రూ. 9.19 లక్షలు

2022 టొయోటా గ్లాంజా వి (ఆటోమేటిక్) - రూ. 9.69 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

కొత్త టొయోటా గ్లాంజా (2022 Toyota Glanza) విడుదల

2022 టొయోటా గ్లాంజా - మైలేజ్, కాంపిటీషన్

మైలేజ్ విషయానికి వస్తే, కొత్త 2022 టొయోటా గ్లాంజా లీటరుకు 22.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది. రియల్ వరల్డ్‌లో ఈ మైలేజ్ గణాంకాలు మారే అవకాశం ఉంటుంది. టొయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టాటా ఆల్ట్రోజ్ మరియు మారుతి సుజుకి బాలెనో వంటి కార్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2022, 12:12 [IST]
English summary
New 2022 toyota glanza hatchback launched in india price starts at rs 6 39 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+