భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' (Audi) దేశీయ విపణిలో తన కొత్త 'క్యూ3' (Q3) ఎస్‌యువి విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే కంపెనీ ఈ లగ్జరీ కారుని దేశీయ మార్కెట్లో విడుడల చేయడానికి ముందే ఆల్-ఇండియా రోడ్‌షోను ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

Recommended Video

2022 Audi Q7 Launched In India | Price Rs 79.99 Lakh | 3-Litre Engine, Quattro | In Telugu

ఇందులో భాగంగానే ఇప్పుడు మన 'భాగ్యనగర' (హైదరాబాద్) వాసులకు తన ఆడి క్యూ3 ని చూపించడానికి సన్నద్ధమైంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ఆడి ఇండియా ఇప్పటికే ప్రకటించిన తన క్యూ3 పాన్-ఇండియా రోడ్‌షోలో భాగంగా హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఈ ప్రదర్శన 2022 సెప్టెంబర్ 1 మరియు 2 తేదీలలో కంపెనీ యొక్క హైదరాబాద్ డీలర్‌షిప్‌లో ప్రదర్శించబడుతుంది. అదే సమయంలో 2022 సెప్టెంబర్ 3 మరియు 4 వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కూడా ప్రదర్శించబడుతుంది.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త ఆడి క్యూ3 ని చూడాలనుకునే కస్టమర్లు విడుదలకు మరియు డెలివరీలకంటే ముందే చూడవచ్చు. ఇది హైదరాబాద్ ఆడి కార్ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ఆడి క్యూ3 పాన్-ఇండియా రోడ్‌షో గురించి ఆడి ఇండియా హెడ్ మిస్టర్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో కొత్త క్యూ3 SUV విడుదలకు ఇంక ఎంతో సమయం లేదు. అయితే అంతకంటే ముందు కస్టమర్లకు ఈ కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇది తప్పకుండా ఆడి ప్రియులకు ఆకర్షిస్తుందని అన్నారు.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ఈ రోడ్‌షో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా.. దేశంలో ఇతర ప్రముఖ నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ/ఎన్‌సీఆర్, గోవా, గౌహతి, ఇండోర్, జైపూర్, జమ్ము, కర్నాల్, కోల్‌కతా, కొచ్చి, లక్నో, లూథియానా, మధురై, ముంబై, పూణే, రాజ్‌కోట్, రాయ్‌పూర్., సూరత్, ఉదయపూర్ మరియు వైజాగ్‌లోని ఆడి ఇండియా డీలర్‌షిప్‌లలో కూడా నిర్వహించబడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు నిర్వహించబడుతుంది అనే సమాచారం కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త క్యూ3 ఎస్‌యువి మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.. ఇందులో డిఆర్ఎల్ తో కూడిన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ మరియు ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా.. పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ దిగువన హెక్సాగోనల్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

క్యూ3 ఎస్‌యువి యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు స్టాండర్డ్ 10.25-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం డాష్ ఇన్సర్ట్‌లు, లెదర్ సీటు అప్హోల్స్టరీ, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

కొత్త ఆడి క్యూ3 అంతర్జాతీయ మార్కెట్లలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ అందించగా, .0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ట్యూన్స్ లో 190 బిహెచ్‌పి పవర్ మరియు 230 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

అయితే ఇండియా-స్పెక్ ఆడి క్యూ3 మాత్రం 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది. ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎస్‌యువి బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 2,00,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ లో బుక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్స్.

భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. క్యూ3 రోడ్‌షో ప్రారంభించిన ఆడి: ఎక్కడ & ఎప్పుడు?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త క్యూ3 SUV ఆధునిక డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచార్స్ తో రానున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ SUV ధర మాత్రం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. కంపెనీ అధికారిక ధరలను లాంచ్ సమయంలో వెల్లడిస్తుంది. అంతే కాకుండా ఇప్పుడ్డు కంపెనీ నిర్వహిస్తున్న ఈ రోడ్ షో.. మరింత మంది ఎక్కువ కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2022, 9:37 [IST]
English summary
New audi q3 to be showcased in hyderabad details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+