దేశీయ మార్కెట్లో 'క్యూ5 స్పెషన్ ఎడిషన్' లాంచ్ చేసిన Audi: ధర & వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆడి ఇండియా' (Audi India) దేశీయ విఫణిలో తన కొత్త క్యూ5 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్ ధర రూ. 67.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త లగ్జరీ SUV యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ కొత్త స్పెషన్ క్యూ5 ఎడిషన్ టెక్నాలజీ ట్రిమ్ పై ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం విడుదలైన క్యూ5 స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అంతే కాకుండా ప్రత్యేకమైన ధర వద్ద యాక్సెసరీస్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 84,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. కొత్త స్పెషల్ ఎడిషన్ డిజైన్ అప్డేట్స్ పొందినప్పటికీ ఇంజిన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు. కావున ఈ స్పెషన్ ఎడిషన్ కూడా అదే పర్ఫామెన్స్ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఆడి Q5 స్పెషల్ ఎడిషన్ రెండు ప్రత్యేకమైన పెయింట్ షేడ్స్‌లో కూడా అందుబాటులో ఉంది. అవి డిస్ట్రిక్ట్ గ్రీన్ మరియు ఐబిస్ వైట్. ఇవి రెండూ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాగా ఎక్స్టీరియర్ డిజైన్ కి విరుద్ధంగా కొన్ని స్టైలింగ్ ప్యాకేజెస్ కూడా చూడవచ్చు. ఇందులో వింగ్ మిర్రర్‌లకు బ్లాక్ అవుట్ ఫినిషింగ్, గ్రిల్ మరియు టెయిల్‌గేట్‌పై ఆడి లోగో, రూఫ్ రైల్స్ మరియు 5-స్పోక్ వీల్స్‌కు కొత్త గ్రాఫైట్ గ్రే ఫినిషింగ్ వంటివి చూడవచ్చు.

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ లో పెద్దగా గమనించవలసిన అప్‌డేట్స్ లేదు, కానీ యాక్సెసరీస్ ప్యాకేజీని పొందవచ్చు. ఇందులో ఎలాంటి అప్‌డేట్‌లు లేనప్పటికీ, ఆడి ప్రత్యేక ధరలో యాక్సెసరీస్ ప్యాకేజీని అందిస్తోంది, ఇందులో రన్నింగ్ బోర్డ్‌లు మరియు సిల్వర్ తో పూర్తి చేసిన 'ఆడి రింగ్' ఫాయిల్ ఉన్నాయి.

కంపెనీ యొక్క ఈ స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, మెమరీతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఆడి వర్చువల్ కాక్‌పిట్ మొదలైనవాటిని పొందుతుంది.

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 249 హెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. కాగా దీని టాప్ స్పీడ్ గంటకు 237 కిలోమీటర్లు.

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ మొత్తమ్ 6 డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. అవి కంపర్ట్, డైనమిక్, ఇండియూజువల్, ఆటో, ఎఫిషియన్సీ మరియు ఆఫ్ రోడ్ మోడ్స్. వీటి ద్వారా వినియోగదారుడు తమకు నచ్చిన డ్రైవింగ్ మోడ్ లో డ్రైవింగ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న ఆడి క్యూ5 SUV, స్పెషల్ ఎడిషన్ లో విడుదల కావడం వల్ల మరింత మంది ఆడి కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి క్యూ5 SUV మెర్సిడెస్ బెంజ్, బిఎండబ్ల్యు ఎక్స్3, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








