ఈ నెలలో (2022 జులై) భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు: వివరాలు

భారతీయా మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వాహన వినియోగదారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపడమే. ఇందులో భాగంగానే గత నెలలో మహీంద్రా స్కార్పియో-ఎన్, 2022 మారుతి బ్రెజ్జా వంటివి విడుదలయ్యాయి. అయితే ఈ నెలలో కూడా దేశీయ మార్కెట్లో విడుదలవ్వడానికి కొన్ని సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

ఆడి ఏ8 ఎల్ ఫేస్‌లిఫ్ట్ (Audi A8L Facelift):

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆడి' (Audi) ఈ నెల (2022 జులై) 12 న దేశీయ మార్కెట్లో తన ఏ8 ఎల్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయనుంది. ఈ సెడాన్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనాలనుకునే కస్టమర్లు రూ. 10 లక్షలు చెల్లించి కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లో బుక్ చేసుకోవచ్చు.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

ఈ సెడాన్ లో కంపెనీ డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైట్ సెటప్‌ వినియోగించింది. అది మాత్రమే కాకుండా ఇందులో కొత్త క్రోమ్-ఫినిష్డ్ రేడియేటర్ గ్రిల్‌ ఇందులో ఉంటుంది. వెనుక వైపున సెడాన్ వెడల్పు అంతటా లైట్ బార్ చుట్టి, సొగసైన ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ ఉంటుంది. మొత్తం మీద ఇది చాలా అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు అప్డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఫోల్డబుల్ సెంటర్-కన్సోల్ టేబుల్ మరియు మినీ-బార్‌, రిక్లైనర్, ఫుట్ మసాజర్ వంటి వాటితో పాటు దాని మునుపటి మోడల్ లోని దాదాపు అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

2022 హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson):

హ్యుందాయ్ కంపెనీ యొక్క 2022 టక్సన్ ఈ నెల 13 న అధికారికంగా విడుదల కానుంది. ఈ కొత్త కారు ఇప్పుడు చాలా అప్డేట్స్ పొందే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

కొత్త 2022 హ్యుందాయ్ టక్సన్ 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ వంటి వాటితో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

ఇక ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 154 బిహెచ్‌పి పవర్ మరియు 192 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 184 బిహెచ్‌పి పవర్ మరియు 417 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లలో 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

సిట్రోయెన్ సి3 (Citroen C3):

ప్రెంచ్ కార్ తయారీ సంస్థ సిట్రోయెన్ దేశీయ మార్కెట్లో తన రెండవ మోడల్ అయిన సి3 ఎస్‌యూవీని 2022 జులై 20 న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది ఫీల్ మరియు లైవ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఈ ఎస్‌యూవీ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ముందస్తుగా రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

సిట్రోయెన్ సి3 SUV రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందే అవకాశం ఉంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇవి వరుసగా 81 బిహెచ్‌పి పవర్ & 115 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 108 బిహెచ్‌పి పవర్ & 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తాయి.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

మారుతి మిడ్-సైజ్ ఎస్‌యూవీ

మారుతి సుజుకి తన మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2022 జూలై 20 న విడుదల చేయనుంది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని మారుతి వితారా పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు డిజైన్ కలిగి ఉండటమే కాకుండా ఇది బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే అవకాశం ఉంది.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటోమేటిక్ (Mahindra Scorpio-N Automatic):

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే మహీంద్రా స్కార్పియో-ఎన్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కానీ ఇందులో ఆటోమాటిక్ 4X4 వేరియంట్‌ల ధరలను విడుదల చేయలేదు. కావున దీనిని కంపెనీ ఈ నెల 21 న విడుదల చేయనుంది. అయితే ఇది అదే డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కానీ ఇంజిన్ పనితీరులో మాత్రం మార్పు ఉంటుంది.

2022 జులైలో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు: వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ (Nissan Magnite Red Edition):

నిస్సాన్ కంపెనీ త్వరలో తన 'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను భారతీయ మార్కెట్ కి తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కోసం కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. నిస్సాన్ కంపెనీ తన 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను ఈ నెల 18 న (2022 జులై) దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కొత్త ఎడిషన్ మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. అవి XV మ్యాన్యువల్ ఎడిషన్, టర్బో మ్యాన్యువల్ ఎడిషన్ మరియు టర్బో XV సివిటి ఎడిషన్. నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, July 11, 2022, 10:07 [IST]
English summary
New car launches in 2022 july details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+