2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో చాలా ఆధునిక కార్లు అరంగేట్రం చేశాయి. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఇవి మంచి స్పందన పొందాయి. ఇందులో మహీంద్రా ఎక్స్‌యువి700, ఎంజి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు మారుతి సెలెరియో ఉన్నాయి. ఈ కొత్త కార్లు గత ఫిబ్రవరి నెలలో ఎలాంటి అమ్మకాలను పొందాయనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):

దేశీయ వాహన తయారీ సంస్థ అయినా మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఎక్స్‌యువి700 మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ 2022 ఫిబ్రవరి నెలలో మొత్తం 4,138 యూనిట్లను విక్రయించింది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

మహీంద్రా కంపెనీ ఇప్పటికే ఈ ఎక్స్‌యువి700 కోసం 70,000 బుకింగ్స్ పొందినట్లు సమాచారం. అయితే ఆటో మొబైల్ పరిశ్రమలో సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల డెలివరీలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడింది. కావున కంపెనీ యొక్క ఈ కొత్త కారు రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

ఎంజి ఆస్టర్ (MG Astor):

ఎంజి మోటార్ కంపెనీ యొక్క కొత్త ఎంజి ఆస్టర్ ను 2022 ఫిబ్రవరి నెలలో మొత్తం 2275 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. కంపెనీ గత సంవత్సరం కేవలం 5000 యూనిట్లు మాత్రమే అందించింది. ఇందులో మొత్తం 2500 యూనిట్లను డెలివరీ చేసింది. అయితే గత సంవత్సరంలో కంటే కూడా గత ఫిబ్రవరి నెలలో మంచి అమ్మకాలను నమోదు చేయగలిగింది. రానున్న రోజుల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

మారుతి సెలెరియో (Maruti Celerio):

మారుతి సుజుకి కంపెనీ ఇటీవల విడుదల చేసిన మారుతి సెలెరియోను గత నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ అందించిన గణాంకాల ప్రకారం సెలెరియో గత నెలలో 9896 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు మునుపటికంటే కూడా 20% వృద్ధి చెందినట్లు కూడా ఈ నివేదికల ద్వారా తెలిసింది. ఈ అమ్మకాలు ఈ నెలలో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

టాటా పంచ్ (Tata Punch):

టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మైక్రో SUV విడుదలైనప్పటినుంచి కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందిన కారు. ఇది గత నెలలో 9592 యూనిట్లను విక్రయించింది. అయితే 2022 జనవరి నెలలో కంపెనీ మొత్తం 10027 యూనిట్లను విక్రయించింది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

దీన్ని బట్టి చూస్తే జనవరి అమ్మకాల కంటే కూడా ఫిబ్రవరి అమ్మకాలు 4 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. టాటా పంచ్ మైక్రో SUV మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. అయితే ఎన్ని బుకింగ్స్ పొందింది అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్:

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క టైగన్ గత నెలలో 2388 యూనిట్లను విక్రయించింది. అయితే 2022 జనవరి నెలలో అమ్మకాలు 2432 యూనిట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. ఈ గణాంకాల ప్రకారం జనవరి కంటే కూడా ఫిబ్రవరి అమ్మకాలు 2 శాతం తగ్గాయని తెలిసింది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

కంపెనీ యొక్క ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కస్టమర్ల నుండి గొప్ప స్పందనను పొందింది, ఈ కారణంగానే కంపెనీ యొక్క ఈ కారు రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

స్కోడా కుషాక్:

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ స్కోడా తన కుషాక్ SUV విడుదలతో మంచి అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ 2022 ఫిబ్రవరి నెలలో మొత్తం 2307 యూనిట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే 2022 జనవరి నెలలో కంపెనీ 2608 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల పరంగా జనవరి కంటే ఫిబ్రవరిలో 12 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

రెనాల్ట్ కైగర్:

భారతీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలను పొందుతున్న కార్ కంపెనీలలో ఒకటి రెనాల్ట్ ఇండియా. ఈ కంపెనీ యొక్క రెనాల్ట్ కైగర్ గత నెలలో 2247 యూనిట్లను విక్రయించింది. అయితే కంపెనీ ఈ కైగర్ ను జనవరిలో 3053 యూనిట్ల వరకు విక్రయించింది. దీని ప్రకారమా జనవరి కంటే కూడా ఫిబ్రవరిలో అమ్మకాలు 26 శాతం తగ్గాయి. అయితే రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

2022 ఫిబ్రవరిలో కొత్త కార్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. చూసారా..!!

మొత్తం మీద దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లను మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా కంపెనీ యొక్క అమ్మకాలు మెరుగుపడ్డాయి. అయితే ఈ అమ్మకాలు ఈ నెలలో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే ఇవి ఈ నెలలో ఎలాంటి అమ్మకాలను పొందుతాయి అనేది త్వరలోనే తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2022, 19:45 [IST]
English summary
New car sales february 2022 mahindra xuv700 punch astor kushaq tiguan details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+