అమ్మకాల్లో కొత్త కార్ల హవా.. 2022 జనవరి సేల్స్ రిపోర్ట్ ఇక్కడ చూడండి
2022 కొత్త సంవత్సరంలో చాలా కొత్త కార్లు దేశీయ మార్కెట్లో మంచి సంఖ్యలో అమ్మకాలను చేపట్టాయి. ఇందులో మహీంద్రా ఎక్స్‌యువి700, ఎంజి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగాన్, స్కోడా కుషాక్ మరియు మారుతి సెలెరియో ఉన్నాయి. అయితే దేశీయ మార్కెట్లో ఈ కార్ల అమ్మకాల యొక్క నివేదిక కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700):
దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' యొక్క 'ఎక్స్‌యువి700' దేశీయ విఫణిలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీకి ఇప్పటికే దాదాపు 70,000 కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. అయితే ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచంలో ఉన్న సెమీకండక్టర్ చిప్ కొరతల కారణంగా డెలివరీలో కొంత ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడింది.

ఇప్పటికే కంపెనీ నుంచి అందిన కొంత సమాచారం ప్రకారం, ఎక్స్‌యువి700 త్వరలోనే 6 సీట్ల వేరియంట్‌లో దేశీయ మార్కెట్లోకి రానున్నట్లు తెలిసింది. అయితే ఈ కొత్త SUV 2022 సంవత్సరంలో తప్పకుండా విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

ఎంజి ఈస్టర్ (MG Aster):
ఎంజి మోటార్స్ యొక్క ఎంజి ఆస్టర్ (MG Aster) 2022 జనవరి నెలలో మొత్తం 2,068 యూనిట్లను విక్రయించగలిగింది. అయితే కంపెనీ ఈ మోడల్ ని 2021 జనవరిలో మొత్తం 5,000 యూనిట్లను విక్రయించింది. కానీ కేవలం 2,500 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది. 2021 కంటే 2022 లో అమ్మకాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. కంపెనీ తన ఉత్పత్తిని కూడా త్వరలోనే మరింత మెరుగుపరచడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

మారుతి సెలెరియో (Maruti Celerio):
అతి పెద్ద వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇటీవల కాలంలోనే తన కొత్త సెలెరియో (Celerio) మోడల్ విడుదల చేసింది. విడుదలైన అతి తక్కువా కాలంలోనే గత నెలలో 8,279 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు కంపెనీ యొక్క వృద్ధిని పెంచడంలో చాలా సహకరించాయి. ఈ కొత్త మారుతి సెలెరియో (Maruti Celerio) అమ్మకాలు రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.

టాటా పంచ్ (Tata Punch):
భారతదేశంలో ప్రజలకు అత్యంత నమ్మికయిన వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) గత సంవత్సరం కొత్త మైక్రో SUV 'టాటా పంచ్' విడుదల చేసింది. ఇది విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ యొక్క ఈ SUV 2022 జనవరి నెలలో మొత్తం 10,027 యూనిట్లను విక్రయిచగలిగింది.

అదే విధంగా 2021 డిసెంబర్ నెలలో మొత్తం 8008 యూనిట్లను విక్రయించగలిగింది. డిసెంబర్ అమ్మకాలతో పోలిస్తే జనవరి అమ్మకాలు 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ యొక్క ఈ చిన్న కారు కస్టమర్ల నుండి గొప్ప స్పందనను పొందింది. ఈ కారణంగానే కంపెనీకి భారీ బుకింగ్‌లు వచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలను పొందటానికి ఈ మైక్రో SUV సిద్ధంగా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Tiguan):
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క ఫోక్స్‌వ్యాగన్ టైగాన్ (Volkswagen Tiguan) 2022 జనవరి నెలలో మొత్తం 2432 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో కంపెనీ 2021 డిసెంబర్ నెలలో 2,828 యూనిట్ల అమ్మకాలను పొందింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు డిసెంబర్ నెలకంటే కూడా జనవరి నెలలో 14 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

స్కోడా కుషాక్ (Skoda Kushaq):
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ అయిన స్కోడా (Skoda) తన కుషాక్ (Kushaq) SUV ని గత సంవత్సరంలో భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ SUV యొక్క అమ్మకాలు మొదటినుంచి బాగానే ఉన్నాయి. 2022 జనవరి నెలలో మొత్తం 2,608 యూనిట్లను విక్రయించింది. అదేసమయంలో 2021 డిసెంబర్ నెలలో 2840 యూనిట్లను విక్రయించింది. దీని ప్రకారం జనవరి కంటే కూడా డిసెంబర్ లో ఎక్కువగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రానున్న నెలలో ఎలాంటి అమ్మకాలను పొందుతుందో అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

రెనాల్ట్ కైగర్ (Renault Kiger):
భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రెనాల్ట్ (Renault) కంపెనీ యొక్క కైగర్ (Kiger) మంచి ఆదరణ పొందుతోంది. కంపెనీ గత నెలలో 3,053 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2021 డిసెంబర్ నెలలో 2,117 యూనిట్లను పొందుతుంది. కంపెనీ యొక్క రెనాల్ట్ కైగర్ (Renault Kiger) అమ్మకాలు జనవరిలో 44 శాతం వృద్ధిని నమోదు చేసింది. రానున్న రోజుల్లో కంపెనీకి మరిన్ని మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








