సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ భారత ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ ఎస్‌యూ లైనప్ ను విస్తరించుకునేందుకు దేశీయ మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) ను కంపెనీ త్వలరోనే భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కొత్త 2022 టూసాన్ ఎస్‌యూవీకి ఇటీవలే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ ఇప్పుడు మునుపటి కన్నా మరింత ధృడంగా మారింది. మూడవ తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ గడచిన క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ తమ కొత్త మోడల్ సేఫ్టీపై మరింత ఎక్కువ దృష్టి పెట్టి, కొత్త టూసాన్ అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా తీర్చిదిద్దింది. సమాచారం ప్రకారం, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ దేశంలో లాంగ్ వీల్‌బేస్ అవతార్‌లో అందించబడుతుందని తెలుస్తోంది. ఇది వెనుక సీటు ప్రయాణీకులకు మెరుగైన లెగ్‌రూమ్‌ను అందిస్తుంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

అంతేకాకుండా, కొత్త 2022 టూసాన్ విలాసవంతమైన మరియు విశాలమైన క్యాబిన్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ పరంగా కూడా ఇది మునుపటి తరం మోడళ్ల కన్నా గణనీయమైన మార్పులను కలిగి ఉంది. కొత్త హ్యుందాయ్ టూసాన్ ముందు వైపు సరికొత్త ఫ్రంట్ ఫాసియాతో చాలా ప్రీమియం‌గా కనిపిస్తోంది. ముందు వైపు కొత్త క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కొత్తగా చెప్పుకోవాల్సింది దాని స్పోర్టీ అల్లాయ్ వీల్స్ గురించి, ఇవి ప్రత్యేకమైన డ్యూయెల్ టోన్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

వెనుక వైపున, కొత్త హ్యుందాయ్ టక్సన్ దాని పూర్తి వెడల్పుతో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లతో చాలా ఆధునికంగా మరియు అధునాతనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, తక్కువ లోడింగ్ ఎత్తుకు అనువుగా ఉండే బూట్ డోర్ చాలా ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ దాని కాక్‌పిట్-స్టైల్ డివిజన్ తో చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. ఇందులోని డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ క్యాబిన్ కు మరింత అధునికతను జోడిస్తుంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

ఈ కారులోని ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీలో వెంటిలేటెడ్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో వైపర్‌లు, ఆటో డే/నైట్ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పానోరమిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక వైపు ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ లోని సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయించబడుతున్న ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలైజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటన్నింటికీ మించి కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ యూరో NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ఖచ్చితమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను స్కోర్ చేయడం వలన, ఇది భారతదేశంలోని హ్యుందాయ్ షోరూమ్‌లకు మరింత సంభావ్య కస్టమర్‌లను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

హ్యుందాయ్ టూసాన్ యొక్క కొత్త 2022 మోడల్ కోసం ఇటీవల నిర్వహించిన Euro NCAP క్రాష్ టెస్టులో వేగంగా నడుపుతూ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్ నిర్వహించిన తర్వాత కూడా దీని ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ స్థిరంగా ఉందని కనుగొనబడింది. అడల్ట్ (పెద్దల) సేఫ్టీ విషయంలో ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ 16 పాయింట్లకు గానూ గరిష్టంగా 12.4 పాయింట్లను స్కోర్ చేసింది. పాదచారుల భద్రత (పెడస్టేరియన్ సేఫ్టీ) విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ టూసాన్ యూరో-ఎన్‌సిఎపిలో పాదచారుల రక్షణ భద్రతా పరీక్షలో 54 పాయింట్లకు గానూ 36.1 పాయింట్లను స్కోర్ చేసింది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

క్రాష్ టెస్ట్ సమయంలో Euro-NCAP ద్వారా పరీక్షించబడిన వేరియంట్ Tucson GLS ట్రిమ్. ఇది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.6 లీటర్ GDI టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ను కలిగి ఉంటుంది. ఇదే కాకుండా, నాల్గవ తరం 2022 హ్యుందాయ్ టూసాన్ లో 1.6 లీటర్ ఇంజన్‌తో ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ భారతదేశంలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రైన్‌తో వచ్చే అవకాశం ఉంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson), త్వరలో భారత్‌లో విడుదల

ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులోని డీజిల్ యూనిట్ 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Monday, May 30, 2022, 16:45 [IST]
English summary
New gen 2022 hyundai tucson gets 5 star safety rating in euro ncap crash test india launch soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+