కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

ఇటీవలే కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (2022 Hyundai Venue Facelift) మోడల్ ని విడుదల చేసిన కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇప్పుడు తమ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ (New Gen 2022 Hyundai Tucson) ప్రీమియం ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇండియా ప్రకారం, నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని కంపెనీ జూలై 13, 2022వ తేదీన దేశీయ విపణిలో విడుదల కానుంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

భారతదేశంలో క్రెటా మరియు వెన్యూ ఎస్‌యూవీలు గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో, కొత్త తరం టూసాన్ ఎస్‌యూవీపై హ్యుందాయ్ చాలా ఆశలు పెట్టుకుంది. హ్యుందాయ్ టూసాన్ భారత్‌లో విక్రయించబడటం ఇదేం మొదటిసారి కాదు. కంపెనీ చాలా ఏళ్లుగా ఈ కారును భారత్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచింది. అయితే, ఇది ఆశించిన అమ్మకాలను సాధించడంలో విఫలమైంది. కానీ ఈ మోడల్ ప్రపంచ మార్కెట్లలో మంచి విజయాన్ని సాధించింది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 7 లక్షల యూనిట్లకు పైగా టూసాన్ ఎస్‌యూవీలను విక్రయించగలిగింది. హ్యుందాయ్ టూసాన్ మార్కెట్లో మొదటిసారిగా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ నాలుగు తరాల మోడళ్లు వచ్చాయి. తాజాగా, భారతదేశంలో విడుదల కాబోతున్న నాల్గవ తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని కంపెనీ 2020 లోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ మరియు అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త మోడల్ ఇప్పటికే మంచి హిట్ అయ్యింది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

పాత మోడల్ తో పోలిస్తే కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇది హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీ - సెన్సుయస్ స్పోర్టినెస్‌ ఆధారంగా రూపొందించబడింది. ఈ కారులో ముందు వైపు కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

సైడ్ ప్రొఫైల్ కొత్తగా చెప్పుకోవాల్సింది దాని స్పోర్టీ అల్లాయ్ వీల్స్ గురించి, ఇవి ప్రత్యేకమైన డ్యూయెల్ టోన్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెనుక వైపున, కొత్త హ్యుందాయ్ టక్సన్ దాని పూర్తి వెడల్పుతో ఉండే ఎల్ఈడి లైట్ బార్, త్రిభుజాకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లతో చాలా ఆధునికంగా మరియు అధునాతనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, తక్కువ లోడింగ్ ఎత్తుకు అనువుగా ఉండే బూట్ డోర్ చాలా ఆచరణాత్మకంగా కనిపిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే, కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ దాని వర్చ్యువల్ కాక్‌పిట్-స్టైల్ డివిజన్ తో చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. ఇందులోని డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ క్యాబిన్ కు మరింత అధునికతను జోడిస్తుంది. ఇంకా ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటో వైపర్‌లు, ఆటో డే/నైట్ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పానోరమిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక వైపు ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ మునుపటి తరం మోడల్ కన్నా అనేక రెట్లు మెరుగైన సేఫ్టీని కలిగి ఉంటుంది. ఈ కారు కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ మరియు యూరో ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులలో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ (పెద్దల) సేఫ్టీ విషయంలో ఈ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ 16 పాయింట్లకు గానూ గరిష్టంగా 12.4 పాయింట్లను స్కోర్ చేసింది. పాదచారుల భద్రత (పెడస్టేరియన్ సేఫ్టీ) విషయానికొస్తే, కొత్త హ్యుందాయ్ టూసాన్ యూరో-ఎన్‌సిఎపిలో పాదచారుల రక్షణ భద్రతా పరీక్షలో 54 పాయింట్లకు గానూ 36.1 పాయింట్లను స్కోర్ చేసింది.

కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ (Hyundai Tucson) లాంచ్ డేట్ ఖరారు.. జులై 13న విడుదల

ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, భారతదేశంలో ఇది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులోని డీజిల్ యూనిట్ 184 బిహెచ్‌పి పవర్ ను మరియు 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల కావచ్చని సమాచారం. కాగా, ప్రస్తుతానికి హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్‌ అందుబాటుసో ఉంటుందో లేదో ఖచ్చితమైన సమాచారం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New gen 2022 hyundai tucson india launch date revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X