India
YouTube

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

గ్రాండ్ విటారా లాంచ్‌తో 2022 ఆర్థిక సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించిన మారుతి సుజుకి, ఇప్పుడు మరో పెద్ద లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మారుతి సుజుకి తమ మోడళ్లలో అనేక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. అయితే, ఈసారి పూర్తిగా సరికొత్త మోడల్‌గా వచ్చింది గ్రాండ్ విటారా మాత్రమే. ఇది బ్రెజ్జా ఆధారంగా తయారు చేయబడిన పొడవాటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ మరియు మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ కారు. గ్రాండ్ విటారా తర్వాత మారుతి సుజుకి నుండి కాబోయే అతిపెద్ద కార్ లాంచ్ కొత్త తరం ఆల్టో కె10 (Alto K10).

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

మారుతి సుజుకి తమ చిన్న ఆల్టో 800 మోడల్‌ని విడుదల చేసిన తర్వాత పెద్ద ఆల్టో కె10 గురించి మర్చిపోయింది మరియు ఈ మోడల్‌ను మార్కెట్లో నిలిపివేసింది. అయితే, ఇప్పుడు కొనుగోలుదారులు కాస్తంత ధర ఎక్కువైనా పర్వాలేదు పెద్దగా, సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉండే కార్లను కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కార్ల సేఫ్టీ విషయంలో తయారీదారులపై వత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ కార్లను మరింత సమర్థవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాయి.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కూడా తమ చిన్న కార్ లైనప్‌ను అప్‌గ్రేడ్ చేసి, నేటి ఆధుని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా తయారు చేస్తోంది. మారుతి సుజుకి ఇప్పటికే తమ ఆల్టో 800 సిరీస్‌లో అనేక వేరియంట్లను డిస్‌కంటిన్యూ చేసింది. మరోవైపు, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన ఆల్టో అమ్మకాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న మారుతి సుజుకి, తమ పాత ఆల్టో కె10 ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి విడుదల చేయాలని చూస్తోంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 (2022 Maruti Suzuki Alto K10) కారుకి సంబంధించిన ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వంటి అనేక వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన వివరాలను ఆటోమోటివ్ ఔత్సాహికుడు రాహుల్ నాయర్ ఇంటర్నెట్ లో షేర్ చేశారు. ఓ నివేదిక ప్రకారం, కొత్త తరం మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత మారుతి సుజుకి ఆల్టో 800తో పాటుగా విక్రయించబడుతుందని సమాచారం.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

రాబోయే కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ మొత్తం 12 వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుందని ధృవీకరించే కొన్ని లీకైన సమాచారం ఉన్నప్పటికీ, గతంలో లీకైన NCT రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రం ఈ కొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ కేవలం 11 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని వెల్లడిస్తున్నాయి. తాజాగా లీకైన NCT రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, వీటిలో 6 వేరియంట్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటాయి, అయితే మిగిలిన 5 వేరియంట్‌లు 5-స్పీడ్ AMT యూనిట్ (AGS-ఆటో గేర్ షిఫ్ట్) తో అమర్చబడి ఉంటాయి.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ను కంపెనీ యొక్క కొత్త మాడ్యులర్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ పై ఆధారపడి నిర్మించబడుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ పై తయారైన ఆల్టో కె10 ప్రస్తుత ఆల్టో 800 కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ NCT రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నుండి లీక్ అయిన స్పెసిఫికేషన్ల ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ 3,530 మిమీ పొడవు, 1,490 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తును కలిగి ఉంది. అలాగే, కొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 యొక్క వీల్‌బేస్ 2,380 మిమీగా ఉంటుంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

తాజాగా, ఆల్టో కె10 కోసం లీకైన చిత్రాలను గమనిస్తే, ఈ కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత ఆల్టో 800 మరియు కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ లను కలగలపి డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. దీని ముందు భాగాన్ని చూస్తే, కంపెనీ గతంలో విక్రయించిన ఏ-స్టార్ కారు డిజైన్ కూడా గుర్తుకు వస్తుంది. ఓవరాల్ గా ఈ పెద్ద ఆల్టో కారు డిజైన్ మాత్రం చూడటానికి చాలా బాగుంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

కొత్త తరం ఆల్టో కె10 ముందు భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన పెద్ద గ్రిల్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో కూడిన పెద్ద హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్స్, సైడ్ మిర్రర్స్, విండోలైన్, డోర్‌ప్యానెల్స్ మరియు వెనుక వైపున టెయిల్ ల్యాంప్స్ మరియు బంపర్ పై క్రోమ్ గార్నిష్ వంటి డిజైన్ హైలైట్స్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ పై మజిక్యులర్ బాడీ లైన్స్, సైడ్స్ లో ఉబ్బినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్ ని కలిగి ఉంటుంది. ఇది కేవలం స్టీల్ వీల్స్ తో మాత్రమే లభిస్తుందని లీకైన చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

ఇక కారు లోపలి వైపున చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ కొత్త తరం ఆల్టో కె10 కారులోని డ్యాష్‌బోర్డ్ చాలా పొడవుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఇందులోని సీటింగ్ కూడా ప్రస్తుత తరం ఆల్టో 800 హ్యాచ్‌బ్యాక్ కంటే పొడవుగా, పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంటుంది మరియు పాత ఆల్టో 800కి ఏమాత్రం పోలిక ఉండదు. రాబోయే 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

సేఫ్టీ విషయానికి వస్తే, ఫ్రంట్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్పీడ్-అలర్ట్ బజర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్‌లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, మారుతి సుజుకి ఆల్టో కె10లోని భద్రతా లక్షణాలు నేటి ఆధునిక సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచబడతాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ చిన్న కారులోని ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్య అక్టోబర్ 1, 2022 నుండి 6కి పెంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫొటోలు మరియు ఫీచర్స్

చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ లో గతేడాది మార్కెట్లో విడుదలైన కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో మరియు ప్రస్తుత వ్యాగన్ఆర్ మోడళ్లలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ డ్యూయల్ జెట్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ కె K10C సిరీస్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

కొత్త తరం ఆల్టో కె10 మార్కెట్లో విడుదలైనప్పుడు ఈ సెగ్మెంట్‌లో దీని నేరుగా ఎలాంటి పోటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే, చాలా మంది తయారీదారుల ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తక్కువ అమ్మకాల కారణంగా తమ మోడళ్లను నిలిపివేస్తున్నాయి. నేపథ్యంలో, కొత్త ఆల్టో కె10 రాకతో ఇది తిరిగి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్ గా నిలిచే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

ఫొటో మూలం: Rushlane

Most Read Articles

English summary
New gen maruti suzuki alto k10 details leaked ahead of the official launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X