భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో తమ కొత్త తరం సఫారీని ప్రవేశపెట్టి అప్పుడే ఏడాది కాలం పూర్తయింది. దశాబ్ధాలుగా భారత మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన సఫారీ ఎస్‌యూవీని కంపెనీ తిరిగి కొత్త అవతార్ లో 2021 లో ప్రవేశపెట్టింది. టాటా హారియర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న కొత్త తరం టాటా సఫారీ కస్టమర్ల నుండి గొప్ప స్పందనను అందుకుంటుంది మరియు దాని విభాగంలో మంచి పనితీరును కనబరుస్తోంది.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

టాటా సఫారీ గడచిన అక్టోబర్ 2021 మరియు జనవరి 2022 మధ్య కాలంలో కంపెనీ అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా ఉందని టాటా మోటార్స్ పేర్కొంది. టాటా మోటార్స్ కొత్త 2021 టాటా సఫారిని 7 వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో XE, XM, XT, XT+, XZ, XZ+ వేరియంట్లతో పాటుగా అడ్వెంచర్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు, కంపెనీ ఇందులో డార్క్ ఎడిషన్‌ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ త్వరలోనే కజిరంగా ఎడిషన్‌లో టాటా సఫారీని పరిచయం చేసే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ వాహన వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఎస్‌యూవీ టాటా సఫారీ. కాగా, ఇందులోని అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది. టాటా సఫారీ హారియర్ కంటే పొడవుగా ఉన్నప్పటికీ, హారియర్ ను తయారు చేసిన అదే ప్లాట్‌ఫారమ్‌పైనే ఇది కూడా నిర్మించబడింది. ఈ ఎస్‍యూవీలో ట్రై-యారో ఫ్రంట్ గ్రిల్, సఫారీ బ్రాండింగ్‌తో కూడిన రూఫ్ రెయిల్‌లు, ఆ18 మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ మరియు సిగ్నేచర్ ట్విన్ లైట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

కొత్త టాటా సఫారీ 6 సీట్లు మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్ తో అందుబాటులో ఉంటుంది. ఆరు సీట్ల వేరియంట్ లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు మరియు ఏడు సీట్ల వేరియంట్లో మధ్య వరుసలో బెంచ్ సీట్లు ఉంటాయి. ఇక ఇందులోని టాప్ స్పెక్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, కెప్టెన్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్లు, ఆయిస్టర్ వైట్ ఇంటీరియర్, యాష్‌వుడ్ గ్రే థీమ్డ్ డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

అంతేకాకుండా, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే పెద్ద 8.8 ంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు డోర్‌లపై పుష్కలమైన స్టోరేజ్ స్పేస్‌, JBL ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ విషయానికి వస్తే, కొత్త తరం టాటా సఫారీ శక్తివంతమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 173 bhp శక్తిని మరియు 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

డ్రైవింగ్ చేసే రోడ్ కండిషన్ ను బట్టి ఎంచుకునేందుకు ఇందులో వివిధ రకాల డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. దీనితో పాటు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఇవ్వబడ్డాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ డిసెంట్ కంట్రోల్, చైల్డ్ సీట్ ఐసోఫిక్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

కొత్త టాటా సఫారి 9 మాన్యువల్ మరియు 6 ఆటోమేటిక్ ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో కొత్తగా ప్రవేశపెట్టబడిన టాటా సఫారీ డార్క్ ఎడిషన్ ఎలా ఉంది టాప్ స్పెక్ వేరియంట్స్ అయిన XZ+ / XZA+ వేరియంట్ల ఆధారంగా తయారు చేయబడింది. ఇందులోని మొదటి మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వబడ్డాయి మరియు ఇది కెప్టెన్ సీట్లతో అమర్చబడిన 6 సీట్ల వేరియంట్‌గా తీసుకురాబడింది. గతంలో ఈ వెంటిలేటెడ్ సీటు గోల్డ్ మరియు డార్క్ ఎడిషన్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

అయితే, కస్టమర్ల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, కంపెనీ ఇప్పుడు దాని టాప్ వేరియంట్‌లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దాని ఫెండర్‌లు మరియు టెయిల్‌గేట్‌పై డార్క్ బ్యాడ్జ్‌లు ఇవ్వబడ్డాయి, అలాగే 18 ఇంచ్ బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో అమర్చబడ్డాయి. అదే సమయంలో, దాని ఇంటీరియర్‌లో ప్రీమియం బ్లాక్‌స్టోన్ డార్క్ థీమ్ ఇవ్వబడింది. దీనికి డార్క్ ఫినిషింగ్ ఇవ్వబడింది, దీనిలో డాష్‌బోర్డ్ ప్రత్యేక బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్‌లో ఉంచబడింది.

భారత మార్కెట్లో ఏడాది పూర్తి చేసుకున్న కొత్త తరం టాటా సఫారీ (Tata Safari)

అదే సమయంలో ఇందులో ప్రీమియం డార్క్ అప్‌హోలెస్ట్రీ కూడా ఇవ్వబడింది. ఫీచర్ల పరంగా చూస్తే, దాని మొదటి మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్ల ఎంపికతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 22, 2022, 15:52 [IST]
English summary
New gen tata safari suv completes 1 year in indian market details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+