‘నైట్ ఎడిషన్’ (Knight Edtion) లో రానున్న హ్యుందాయ్ క్రెటా: వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) భారతీయ మార్కెట్లో త్వరలో తన 'క్రెటా నైట్ ఎడిషన్' (Creta Knight Edtion) ను విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ SUV ని అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే దాని వివిధ వేరియంట్ల ధరలను వెల్లడించింది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 'క్రెటా నైట్ ఎడిషన్' (Creta Knight Edtion) రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి 'ఎస్ ప్లస్ నైట్' వేరియంట్ కాగా మరొకటి ఎస్ఎక్స్(ఓ) నైట్ వేరియంట్. ఈ రెండూ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో లభ్యం కానున్నాయి.

క్రెటా నైట్ ఎడిషన్ ధరలు ఇలా ఉన్నాయి.
- క్రెటా ఎస్ ప్లస్ నైట్ (పెట్రోల్): రూ. 13.35 లక్షలు
- క్రెటా ఎస్ ప్లస్ నైట్ (డీజిల్): రూ. 14.31 లక్షలు
- క్రెటా ఎస్ఎక్స్(ఓ) నైట్ (పెట్రోల్): రూ. 17.06 లక్షలు
- క్రెటా ఎస్ఎక్స్(ఓ) నైట్ (డీజిల్): 18.02 లక్షలు

త్వరలో విడుదల కానున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్' ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ ఇన్సర్ట్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్ చూడవచ్చు. అంతే కాకుండా ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్ గ్లోస్ బ్లాక్‌లో పూర్తి చేయబడ్డాయి. వీటితోపాటు సైడ్ సిల్స్, రూఫ్ రెయిల్స్, ORVMలు మరియు C-పిల్లర్‌లకు అదే బ్లాక్ గ్లోస్ ఫినిషింగ్ ఉంటుంది.

క్రెటా నైట్ ఎడిషన్ యొక్క అల్లాయ్ వీల్స్ 'డార్క్ మెటల్' కలర్ స్కీమ్‌లో పూర్తి చేయబడ్డాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ల కోసం బ్రేక్ కాలిపర్‌లు రెడ్ కలర్ లో ఉంటాయి. టెయిల్‌గేట్‌పైన నైట్ ఎడిటన్ బ్యాడ్జ్ కూడా చూడవచ్చు.

క్రెటా నైట్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పూర్తిగా బ్లాక్-థీమ్ లో ఉంటుంది. అయితే గ్లోస్ బ్లాక్ సెంటర్ కన్సోల్ మరియు ఎయిర్ కండిషనింగ్ వెంట్ వంటివి కలర్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి. ఇందులోని సీట్లు మరియు స్టీరింగ్ వీల్ కలర్ పైపింగ్ మరియు స్టిచ్చింగ్ పొందుతాయి.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్లను కలిగి ఉంటుంది. అవి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఈ రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

మొదటగా 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ సహజంగా ఆశించిన యూనిట్, ఇది 6,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ S+ నైట్ వేరియంట్ లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. అదే విధంగా ఎస్ఎక్స్(ఓ) నైట్ వేరియంట్ సవిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ S+ నైట్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అదే విధంగా ఎస్ఎక్స్(ఓ) నైట్ వేరియంట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో రోజురోజుకి బ్లాక్ ఎడిషన్స్ కి ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు దీనివైపు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా SUV భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీ కూడా తన పాపులర్ క్రెటాను ఈ నైట్ ఎడిషన్ లో తీసుకురానుంది.

దేశీయ మార్కెట్లో ఈ కొత్త SUV విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాలి. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ పాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








