ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సిద్దమవుతున్న 'హ్యుందాయ్ ఐ10 నియోస్'.. రానున్న 'మారుతి స్విఫ్ట్'కి గట్టి పోటీ ఇస్తుందా.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' కంపెనీ యొక్క 'ఐ10' ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ముందుకు సాగుతూ ఉంది, ఆ తరువాత ఐ10 నియోస్ పుట్టుకొచ్చింది, కాగా ఇప్పుడు 'ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్' రావడానికి సిద్ధమవుతోంది.

గత కొన్ని సంవత్సరాలు హ్యుందాయ్ తన 'గ్రాండ్ ఐ10 నియోస్'ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి శ్రమిస్తూనే ఉంది, అయితే ఇప్పటికి ఆ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఇటీవల ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కనిపించింది. అయితే ఈ వెర్షన్ టెస్టింగ్ సమయంలో చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌కు సమీపంలో కనిపించింది, కావున దీనికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సిద్దమవుతున్న హ్యుందాయ్ ఐ10 నియోస్

రానున్న ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ముందు మరియు వెనుక చాలా వరకు కప్పబడి ఉండటం వల్ల ఖచ్చితమైన డిజైన్ వెల్లడి కాలేదు, కానీ ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్ కేసింగ్ డిజైన్ వంటివి మునుపటి మాదిరిగానే ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా కొంత అప్డేట్ పొందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క సైడ్ ప్రొఫైల్ కూడా చాలా వరకు దాని మిమునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ రిఫ్రెష్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. దీనితో పాటు ఇందులో కొన్ని సూక్ష్మ అప్డేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎక్స్టీరియర్ డిజైన్ కొన్ని అప్డేట్స్ పొందినప్పటికీ, చూడగానే దాని మునుపటి మోడల్ గుర్తుకు తెస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, రాబోయే 2023 ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి వాటితో పాటు రిఫ్రెష్ చేయబడిన అపోల్స్ట్రే వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో అందుబాటులో ఉన్న 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగి ఉంది. మొత్తం మీద ఇంటీరియర్ ఫీచర్స్ తప్పకుండా వాహన వినియోగదారుల అనుభూతికి అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాము.

2023 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ అదే 1.2 లీ పెట్రోల్ ఇంజిన్ 83 పిఎస్ పవర్ మరియుయూ 113.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా ఇందులోని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 100 పిఎస్ పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కానీ ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

గతంలో జర్మనీలో ఒక సారి స్పాట్ టెస్ట్ సమయంలో కనిపించిన ఐ10 టెస్ట్ మ్యూల్ స్కై బ్లూ కలర్ షేడ్‌లో ఉంది. అప్పుడు ఆ కలర్ భారతీయ మార్కెట్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉందని భావించారు. కానీ మన దేశంలో ఫైరీ రెడ్ మరియు ఆక్వా టీల్ కలర్స్ లో కాకుండా సాధారణ వైట్, సిల్వర్ మరియు గ్రే కలర్స్ లో లభిస్తుందని అభవిస్తున్నాము.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 2023 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది రాబోయే అప్డేటెడ్ 'మారుతి సుజుకి స్విఫ్ట్' కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. రాబోయే ఈ కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి మరియు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుగుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Source: Rushlane

Most Read Articles

English summary
New hyundai grand i10 nios facelift spied in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X